Jump to content

ఆవిరి (2019 సినిమా)

వికీపీడియా నుండి
ఆవిరి
సినిమా పోస్టర్
దర్శకత్వంరవిబాబు
రచనరవిబాబు
స్క్రీన్ ప్లేపి. సత్యానంద్
నిర్మాతరవిబాబు
తారాగణంరవిబాబు, నేహా చౌహాన్
ఛాయాగ్రహణంఎన్‌.సుధాక‌ర్ రెడ్డి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంవైది
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీs
1 నవంబరు, 2019
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆవిరి[1][2] 2019, నవంబరు 1న విడుదలైన తెలుగు భయానక చలనచిత్రం. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవిబాబు, నేహా చౌహాన్,[3] బేబీ శ్రీ ముక్తా ప్రధాన పాత్రలు పోషించారు.

రాజ్ (రవిబాబు), లీనా (నేహా చౌహాన్) దంపతులకు శ్రేయ, మున్ని అనే ఇద్దరు ఆడపిల్లలు. రాజ్ బిజినెస్‌మేన్. పిల్లలిద్దరికి ఆస్తమా ఉంటుంది. పిల్లలిద్దరూ స్విమ్మింగ్ చేస్తుండగా శ్రేయకు ఊపిరాడక స్మిమ్మింగ్ పూల్‌లోనే చనిపోతుంది. శ్రేయ చనిపోవడంతో లీనా ఆ ఇంట్లో ఉండలేకపోవడంతో వేరే ఇంటికి మారుతారు. కొత్త ఇంటికి వెళ్లాక చిన్న కూతురు మున్ని వింతగా ప్రవర్తిస్తూ, ఒక ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది. రెండుమూడు సార్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించిన మున్ని కోసం ఇంటికి సెక్యురిటీ లాకర్స్ ఏర్పాటు చేస్తుకుంటారు. ఒక రోజు మున్ని ఇంట్లో నుంచి మాయమైపోతోంది. అదే సమయంలో రాజ్‌ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న జాన్వీ (ప్రియా వడ్లమాని) కూడా కనిపించకుండా పోతుంది. జాన్వీ మిస్సింగ్ కేసు రాజ్ స్నేహితుడైన పోలీసు అధికారి వినోద్ (ముక్తా ఖాన్) విచారిస్తుంటాడు. ఆ కేసు విషయం గురించి రాజ్‌ను విచారిద్దామని అతని ఇంటికి వస్తే.. మున్ని కనిపించడం లేదన్న విషయం తెలిసి ఆ ఇంటి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తాడు. దాంతో వినోద్‌కు జరిగిన సంఘటనలన్ని తెలుస్తాయి. మున్నితో ఒక ఆత్మ ఉందని గ్రహించి, ఆత్మల గురించి తెలిసిన డాక్టర్ పవన్ శర్మ (భరణీ శంకర్)ను పిలిపిస్తాడు. అప్పటివరకు మామూలుగా ఉన్న రాజ్ భార్య లీనాలోకి ఒక్కసారిగా ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? మున్నిని ఎవరు తీసుకెళ్లారు? జాన్వీని ఎవరు చంపారు? అనేది మిగతా కథ.[4]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "First look of Ravibabu's Aaviri is out". The Times of India.
  2. "Creative poster of Aaviri". Samayam Tollywood.
  3. "Ravi babu's next project first look released". The Hans India.
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (1 November 2019). "'ఆవిరి' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 1 November 2019. Retrieved 1 November 2019.

ఇతర లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆవిరి