పి. సత్యానంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పైడిపల్లి సత్యానంద్
Satyanand.jpg
జననంపైడిపల్లి సత్యానంద్
ప్రసిద్ధిసినిమా రచయిత
మతంహిందూ
తండ్రిహనుమంతరావు
తల్లివెంకటరత్నమ్మ

పైడిపల్లి సత్యానంద్ సినిమా రచయితగా సుప్రసిద్ధుడు. వెంకటరత్నమ్మ, హనుమంతరావు ఇతని తల్లిదండ్రులు. ఇతడు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు మేనల్లుడు. ఇతడు రచయితగా పరిచయమైన తొలి చిత్రం మాయదారి మల్లిగాడు. ఆ తర్వాత 400కు పైగా సినిమాలకు పనిచేశాడు[1]. ఇతడు ఎన్.టి.రామారావు, ఎ.ఎన్.ఆర్,కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ లాంటి అగ్ర కథానాయకుల చిత్రాలకు తన రచనలతో అద్భుత విజయాలు అందించాడు. ఇతడు మల్లాది వెంకటకృష్ణమూర్తి వ్రాసిన "మిస్టర్ వి" నవల ఆధారంగా తీయబడిన ఝాన్సీ రాణి సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ ఆ సినిమా విజయవంతం కాలేదు[2].

సినిమాల జాబితా[మార్చు]

ఇతడు కథ/మాటలు/స్క్రీన్ ప్లే అందించిన కొన్ని తెలుగు సినిమాలు:

విడుదల సంవత్సరం సినిమా పేరు దర్శకత్వం నటీనటులు వివరాలు
1973 మాయదారి మల్లిగాడు ఆదుర్తి సుబ్బారావు కృష్ణ, మంజుల
1976 జ్యోతి కె.రాఘవేంద్రరావు మురళీమోహన్, జయసుధ మాటలు
1977 అర్ధాంగి ఎ.మోహనగాంధి మురళీమోహన్, జయసుధ మాటలు
1977 ఎదురీత వి.మధుసూధనరావు ఎన్.టి.రామారావు,వాణిశ్రీ మాటలు
1977 బ్రతుకే ఒక పండగ పి.చంద్రశేఖరరెడ్డి శ్రీధర్, చంద్రమోహన్ కథ, మాటలు
1978 కలియుగ స్త్రీ పి.సాంబశివరావు జయసుధ, చంద్రమోహన్ మాటలు
1979 కోతల రాయుడు కె.వాసు చిరంజీవి, మాధవి మాటలు
1980 చండీప్రియ కట్టా సుబ్బారావు శోభన్ బాబు, జయప్రద మాటలు
1980 మొగుడు కావాలి కట్టా సుబ్బారావు చిరంజీవి
1981 కొండవీటి సింహం కె.రాఘవేంద్రరావు ఎన్.టి.రామారావు, శ్రీదేవి కథ, మాటలు
1981 దేవుడు మామయ్య కె.వాసు శోభన్ బాబు, వాణిశ్రీ మాటలు
1981 న్యాయం కావాలి ఎ.కోదండరామిరెడ్డి చిరంజీవి, రాధిక మాటలు
1982 జస్టిస్ చౌదరి కె.రాఘవేంద్రరావు ఎన్.టి.రామారావు, శ్రీదేవి కథ
1985 అడవి రాజా కె.మురళీమోహనరావు శోభన్ బాబు, రాధ మాటలు
1986 చాదస్తపు మొగుడు శరత్ సుమన్, భానుప్రియ మాటలు
1987 అజేయుడు జి.రామమోహనరావు వెంకటేష్, శోభన మాటలు
1987 దొంగ మొగుడు ఎ.కోదండరామిరెడ్డి చిరంజీవి, రాధిక
1988 ఝాన్సీ రాణి పి. సత్యానంద్ రాజేంద్రప్రసాద్, భానుప్రియ దర్శకత్వం
1988 యముడికి మొగుడు రవిరాజా పినిశెట్టి చిరంజీవి, రాధ కథ
1989 అడవిలో అభిమన్యుడు అనిల్ జగపతి బాబు, ఐశ్వర్య మాటలు, స్క్రీన్ ప్లే
1989 అత్తకి యముడు అమ్మాయికి మొగుడు ఎ.కొదండరామిరెడ్డి చిరంజీవి, విజయశాంతి కథ
1990 కొదమ సింహం కె.నాగేశ్వరరావు చిరంజీవి, సోనమ్ మాటలు
1990 మా ఇంటి మహరాజు ముత్యాలసుబ్బయ్య మోహన్‌బాబు, వాణి విశ్వనాథ్ మాటలు
1990 సాహస పుత్రుడు రవిరాజా పినిశెట్టి సుమన్, రజని మాటలు
1991 క్షణక్షణం రామ్‌ గోపాల్ వర్మ వెంకటేష్, శ్రీదేవి మాటలు
1992 420 ఈ.వి.వి.సత్యనారాయణ నాగేంద్రబాబు మాటలు
2001 ప్రేమించు బోయిన సుబ్బారావు సాయి కిరణ్, లయ కథ
2002 టక్కరి దొంగ జయంత్ సి పరాంజి మహేష్ బాబు కథ, మాటలు
2003 జాని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ మాటలు
2004 అంజి కోడి రామకృష్ణ చిరంజీవి, నమ్రతా శిరోద్కర్ కథ
2007 మధుమాసం చంద్రసిద్ధార్థ సుమంత్, స్నేహ మాటలు
2008 కౌసల్యా సుప్రజా రామ సూర్యప్రసాద్ ఛార్మీ కౌర్ మాటలు
2008 నచ్చావులే రవిబాబు తనీష్, మాధవీలత స్క్రీన్ ప్లే
2013 నేనేం..చిన్నపిల్లనా..? పి.సునీల్ కుమార్ రెడ్డి రాహుల్ రవీంద్రన్, తన్వీవ్యాస్ మాటలు
2016 సోగ్గాడే చిన్నినాయనా కళ్యాణ్‌కృష్ణ కురసాల నాగార్జున, లావణ్య త్రిపాఠీ స్క్రీన్ ప్లే

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగము చలనచిత్రం ఫలితం
1989 నంది పురస్కారాలు ఉత్తమ స్క్రీన్‌ప్లే అడవిలో అభిమన్యుడు విజేత

మూలాలు[మార్చు]

బయటిలింకులు[మార్చు]