Jump to content

2013 నంది పురస్కారాలు

వికీపీడియా నుండి


2013 సంవత్సరానికి గాను నంది పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 2017, మార్చి 1వ తేదీన ప్రకటించబడ్డాయి.[1] ప్రభాస్ నటించిన మిర్చి ఉత్తమ చిత్రంగా బంగారునందిని గెలుచుకోగా, నా బంగారు తల్లి వెండినంది గెలుచుకుంది.[2] మిర్చి సినిమాలోని నటనకు ప్రభాస్ కి ఉత్తమ నటుడిగా, నా బంగారు తల్లి సినిమాలలోని నటనకు అంజలి పాటిల్ కి ఉత్తమ నటి అవార్డులు లభించాయి.[3] హేమా మాలినికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం,[4] వాణిశ్రీకి రఘుపతి వెంకయ్య అవార్డు,[5] దిల్ రాజుకి నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ పురస్కారం, ఎ. కోదండరామిరెడ్డికి బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డులు వచ్చాయి.[6]

2013 సంవత్సరానికి దర్శకుడు కోడి రామకృష్ణ అవార్డు కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరించాడు.[7]

జాబితా

[మార్చు]

2013 నంది పురస్కారాలు అందుకున్న వారి వివరాలు[8]

విభాగం విజేత సినిమాపేరు నంది రకం
ఉత్తమ చిత్రం వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మిర్చి బంగారు
ద్వితీయ ఉత్తమ చిత్రం సునీతా కృష్ణన్, రాజేష్ టచ్‌రివర్ నా బంగారు తల్లి వెండి
తృతీయ ఉత్తమ చిత్రం నాగార్జున అక్కినేని ఉయ్యాల జంపాల కాంస్య
ఉత్తమ దర్శకుడు దయా కొడవటిగంటి అలియాస్ జానకి వెండి
ఉత్తమ నటుడు ప్రభాస్ మిర్చి వెండి
ఉత్తమ నటి అంజలి పాటిల్ నా బంగారు తల్లి వెండి
ఎస్వీరంగరావు పురస్కారం విజయ నరేష్ పరంపర తామ్ర
ఉత్తమ ప్రతినాయకుడు సంపత్ రాజ్ మిర్చి తామ్ర
ఉత్తమ హాస్యనటుడు తాగుబోతు రమేష్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తామ్ర
ఉత్తమ సహాయ నటుడు ప్రకాష్ రాజ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తామ్ర
ఉత్తమ సహాయ నటి నదియా అత్తారింటికి దారేది తామ్ర
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత మేర్లపాక గాంధీ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తామ్ర
ఉత్తమ కథా రచయిత ఇంద్రగంటి మోహన కృష్ణ అంతకు ముందు... ఆ తరువాత... తామ్ర
ఉత్తమ మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్తారింటికి దారేది తామ్ర
ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అత్తారింటికి దారేది తామ్ర
ఉత్తమ కుటుంబ కథా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తామ్ర
అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం అత్తారింటికి దారేది తామ్ర
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు కొరటాల శివ మిర్చి తామ్ర
ఉత్తమ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరీ అంతగా (సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు) తామ్ర
ఉత్తమ గాయకుడు కైలాష్ ఖేర్ పండగలా దిగివచ్చాడు (మిర్చి) తామ్ర
ఉత్తమ గాయని కల్పనా రాఘవేంద్ర నవ మూర్తులైనట్టి (ఇంటింటా అన్నమయ్య) తామ్ర
ఉత్తమ ఎడిటర్ ప్రవీణ్ పూడి కాళిచరణ్ తామ్ర
ఉత్తమ బాల నటుడు విజయ సింహారెడ్డి భక్త సిరియాల్ తామ్ర
ఉత్తమ బాల నటి ప్రణవి ఉయ్యాల జంపాల తామ్ర
ఉత్తమ ఛాయాగ్రాహకుడు మురళీమోహన్ రెడ్డి కమలతో నా ప్రయాణం తామ్ర
ఉత్తమ కళాదర్శకుడు ఏ.ఎస్. ప్రకాష్ మిర్చి తామ్ర
ఉత్తమ కొరియోగ్రాఫర్ శేఖర్ వీజే గుండెజారి గల్లంతయ్యిందే తామ్ర
ఉత్తమ ఆడియోగ్రాఫర్ ఇ. రాధాకష్ణ బసంతి తామ్ర
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ తిరుమల శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య తామ్ర
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ శివ కుమార్ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య తామ్ర
ఉత్తమ ఫైట్ మాస్టర్ వెంకట్ నాగ్ కాళిచరణ్ తామ్ర
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ రవిశంకర్ బొమన్ ఇరానీ (అత్తారింటికి దారేది) తామ్ర
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీ మేల్ మిత్రా వరుణ మహి ఉయ్యాల జంపాల తామ్ర
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ యతిరాజ్ సాహసం తామ్ర
ఉత్తమ డాక్యుమెంటరీ భరత కీర్తిమూర్తులు తామ్ర
ఉత్తమ సందేశాత్మక చిత్రం విన్నర్‌ తామ్ర
ఉత్తమ సినీ పుస్తకం నందగోపాల్ సినిమాగా సినిమా తామ్ర
ప్రత్యేక బహుమతి చైతన్య కృష్ణ కాళిచరణ్‌ తామ్ర
ప్రత్యేక బహుమతి అంజలి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తామ్ర
ప్రత్యేక బహుమతి రమ్యశ్రీ ఓమల్లి తామ్ర
ప్రత్యేక బహుమతి కల్కిమిత్ర యుగ్మలి తామ్ర
ప్రత్యేక బహుమతి సిద్ధిఖీ నా బంగారుతల్లి తామ్ర

మూలాలు

[మార్చు]
  1. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
  2. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  3. సాక్షి, సినిమాలు (2 March 2017). "పండిన మిర్చి". Archived from the original on 2017-03-01. Retrieved 26 June 2020.
  4. Correspondent, Special. "S.P. Balasubrahmanyam, Hema Malini bag NTR awards".
  5. http://www.thehindu.com/news/national/andhra-pradesh/spb-hema-malini-bag-ntr-awards/article17821614.ece
  6. Correspondent, Special. "S.P. Balasubrahmanyam, Hema Malini bag NTR awards".
  7. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  8. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.