నదియా
Appearance
నదియా | |
---|---|
జననం | జరీనా 1966 అక్టోబరు 24 |
ఇతర పేర్లు | నదియా |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1984–1989; 1994 2004–ఇప్పటి వరకు |
జీవిత భాగస్వామి | శిరీష్ గోడ్‌బొలె (m.1988–ఇప్పటి వరకు) |
పిల్లలు | సనమ్(b.1996) జన(b.2001) |
తల్లిదండ్రులు | ఎన్. కె. మొయిదు, లలిత |
పురస్కారాలు | ఫిలింఫేర్ ఉత్తమ నటి ఫిలింఫేర్ ఉత్తమ విమర్శకుల నటి |
నదియా ప్రముఖ సినీ నటి. ఆమె అసలు పేరు జరీనా. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది.
బాల్యం
[మార్చు]ముంబైలో ముస్లిం కుటుంబంలో జన్మించింది. అక్కడే ప్రాథమిక, మాధ్యమిక విద్యను పూర్తిచేసింది.
సినీరంగ ప్రవేశం
[మార్చు]ఆమె మొదటిసారిగా 1984 లో మలయాళ సినిమాలో మోహన్ లాల్ సరసన నటించింది. 1988 లో ఆమె ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ అయిన శిరీష్ గోడ్‌బొలెను వివాహం చేసుకుని అమెరికాకు వెళ్లింది. తర్వాత కొంతకాలం యునైటెడ్ కింగ్‌డమ్లో నివాసమున్నారు.[4].
సినీ పునరాగమనం
[మార్చు]మళ్ళీ 2004లో ఓ తమిళ సినిమాతో పునఃప్రవేశించింది. 2013 లో తెలుగు సినిమా మిర్చి లో ప్రభాస్ అమ్మగా, పవన్ కల్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమాలో కథానాయకుడికి అత్తగా నటించిన పాత్రలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]- ఎల్జీఎం (2013)
- మిర్చి (2013 సినిమా) (2013)
- అత్తారింటికి దారేది (2013)
- మిస్ ఇండియా (2020)
- దృశ్యం 2 (2021)
- ది వారియర్ (2022)
- ఓ తండ్రి ఓ కొడుకు (1994)
పురస్కారాలు
[మార్చు]- నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ సహాయ నటి (అత్తారింటికి దారేది)[5][6][7][8]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-07-26. Retrieved 2015-10-22.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-19. Retrieved 2015-10-22.
- ↑ https://www.youtube.com/watch?v=5JCvw3nKtrQ
- ↑ "JB Junction with Nadiya Moidu". kairalionline.com. Retrieved 31 March 2015.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.