2007 నంది పురస్కారాలు
స్వరూపం
నంది పురస్కారాలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. తెలుగు చరిత్ర, కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు,, ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది. ఆ రోజులలో చిత్ర నిర్మాణము చాలా తక్కువగా ఉండేది, ఏడాదికి సుమారు 25 నుండి 30 వరకు చిత్రాలు మాత్రమే తయారవుతుండేవి. రాను రాను వాటి సంఖ్య 125 నుండి 130 వరకూ పెరిగింది. చిత్ర నిర్మాణం సరళి, నాణ్యత, ప్రమాణాలు తగ్గుతూ భారీ వ్యయ ప్రయాసలకు లోనవుతుంది. మొదటిలో బంగారు, రజిత, కాంస్య నంది అనే 3 బహుమతులూ కథకు 2 బహుమతులూ, మొత్తము 5 పురస్కారాలుండేవి. చిత్ర నిర్మాణములో అన్ని శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ఇప్పుడు 42 నందులకు పెరిగినవి.
| వర్గం | విజేత | చిత్రం |
|---|---|---|
| ఉత్తమ చలనచిత్రం | వి. ఈశ్వర్ రెడ్డి | మీ శ్రేయోభిలాషి |
| రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | శేఖర్ కమ్ముల | హ్యాపీ డేస్ |
| మూడవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | ఓ.శ్రీనివాస్ | లక్ష్యం |
సూచనలు
[మార్చు]- ↑ "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.