శేఖర్ కమ్ముల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శేఖర్ కమ్ముల
Sekhar Kammula (Director).jpg
సినివారంలో శేఖర్ కమ్ముల
జననం (1972-02-04) 1972 ఫిబ్రవరి 4 (వయస్సు: 48  సంవత్సరాలు)
భువనగిరి, తెలంగాణ భారతదేశం
నివాసంపద్మారావు నగర్, హైదరాబాదు
వృత్తిదర్శకుడు, నిర్మాత, రచయిత
ప్రసిద్ధులుసినిమాలు, సాఫ్ట్వేర్
మతంహిందూమతం

శేఖర్ కమ్ముల ప్రముఖ తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, సినీ రచయిత.[1] ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా సినిమాలకు దర్శకుడు. ఆరు నంది పురస్కారాలు అందుకున్నాడు.

వ్యక్తిగతం[మార్చు]

శేఖర్ 1972, ఫిబ్రవరి 4 న హైదరాబాదులో జన్మించాడు. సికింద్రాబాద్‌లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాడు. సెయింట్ అల్ఫోన్సా కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత అమెరికాలోని న్యూజెర్సీలో కంప్యూటర్ సైన్సులో పీజీ కోసం వెళ్ళాడు. కొద్ది కాలం సమాచార సాంకేతిక రంగంలో పనిచేసిన తర్వాత వాషింగ్టన్‌లోని హోవార్డ్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరాడు.

సినీ యాత్ర[మార్చు]

దర్శకుడిగా ఆయన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్. ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది.[2]. తరువాత ఆయన దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్నిచ్చింది. సినిమాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాల్లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి.

చిత్రాలు[మార్చు]

  1. డాలర్ డ్రీమ్స్ (2000)
  2. ఆనంద్ (2004)
  3. గోదావరి (2006)
  4. హ్యాపీ డేస్ (2007)
  5. లీడర్ (2010)
  6. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2013)
  7. అనామిక (2014)
  8. ఫిదా (2017)

మూలాలు[మార్చు]

  1. పులగం, చిన్నారాయణ. "ఎదలో గానం... పెదవే మౌనం..." sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 25 October 2016.
  2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2011-01-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-08. Cite web requires |website= (help)