ఫిదా
ఫిదా | |
---|---|
దర్శకత్వం | శేఖర్ కమ్ముల |
రచన | శేఖర్ కమ్ముల |
స్క్రీన్ ప్లే | శేఖర్ కమ్ముల |
నిర్మాత | దిల్ రాజు శిరీష్ |
తారాగణం | వరుణ్ తేజ సాయి పల్లవి సాయిచంద్ |
ఛాయాగ్రహణం | విజయ్ సి. కుమార్ |
కూర్పు | మార్తాండ్ కె వెంకటేష్ |
సంగీతం | పాటలు: శక్తికాంత్ కార్తీక్ నేపధ్య సంగీతం: J.B. |
నిర్మాణ సంస్థ | శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ |
విడుదల తేదీ | 21 జూలై 2017 |
సినిమా నిడివి | 134 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 15 కోట్లు |
బాక్సాఫీసు | 40 కోట్లు(తొలివారం రాబడి) |
ఫిదా 2017లో విడుదలయిన హాస్య-శృంగార భరిత తెలుగు చలనచిత్రం. శేఖర్ కమ్ముల ఈ చిత్ర రచయిత, దర్శకులు.[1] వరుణ్ తేజ్, సాయిపల్లవి ముఖ్య పాత్రల్లో నటించారు. సాయిపల్లవికిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి అభిప్రాయాలు వచ్చాయి.[2]
కథ
[మార్చు]వరుణ్ అమెరికాలోని టెక్సాస్ లో వైద్యవిద్య నభ్యసిస్తుంటాడు. తన అన్న పెళ్ళికి తెలంగాణాలోని బాన్సువాడకి వస్తాడు. అక్కడ పెళ్ళి కూతురు చెల్లెలు భానుమతిని చూసి ప్రేమలో పడతాడు. భానుమతి చాలా స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. అక్క పెళ్ళై అమెరికా వెళ్ళిపోవడం చూసి బాధ పడుతుంది. తను మాత్రం పెళ్ళైనా తండ్రితోనే ఉండిపోవాలనుకుంటుంది. వరుణ్ కి తన ప్రేమను వ్యక్తం చేసి అతను భారత్ లోనే ఉండిపొమ్మని కోరాలనుకుంటుంది. కానీ వరుణ్ కి మాత్రం అమెరికాలోని మంచి విశ్వవిద్యాలయంలో చేరి న్యూరో సర్జన్ కావాలనుకుంటూ ఉంటాడు. అక్కడి అవకాశాల గురించి గొప్పగా చెబుతుండగా విన్న భానుమతి తన ప్రేమను మొగ్గలోనే తుంచేస్తుంది.
తారాగణం
[మార్చు]ఈ సినిమాలో వరుణ్ తేజ్, సాయిపల్లవి ముఖ్య పాత్రల్లో నటించారు. సాయిపల్లవికిది తొలి తెలుగు చిత్రం. గీత రచయిత సీతారామశాస్త్రి తనయుడు రాజా ఇందులో ఓ పాత్ర పోషించాడు.
- వరుణ్ గా వరుణ్ తేజ్
- భానుమతి గా సాయి పల్లవి
- భానుమతి తండ్రిగా సాయిచంద్
- రాజా చెంబోలు
- శరణ్య ప్రదీప్
- మాస్టర్ ఆర్యన్
- రాజా
- సత్యం రాజేష్
- గీతా భాస్కర్
- గాయత్రి గుప్తా
పాటలు
[మార్చు]శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శక్తికాంత్ ఇంతకు మునుపు శర్వానంద్ కథానాయకుడిగా వచ్చిన కో అంటే కోటి చిత్రానికి స్వరాలు సమకూర్చాడు. కీరవాణి దగ్గర కీబోర్డు వాయించే జీవన్ నేపథ్య సంగీతం రూపొందించాడు. సంగీతం ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "వచ్చిండే" | సుద్దాల అశోక్ తేజ | మధుప్రియ, రాంకీ | 5:41 |
2. | "ఏదో జరుగుతోంది" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | అరవింద్ శ్రీనివాస్, రేణుక | 5:00 |
3. | "హే పిలగాడా" | వనమాలి | సింధురి, సినోవ్ రాజ్ | 4:08 |
4. | "ఊసుపోదు" | చైతన్య పింగళి | హేమచంద్ర | 4:33 |
5. | "హే మిస్టర్" | వనమాలి | దీపక్ | 3:32 |
6. | "ఫిదా" | చైతన్య పింగళి | హేమచంద్ర, మాళవిక | 5:21 |
పురస్కారాలు
[మార్చు]సైమా అవార్డులు
[మార్చు]2017 సైమా అవార్డులు
- ఉత్తమ గీత రచయిత (సుద్దాల అశోక్ తేజ - వచ్చిండే)
మూలాలు
[మార్చు]- ↑ Dundoo, Sangeetha Devi. "Sekhar Kammula: Girls in my family were smarter". thehindu.com. ది హిందు. Retrieved 2 January 2018.
- ↑ "నేను 'ఫిదా' అయ్యాను: ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్". Archived from the original on 2017-07-30. Retrieved 2017-07-30.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)