సుద్దాల అశోక్ తేజ
సుద్దాల అశోక్ తేజ | |
---|---|
![]() సుద్దాల అశోక్ తేజ | |
జననం | గుర్రం అశోక్ తేజ మే 16, 1960 |
వృత్తి | సినిమా పాటల రచయిత కథా రచయిత, ఉపాధ్యాయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఠాగూర్ సినిమాలో నేను సైతం పాట |
జీవిత భాగస్వామి | నిర్మల |
పిల్లలు | జ్వాలా చైతన్య, అర్జున్ తేజ, & స్వప్న |
తల్లిదండ్రులు |
|
వెబ్‌సైటు | http://www.suddalaashokteja.in/ |
సుద్దాల అశోక్ తేజ తెలుగు సినిమా కథ, పాటల రచయిత. సుమారు 1200కి పైగా చిత్రాల్లో 2200 పై చిలుకు పాటలు రాశాడు.[1][2] ఠాగూర్ (2003) చిత్రంలో ఆయన రచించిన నేను సైతం అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందాడు.[3]
తొలి జీవితం[మార్చు]
ఆయన 1960, మే 16 న యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో పుట్టాడు. ఈయన ఇంటిపేరు గుర్రం. ఆయన తండ్రి హనుమంతు ప్రజాకవి. తెలంగాణా విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించాడు. వీరి స్వంత ఊరు సుద్దాల కాబట్టి ఈయనను అందరూ సుద్దాల హనుమంతు అని పిలిచేవారు. ఆయన గుర్తుగా తన ఇంటి పేరు, తర్వాత తరాలకు కూడా సుద్దాల గా మార్చుకున్నాడు. తల్లి జానకమ్మ. అశోక్ తేజ తల్లిదండ్రులిద్దరూ స్వాతంత్ర్య సమరయోధులు. హనుమంతు 75 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వ్యాధితో మరణించాడు.
బాల్యం నుంచే అశోక్ తేజ పాటలు రాయడం నేర్చుకున్నాడు. సినీ పరిశ్రమకు రాక మునుపు అశోక్ తేజ మెట్పల్లిలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవాడు.
నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. సినీ నటుడు ఉత్తేజ్‌కు ఈయన మేనమామ. తనికెళ్ళ భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు. అయితే ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం దాసరి నారాయణరావుని కలవడం. కృష్ణవంశీ లాంటి దర్శకుల సినిమాల్లో మంచి మంచి పాటలు రాశాడు. తొలుత తండ్రియైన సుద్దాల హనుమంతు నేపథ్యం వల్ల అన్ని విప్లవగీతాలే రాయాల్సి వచ్చింది. కృష్ణవంశీ లాంటి దర్శకుల ప్రోద్బలంతో తన పాటల్లో అన్ని రసాలు ఒలికించాడు. ఒసేయ్ రాములమ్మా, నిన్నే పెళ్ళాడతా సినిమాలో పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.[4]
రచనలు[మార్చు]
కవిత్వం[మార్చు]
ప్రసిద్ధి చెందిన పాటలు[మార్చు]
- ఆలి నీకు దండమే, అర్దాంగి నీకు దండమే
- నేను సైతం - ఠాగూర్
- నేలమ్మ నేలమ్మ నేలమ్మా..
- ఒకటే జననం ఒకటే మరణం - భద్రాచలం
- దేవుడు వరమందిస్తే... నే నిన్నే కోరుకుంటానే
- నువు యాడికేళ్తే ఆడికోస్త సువర్ణా
- ఏం సక్కగున్నావో నా సోట్టసేంపలోడా - ఝుమ్మంది నాదం
- మీసాలు గుచ్చకుండా - చందమామ
- నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ - [[గోవిందుడు అందరి వాడేలే]]
సినిమాలు[మార్చు]
- పలాస 1978 (2020)[5][6]
- కుబుసం
- భీమదేవరపల్లి బ్రాంచి (2023)
పుస్తకాలు, ప్రచురణలు[మార్చు]
పురస్కారాలు[మార్చు]
2003 సంవత్సరానికి అశోక్ తేజకు (ఠాగూర్ సినిమాలోని "నేను సైతం" పాటకు) "జాతీయ ఉత్తమ గీత రచయిత" పురస్కారం లభించింది. ఇది తెలుగు సినీ గేయ రచయితలకు అందిన మూడవ పురస్కారం. అంతకుముందు శ్రీశ్రీకి అల్లూరి సీతారామరాజు సినిమాలో "తెలుగు వీర లేవరా" అనే పాటకు, వేటూరి సుందరరామమూర్తికి (మాతృదేవోభవ సినిమాలో "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" పాటకు) లభించాయి. 2009లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లాశాఖ "కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం" అందించింది.[7]
సైమా అవార్డులు[మార్చు]
సైమా అవార్డులు: ఉత్తమ గీత రచయిత
- 2017: "వచ్చిండే" (ఫిదా)
ఇతర వివరాలు[మార్చు]
2010 అక్టోబరు 13లో సుద్దాల ఫౌండేషన్ ను ప్రారంభించి తన తల్లిదండ్రుల పేరిట సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారంను ఏర్పాటుచేసి ప్రతి ఏటా సాహిత్యంలో విశిష్ట సేవలు చేసిన వారికి ఈ పురస్కారంతో సత్కారిస్తారు.
బయటి మూలాలు[మార్చు]
ఇవికూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]

- ↑ "శ్రీశ్రీని ఆవాహన చేసుకున్నా!". eenadu.net. ఈనాడు. 26 April 2018. Archived from the original on 26 April 2018. Retrieved 26 April 2018.
- ↑ భావరాజు, పద్మిని. "సుద్దాల అశోక్ తేజ గారితో ముఖాముఖి". acchamgatelugu.com. Archived from the original on 26 December 2016. Retrieved 19 December 2016.
- ↑ ఈనాడు. "ఈ పురస్కారం ప్రజలకు అంకితం". Archived from the original on 15 August 2017. Retrieved 15 August 2017.
- ↑ http://suddala.wordpress.com/2004/08/27/suddala-ashok-teja-interview-by-telugu-cinema
- ↑ ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: పలాస 1978". Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
- ↑ టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (January 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Infobox person using residence
- Commons category link is on Wikidata
- నంది పురస్కారాలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- తెలుగు సినిమా పాటల రచయితలు
- నంది ఉత్తమ గీత రచయితలు
- తెలుగు కళాకారులు
- 1960 జననాలు
- భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు
- యాదాద్రి భువనగిరి జిల్లా సినిమా పాటల రచయితలు
- కొండేపూడి సాహితీ సత్కార గ్రహీతలు