Jump to content

ఝుమ్మందినాదం (సినిమా)

వికీపీడియా నుండి
ఝుమ్మంది నాదం
దర్శకత్వంకె. రాఘవేంద్రరావు
రచనభూపతి రాజా
గోపీమోహన్
బి. వి. ఎస్. రవి
రాజా సింహ
నిర్మాతమంచు లక్ష్మి
తారాగణంమంచు మనోజ్
తాప్సీ
మోహన్ బాబు
సుమన్
ఛాయాగ్రహణంఎస్. గోపాల్ రెడ్డి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్
విడుదల తేదీ
1 జులై 2010 (2010-07-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఝుమ్మందినాదం 2010 , జూలై 1 న విడుదలైన తెలుగు చిత్రం. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ కుమార్, తాప్సీ నాయకా నాయికలుగా నటించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

బాలు అనే యువకుడికి జీవితంలో ఒకటే లక్ష్యం. ఎప్పటికైనా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం లాగా మంచి గాయకుడు కావాలని. తమ ఊర్లో ఉన్న జమీందారుతో పందెం వేసి గాయకుడిగా పేరు తెచ్చుకోవడం కోసం హైదరాబాదుకు వస్తాడు. కెప్టెన్ రావు అతని ఎదురింట్లో ఉంటాడు. అతనికి కొత్త తరం పిల్లలు జీవన శైలి నచ్చదు. దానిని అసహ్యించుకుంటూ ఉంటాడు. శ్రావ్య అనే అమ్మాయి ప్రవాసుడైన రావు స్నేహితుడి కూతురు. ఆమె సాంప్రదాయ తెలుగు సంగీతం మీద ఒక డాక్యుమెంటరీ తీయడం కోసం హైదరాబాదుకు వచ్చి రావు దగ్గరే ఉంటుంది. బాలు ఆమెకు సహాయం చేస్తుంటాడు. నెమ్మదిగా వీరిద్దరు ప్రేమలో పడతారు. కెప్టెన్ రావుకు ఇది నచ్చదు. చివరికి ఆ జంట తమ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారు? తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనేది మిగతా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

పాటలు

[మార్చు]

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: ఎం. ఎం. కీరవాణి.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."సరిగమపదని"వేదవ్యాసఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం4:43
2."లాలీ పాడుతున్నది"సుద్దాల అశోక్ తేజఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, గీతా మాధురి, ఎం. కె. బాలాజీ, దీపు5:13
3."గోవింద హరి గోవింద"వేదవ్యాసఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం2:30
4."ఏం సక్కగున్నావ్రో"సుద్దాల అశోక్ తేజఅనుజ్ గుర్వారా, చైత్ర అంబడిపూడి 
5."సన్నాయి మ్రోగింది"సుద్దాల అశోక్ తేజఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సునీత, మాళవిక, చైత్ర అంబడిపూడి5:52
6."దేశమంటే"చంద్రబోస్ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చైత్ర అంబడిపూడి, మౌనిక5:00
7."నిగ్రహం"చంద్రబోస్రంజిత్ 
8."బాలమణి"చంద్రబోస్కార్తీక్, శివాని 
9."ఎంతెంత"చంద్రబోస్కృష్ణ చైతన్య, సునీత 

బయటి లింకులు

[మార్చు]