మంచు లక్ష్మి
స్వరూపం
మంచు లక్ష్మి | |
---|---|
జననం | మంచు లక్ష్మీప్రసన్న 1977 అక్టోబరు 8 |
ఎత్తు | 5"5 |
జీవిత భాగస్వామి | ఆండీ శ్రీనివాసన్ |
మంచు లక్ష్మి భారతీయ నటి, నిర్మాత. ఈమె నటుడు మోహన్ బాబు కుమార్తె. ఈమె పూర్తిపేరు మంచు లక్ష్మీ ప్రసన్న .
కుటుంబము
[మార్చు]ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ నటులే. తండ్రి కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు. సోదరులు మంచు విష్ణువర్థన్, మంచు మనోజ్ కుమార్ ఇద్దరూ నటులే.
వివాహము
[మార్చు]ఈమె వివాహము ప్రవాస భారతీయుడు ఆండీ శ్రీనివాసన్ తో జరిగింది. ఈయన అమెరికా వాసి.
పురస్కారాలు
[మార్చు]- నంది పురస్కారం ఉత్తమ విలన్ గా అనగనగా ఓ ధీరుడు చిత్రానికి ఎన్నుకోబడింది.
- సైమా అవార్డులు (2011)లో సైమా ఉత్తమ ప్రతినాయకురాలు (అనగనగా ఓ ధీరుడు)
- దొంగాట సినిమా లో ఏందిరో అనే పాటకు గాను గామా అవార్డ్స్ లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డు ని అందుకుంది.
- తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్: ఉత్తమ సహాయ నటి (చందమామ కథలు)
- స్పెషల్ జూరి అవార్డ్ దొంగాట
- గుండెల్లో గోదారి సినిమాకు ఉత్తమ సహాయనటిగా సైమా అవార్డు
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రము | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2008 | ద ఒడే | నజ్మా | ఆంగ్లము | |
2009 | డెడ్ ఎయిర్ | గబ్బి | ఆంగ్లము | |
2011 | అనగనగా ఓ ధీరుడు | ఐరేంది | తెలుగు | 2012 నంది పురస్కారము: ఉత్తమ ప్రతినాయిక |
2011 | దొంగల ముఠా | శివ | తెలుగు | |
2012 | డిపార్ట్‍మెంట్ | సత్యా భోస్లే | హిందీ | |
2012 | ఊ..కొడతారా ఉలిక్కిపడతారా | అమృతవల్లి | తెలుగు | |
2013 | కడలి | సెలీనా | తెలుగు,తమిళం | |
2013 | గుండెల్లో గోదారి | చిత్ర | తెలుగు, తమిళం | |
2015 | బుడుగు | పూజ | తెలుగు | |
2017 | లక్ష్మీ బాంబ్ | జడ్జి లక్ష్మి, ప్రియ | తెలుగు | |
2018 | W/O రామ్ | దీక్ష | తెలుగు | |
2020 | మా వింత గాధ వినుమా | తెలుగు | ||
2021 | పిట్ట కథలు | స్వరూపక్క | తెలుగు | |
2022 | మాన్‌స్టర్ | దుర్గ / కేథరీన్ అలెగ్జాండ్రా | మలయాళం | తొలి మలయాళ చిత్రం |
2024 | ఆదిపర్వం | [2] |
బయటి లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ http://www.telugufirst.com/telugu-tv/tv-shows/254-manchu-lakshmi-new-show-at-etv.htm[permanent dead link]
- ↑ Zee News Telugu (19 March 2024). "మంచు లక్ష్మి ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ 'ఆది పర్వం'". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.