W/O రామ్
W/O రామ్ | |
---|---|
దర్శకత్వం | విజయ్ యలకంటి |
స్క్రీన్ ప్లే | విజయ్ యలకంటి |
కథ | విజయ్ యలకంటి |
నిర్మాత | టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభొట్ల |
తారాగణం | మంచు లక్ష్మి సామ్రాట్ రెడ్డి ప్రియదర్శి పులికొండ ఆదర్శ్ బాలకృష్ణ |
ఛాయాగ్రహణం | సామల భాస్కర్ |
కూర్పు | బిక్కిన తిమ్మరాజు |
సంగీతం | రఘు దీక్షిత్ |
నిర్మాణ సంస్థలు | |
విడుదల తేదీ | 2018 |
దేశం | India |
భాష | Telugu |
W/O రామ్ 2018 లో విడుదలైన తెలుగు సినిమా.
కథ
[మార్చు]దీక్ష (మంచు లక్ష్మి), ఆమె భర్త రామ్ (సామ్రాట్) రోడ్డు మీద పడి ఉంటారు. దీక్షకు స్పృహ వచ్చేసరికి ఆసుపత్రిలో ఉంటారు. అప్పటికే ఆమె భర్త, కడుపులో బిడ్డ చనిపోయారని తెలుస్తుంది. అయితే తన భర్తది ప్రమాదం కాదని ఎవరో కావాలనే చంపారని పోలీసులతో చెబుతుంది దీక్ష. వాళ్లు మిగిలిన చాలా కేసుల్లాగే ఈ కేసును కూడా పట్టించుకోరు. ఎలాంటి ఆధారాలు లేవని కేసు మూసి వేస్తారు. వాళ్ల వ్యవహారాన్ని గమనించిన దీక్ష స్వయంగా రంగంలోకి దిగుతుంది. తన భర్త హత్య జరిగిన ప్రదేశాల్లో సొంతంగా పరిశోధన చేసి కొన్ని ఆధారాలు కనుక్కుంటుంది. ఇందులో ఆమెకు రమణా చారి (ప్రియదర్శి) సాయం చేస్తాడు. ఇంతకీ ముసుగు వేసుకున్న హంతకుడిని దీక్ష పట్టుకోగలిగిందా? లేదా? ఆమె భర్తను ఎవరు చంపారు? మధ్యలో రాఖీ (ఆదర్శ్ ) ఎవరు? అతనికి, స్నేహకి ఏంటి సంబంధం? దీక్షకి, స్నేహకి ఉన్న అనుబంధం ఏంటి? వంటివన్నీ కథలో భాగం.[1]
తారాగణం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాణ సంస్థలు: మంచు ఎంటర్టైన్మెంట్,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
- సంగీతం : రఘు దీక్షిత్
- నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, మంచు లక్ష్మీ
- సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
- ఛాయాగ్రహణం: సామల భాస్కర్
- కూర్పు: బిక్కిన తిమ్మరాజు
- కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: విజయ్ యలకంటి