గుండెల్లో గోదారి
గుండెల్లో గోదారి | |
---|---|
దర్శకత్వం | నాగేంద్ర కుమార్ |
నిర్మాత | మంచు లక్ష్మి |
తారాగణం | ఆది పినిశెట్టి మంచు లక్ష్మి సందీప్ కిషన్ తాప్సీ |
ఛాయాగ్రహణం | ఎం. ఆర్. పళనికుమార్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | మంచు ఎంటర్టైన్మెంట్ |
పంపిణీదార్లు | బ్లూ స్కయ్ (విదేశాలు) [1] |
విడుదల తేదీ | 8 మార్చి 2013 |
సినిమా నిడివి | 131 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు తమిళం |
గుండెల్లో గోదారి నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో 2013 మార్చి 8న విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో ఆది పినిశెట్టి, మంచు లక్ష్మి, సందీప్ కిషన్, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం దివిసీమ ఉప్పెన నేపథ్యంలో తెరకెక్కింది.
కథ
[మార్చు]అప్పుడే పెళ్ళయిన మల్లి (ఆది పినిశెట్టి), చిత్ర (మంచు లక్ష్మి) ఇంకా పెళ్ళిపీటలు దిగకముందే వారుంటున్న గ్రామాన్ని గోదావరి వరద చుట్టుముడుతుంది. వధూవరులిద్దరూ ఈదుకుంటూ ఒక ఆధారాన్ని దొరకబుచ్చుకుంటారు. చావుకు దగ్గరైన జీవితాలు ఒకరి గతాన్ని ఒకరు చెప్పుకోవడానికి ఉపక్రమించడంతో చిత్ర కథ మొదలవుతుంది. వారిరువురికీ ఎదురైన గతానుభవాలే చిత్రకథ సమాహారం.
నటవర్గం
[మార్చు]- ఆది పినిశెట్టి—మల్లి
- మంచు లక్ష్మి—చిత్ర
- సందీప్ కిషన్—సూరి
- రవిబాబు—దొరబాబు
- తాప్సీ—సరళ
- ప్రవీణ్
- జీవా
- పృథ్వీ రాజ్
- అన్నపూర్ణ
- ధన్ రాజ్
- సుజా వరుణీ —బంగారి
- ముమైత్ ఖాన్ - ప్రత్యేక గీతం
- రమేశ్
- ప్రీతి అస్రాని
సాంకేతిక నిపుణులు
[మార్చు]- దర్శకత్వం - నాగేంద్ర కుమార్
- సంగీతం -- ఇళయరాజా
- ఛాయాగ్రహణం -- ఎం. ఆర్. పళని కుమార్
సంగీతం
[మార్చు]- గుండెల్లో గోదారి
గానం - ఇళయరాజా, రచన - చంద్రబోస్
- జిల్లుమంది జిల్లుమంది
గానం - ఆండ్రియా & హేమచంద్ర, రచన - అనంత శ్రీరామ్
- వెచ్చాని వయసు
గానం - గీతా మాధురి, రచన - ఆర్. రాము
- నను నీతో
గానం - భవతారిణి, రచన - అనంత శ్రీరామ్
- ఎక్కడుంది నా కోడి
గానం - మనో & అనిత, రచన - అనంత శ్రీరామ్
- ఆ ఈది కుర్రోడు
గానం - రమ్యా ఎన్ఎస్కె, రచన - ఆర్. రాము
- రాతిరి
గానం - శ్రీ వర్ధిని, రచన - పళని భారతి
పురస్కారాలు
[మార్చు]సైమా అవార్డులు
[మార్చు]2013 సైమా అవార్డులు
- ఉత్తమ సహాయనటి (మంచు లక్ష్మీ)
బయటి లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "BlueSky bags Gundello Godari overseas rights". timesofap.com. Archived from the original on 2013-03-09. Retrieved March 5, 2013.