సందీప్ కిషన్
సందీప్ కిషన్ | |
---|---|
![]() | |
జననం | |
జాతీయత | భారతీయుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2008–present |
బంధువులు |
|
సందీప్ కిషన్ తెలుగు, హిందీ, తమిళ చిత్రాలలో కనిపించే ఒక భారతీయ చలన చిత్ర నటుడు. గతంలో ఇతను దర్శకుడు గౌతమ్ మీనన్ యొక్క వారణం ఆయిరం (2008) చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశాడు.
ప్రారంభ జీవితం, విద్య[మార్చు]
సందీప్ చెన్నైకి చెందిన తెలుగు కుటుంబంలో మే 7 1987 న జన్మించారు. తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవారు. ఆయన చెన్నైలోని లయోలా కాలేజీ నుండి పట్టభద్రుడైనాడు. ఆయన బంధువులు "ఛోటా కె.నాయుడు", "శ్యాం కె.నాయుడు.[1][2]
కెరీర్[మార్చు]
'స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్ బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో టాప్ మూవీస్‌లో హీరోగా అవకాశం తెచ్చుకున్న సందీప్ తెలుగు వాడు. తెలుగులో 'ఎల్.బి.డబ్యూ'ఫేం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో మిక్కీ.జే.మేయర్ సంగీత దర్శకత్వంలో రూపోందుతున్న రోటీన్ లవ్‌స్టోరిలో సోలో హీరోగా చేస్తూ తమిళంలో రెడ్‌పోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకుటున్న 'యారుడ మహేష్' అనే చిత్రం కూడా చేస్తుండడం విశేషం. ఈ రెండు చిత్రాలు 70% చిత్రీకరణ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
మంచు లక్ష్మి నిర్మాతగా మాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'గుండెల్లో గోదారి' అనే మల్టీ స్టారర్ చిత్రంలో సందీప్‌కిషన్‌తో పాటు ఆది పినిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి నటిస్తున్నారు. ఇందులో మాస్ యాక్షన్ హీరోగా తన పాత్ర వుండడం విశేషం. అలాగే 'ఓరు' ఫేం ఆనంద్‌రంగా నిర్మిసున్న ద్విభాషా చిత్రంలో కూడా సందీప్‌కిషన్ హీరోగా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.
మీడియా విషయాలు[మార్చు]
జూన్ 2014 లో ఆయన తాగిన మత్తులో కారు నడుపడం వల్ల అరెస్టు కాబడినాడని మీడియాలో అసత్య ప్రచారం జరిగింది. దానికి ఆయన ప్రతిస్పందిస్తూ మీడియా నిజాలను పరిశీలించి సరైన విధంగా ప్రచురించాలని కోరాడు.[3]
ఫిల్మోగ్రఫీ[మార్చు]
సంవత్సరం | చిత్రం | పాత్ర | భాష | నోట్సు |
---|---|---|---|---|
2008 | స్నేహ గీతం | అర్జున్ | తెలుగు | |
2009 | ప్రస్థానం | చిన్నా | తెలుగు | |
2011 | షోర్ ఇన్ ద సిటీ | సావన్ | హిందీ | |
2012 | రొటీన్ లవ్ స్టోరీ | సందీప్ (సంజు) | తెలుగు | |
2013 | గుండెల్లో గోదారి | సూరి | తెలుగు | |
యారుడా మహేశ్(తమిళం) \ మహేష్ (తెలుగు) | శివ | తమిళం | ||
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ | సందీప్ (సంజు) | తెలుగు | ||
ఢి ఫర్ దోపిడి | రాజు | తెలుగు | ||
2014 | డి.కె.బోస్ | బోస్ , పోలీస్ ఆఫీసర్ | తెలుగు | |
రారా...కృష్ణయ్య | కిట్టు | తెలుగు | ||
`జోరు[4] | సందీప్ | తెలుగు | ||
2015 | బీరువా | సంజు | తెలుగు | |
2017 | శమంతకమణి | కోటిపల్లి శివ | తెలుగు | |
2018 | మనసుకు నచ్చింది | సూరజ్ | తెలుగు | |
నెక్ట్స్ ఏంటి | సందీప్ సంజు | |||
2019 | తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ | తెనాలి రామకృష్ణ | తెలుగు | |
2021 | ఎ1 ఎక్స్‌ప్రెస్ | సందీప్ నాయుడు | తెలుగు | |
2021 | గల్లీ రౌడీ | తెలుగు | రిలీజ్ కి సిద్ధం [5] |
మూలాలు[మార్చు]
- ↑ "Off the beaten track". Chennai, India: The Hindu. May 9, 2010.
- ↑ "Sundeep Kishan Signs Two More Films". cinegoer.com. June 29, 2009. Archived from the original on 2012-09-29. Retrieved 2014-07-14.
- ↑ "Sundeep Kishan offended by incorrect news about his Arrest". 25cineframes.com. Archived from the original on 2014-07-14. Retrieved June 15, 2014.
- ↑ The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.
- ↑ Andhrajyothy (7 May 2021). "'గల్లీ రౌడీ'లోని 'పుట్టెనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ..' పాట విడుదల". Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.
ఇతర లింకులు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సందీప్ కిషన్ పేజీ
- Sundeep Kishan on twitter.com
- Sundeep Kishan on facebook.com