నెక్ట్స్ ఏంటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెక్ట్స్ ఏంటి
దర్శకత్వంకునాల్ కోహ్లీ
స్క్రీన్ ప్లేకునాల్ కోహ్లీ
నిర్మాతసచిన్ జోషి
రైనా జోషి
అక్షయ్‌ పురి
తారాగణంతమన్నా
సందీప్ కిషన్
నవదీప్
లారిస్సా బొనెసి
ఛాయాగ్రహణంమనీష్ చంద్ర భట్
కూర్పుఅనిల్ కుమార్ బొంతు
సంగీతంలియోన్ జేమ్స్
విడుదల తేదీ
7 డిసెంబరు 2018 (2018-12-07)
సినిమా నిడివి
117 నిముషాలు
దేశంఇండియా
భాషతెలుగు

నెక్ట్స్ ఏంటి 2018, డిసెంబర్ 7న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] సచిన్ జోషి, రైనా జోషి, అక్షయ్‌ పురి నిర్మించిన ఈ చిత్రానికి 'హమ్ తుమ్', 'ఫనా' చిత్రాలు తీసిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించాడు. తమన్నా,సందీప్ కిషన్, నవదీప్, లారిస్సా బొనెసి ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం, మనీష్ చంద్ర భట్ ఛాయాగ్రాహణం అందించారు. ఈ చిత్రం వెన్ హర్రీ మెట్ షెల్లీ చిత్రం ఆధారంగా తెరకెక్కింది.[3][4]

టానీ (త‌మ‌న్నా), సంజూ (సందీప్ కిష‌న్‌) ప్రేమించుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ బేధాల‌తో విడిపోతారు. పెళ్ళై, ఆరేళ్ల పాప ఉన్న క్రిష్ (న‌వ‌దీప్‌) టానీకి ప‌రిచ‌యం అవుతాడు. టానీ - క్రిష్ అభిప్రాయాలు క‌ల‌వ‌డంతో క‌ల‌సి ప్ర‌యాణం చేస్తుంటారు. సంజూకి తనలాంటి భావాలున్న రోషిణితో నిశ్చితార్థం జ‌రుగుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఇది అతనికి తొలిచిత్రం. ఈ చిత్రంలోని అన్ని పాటలను రామజోగయ్య శాస్త్రి రాశాడు.

నీ బోసి నవ్వు , విజయ్ ప్రకాష్

లవ్ ఉత్సవం , బెన్నీ దయాళ్ , జొనితా గాంధీ

నా నవ్వే , శశడ్ తిరుపతి , కపిల్ నాయర్

ఓ నో నెవెర్ , ఆశ్ కింగ్, ఎం ఎం మనసి

ఒంటరిగానే, సత్య ప్రకాశ్ ధర్మర్

మూలాలు

[మార్చు]
  1. "Tamannaah, Sundeep Kishan starrer titled Next Enti!". The Hans India. 8 November 2018. Retrieved 28 September 2019.
  2. "Release date locked for Next Enti".
  3. Chowdhary, Y. Sunita (5 October 2017). "Soul-searching for Sundeep Kishan". The Hindu. Retrieved 28 September 2019.
  4. "Never talked more openly about love, sex in Telugu films: Tamannaah on Next Enti". thenewsminute.com. Retrieved 28 September 2019.