శరత్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శరత్ బాబు
Shri Sharath Babu, Actor of the film ‘ Shankara Punyakoti’ at the presentation of the film, during the 40th International Film Festival (IFFI-2009), at Panaji, Goa on November 25, 2009.jpg
శరత్ బాబు
జననం
సత్యం బాబు దీక్షిత్

(1951-07-31) 1951 జూలై 31 (వయసు 71)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1973–ప్రస్తుతం
జీవిత భాగస్వామిరమాప్రభ (-1988)

శరత్ బాబు ఒక విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు.[1] ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేతా వాళ్లు (కె.ప్రభాకర్‌, కె.బాబూరావు) సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్‌బాబుగా మార్చారు.

హీరోగా శరత్ బాబు తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు. అటుపిమ్మట సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు.

పురస్కారాలు[మార్చు]

వీరు 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొదటిసారి సీతాకోక చిలుక, రెండవసారి ఓ భార్య కథ, మూడవసారి నీరాజనం సినిమాలలో తన నటనకు లభించాయి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

శరత్ బాబు 1951 జులై 31 న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించాడు. ఆయన జన్మనామం సత్యనారాయణ దీక్షిత్.

శరత్ బాబు సినిమాలలో నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి అయిన రమాప్రభను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగేళ్ళు పెద్ద, వీరి వివాహం పద్నాలుగేళ్ల తర్వాత విడాకులతో అంతమైంది. 2007లో తెలుగు సినిమా.కాంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాప్రభ, నేను ఆసరా కోసం పెళ్ళిచేసుకుంటే, శరత్ బాబు అవసరానికి పెళ్ళిచేసుకున్నాడని, తమది పరస్పర అవకాశవాదపు పెళ్ళి అని చెప్పింది.[2]

నటించిన తెలుగు సినిమాల జాబితా[మార్చు]

  1. కన్నెవయసు (1973)
  2. రామరాజ్యం (1973)
  3. నోము (1974)
  4. అభిమానవతి (1975)
  5. అమెరికా అమ్మాయి (1976)
  6. బంగారు మనిషి (1976)
  7. మంచికి మరోపేరు (1976)
  8. వింత ఇల్లు సంత గోల (1976)
  9. కన్య - కుమారి (1977)
  10. చిలకమ్మ చెప్పింది (1977)
  11. జీవిత నౌక (1977)
  12. పల్లెసీమ (1977)
  13. పంతులమ్మ (1978)
  14. మరో చరిత్ర (1978)
  15. రామకృష్ణులు (1978)
  16. ఊర్వశీ నీవే నా ప్రేయసి (1979)
  17. ఇది కథ కాదు (1979)
  18. గుప్పెడు మనసు (1979)
  19. తాయారమ్మ బంగారయ్య (1979)
  20. శృంగార రాముడు (1979)
  21. మూడు ముళ్ళ బంధం (1980)
  22. రచయిత్రి (1980)
  23. 47 రోజులు (1981)
  24. ఇంద్రుడు చంద్రుడు (1981)
  25. తొలికోడి కూసింది (1981)
  26. బాలనాగమ్మ (1981)
  27. రాధా కల్యాణం (1981)
  28. సీతాకోకచిలుక (1981)
  29. ఏకలవ్య (1982)
  30. పన్నీరు పుష్పాలు (1982)
  31. పెళ్లీడు పిల్లలు (1982)
  32. యమకింకరుడు (1982)
  33. శ్రీలక్ష్మీనిలయం (1982)
  34. అమరజీవి (1983)
  35. గాజు బొమ్మలు (1983)
  36. తోడు నీడ (1983)
  37. పులిదెబ్బ (1983)
  38. రుద్రకాళి (1983)
  39. సాగర సంగమం (1983)
  40. కాంచన గంగ (1984)
  41. మేమూ మీలాంటి మనుషులమే (1984)
  42. సితార (1984)
  43. స్వాతి (1984)
  44. అనురాగబంధం (1985)
  45. అన్వేషణ (1985)
  46. ఆత్మబలం (1985)
  47. ఉక్కు మనిషి (1985)
  48. ఊరికి సోగ్గాడు (1985)
  49. కర్పూర దీపం (1985)
  50. దర్జా దొంగ (1985)
  51. విష కన్య (1985)
  52. శిక్ష (1985)
  53. స్వాతిముత్యం (1985)
  54. కాష్మోరా (1986)
  55. ఖైదీరాణి (1986)
  56. జీవన పోరాటం (1986)
  57. దాగుడు మూతలు (1986)
  58. నిప్పులాంటి మనిషి (1986)
  59. పసుపుతాడు (1986)
  60. భయం భయం (1986)
  61. భలే భయం (1986)
  62. సంసారం ఓ సంగీతం (1986)
  63. స్రవంతి (1986)
  64. ఉదయం (1987)
  65. కల్యాణ తాంబూలం (1987)
  66. గౌతమి (1987)
  67. చిన్నారి దేవత (1987)
  68. చైతన్యరథం (1987)
  69. ప్రేమ దీపాలు (1987)
  70. రేపటి స్వరాజ్యం (1987)
  71. విశ్వనాధ నాయకుడు (1987)
  72. సంకీర్తన (1987)
  73. సంసారం ఒక చదరంగం (1987)
  74. ఆగష్టు 15 రాత్రి (1988)
  75. ఆత్మకథ (1988)
  76. ఆణిముత్యం (1988)
  77. ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988)
  78. కాంచన సీత (1988)
  79. చిన్ని కృష్ణుడు (1988)
  80. జీవన జ్యోతి (1988)
  81. రక్తాభిషేకం (1988)
  82. సగటు మనిషి (1988)
  83. విజయ్ (1989)
  84. చెట్టుకింద ప్లీడరు (1989)
  85. నా మొగుడు నాకే సొంతం (1989)
  86. నీరాజనం (1989)
  87. పగలే వెన్నెల (1989)
  88. ప్రాణ స్నేహితులు (1989)
  89. యమపాశం (1989)
  90. స్వాతి చినుకులు (1989)
  91. అగ్గిరాముడు (1990)
  92. ఆడపిల్ల (1991)
  93. ఆపద్బాంధవుడు (1992)
  94. మృగతృష్ణ (1992)
  95. వదినగారి గాజులు (1992)
  96. శాంభవి (1993)
  97. శివరాత్రి (1993)
  98. నీకు 16 నాకు 18 (1994)
  99. హలో బ్రదర్ (1994)
  100. సిసింద్రీ (1995)
  101. నేను ప్రేమిస్తున్నాను (1997)
  102. తోడు (1997)
  103. సింహం (1997)
  104. రైతురాజ్యం (1999)
  105. అన్నయ్య (2000)
  106. ఇష్టం (2001)
  107. సాహస బాలుడు విచిత్ర కోతి(2001)
  108. నువ్వు లేక నేను లేను (2002)
  109. శంఖారావం (2004)
  110. రెండేళ్ళ తర్వాత (2005)
  111. అస్త్రం (2006)
  112. ఏవండోయ్ శ్రీవారు (2006)
  113. ఆట (2007)
  114. చంద్రహాస్ (2007)
  115. సింధూరి (2008)
  116. మగధీర (2009)
  117. నాగవల్లి (2010)[3]
  118. శుభప్రదం (2010)
  119. నేనేం..చిన్నపిల్లనా..? (2013)
  120. బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ (2013)
  121. అస్త్రం (2016)
  122. ఎంత మంచివాడవురా! (2020)[4][5]

మూలాలు[మార్చు]

  • క్వాలిటీ నా బాట...మంచి కోసం నా వేట, శరత్ బాబు ఆంధ్రప్రభ విశేష ప్రచురణ మోహిని (అరవై ఎనిమిది సంవత్సరాల తెలుగు సినిమా ప్రస్థానం) 1999లో ప్రచురించిన వ్యాసం.
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-09. Retrieved 2009-04-23.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-11. Retrieved 2009-04-23.
  3. "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.
  4. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  5. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=శరత్_బాబు&oldid=3799334" నుండి వెలికితీశారు