శంఖారావం (2004 సినిమా)
శంఖారావం | |
---|---|
దర్శకత్వం | ఎ. మోహన గాంధీ |
రచన | పోసాని కృష్ణమురళి (మాటలు) మరుధూరి రాజా రచన ఖాదర్ మొహియుద్దీన్ (సహకారం) |
కథ | మేఘన మూవీ మేకర్స్ |
నిర్మాత | బి. భువనేశ్వరరెడ్డి |
తారాగణం | అనంత్ నాగ్ శరత్ బాబు శ్రీనాధ్ రాజీవ్ కనకాల |
ఛాయాగ్రహణం | జనార్థన్ రాయపాటి |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | మేఘన మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 4 ఏప్రిల్ 2004 |
సినిమా నిడివి | 135 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శంఖారావం, 2004 ఏప్రిల్ 4న విడుదలైన తెలుగు సినిమా.[1] పద్మాలయా స్టూడియోస్ బి. భువనేశ్వరరెడ్డి నిర్మాణ సారథ్యంలో ఎ. మోహన గాంధీ దర్శకత్వం వహించిన ఈసినిమాలో అనంత్ నాగ్, శరత్ బాబు, శ్రీనాధ్, రాజీవ్ కనకాల నటించగా,[2] వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చాడు.[3][4]
కథా సారాంశం
[మార్చు]ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఉన్న సమస్యలు, ఆ సమస్యలపై ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యంతో నలుగురు నిరుద్యోగ యువకులు (శ్రీనాధ్, రాజీవ్ కనకాల, కృష్ణ భగవాన్, రాజా) బాధపడుతుంటారు. ముఖ్యమంత్రిని కలవడానికి, తమ సమస్యల గురించి చెప్పడానికి వారు హైదరాబాద్ వెలుతారు. కానీ వారు ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం రాలేదు.
ఇదిలావుండగా, ముఖ్యమంత్రి చంద్ర రాయుడు (అనంత్ నాగ్), ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రెడ్డి (శరత్ బాబు) ప్రయాణిస్తున్న కారు నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్లేటప్పుడు క్లేమోర్ గనులను ఉపయోగించి పేల్చివేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ ఇద్దరు ముఖ్యమైన నాయకులు చనిపోయారని ప్రపంచం మొత్తం నమ్ముతున్న సమయంలో, ఈ నలుగురు యువకులు వారిని సజీవంగా బయటికి తీసుకొస్తారు.
మారువేషంలో తమ గ్రామంలో ఉండి గ్రామాల్లో ఏమి జరుగుతుందో గమనించాలని ఇద్దరు నాయకులను నలుగురు యువకులు అభ్యర్థిస్తారు. ఈ రాజకీయ నాయకులు గ్రౌండ్ రియాలిటీలను ఎలా అర్థం చేసుకుంటారు, గ్రామాల సమస్యల పట్ల వారి వైఖరిని ఎలా మార్చుకుంటారు అనేది మిగిలిన కథ.
నటవర్గం
[మార్చు]- అనంత్ నాగ్ (చంద్ర రాయుడు)
- శరత్ బాబు (రాజేంద్ర రెడ్డి)
- శ్రీనాధ్
- రాజీవ్ కనకాల
- కృష్ణ భగవాన్
- అమృత
- ఎవిఎస్
- శివకృష్ణ
- జయప్రకాష్ రెడ్డి
- నర్రా వెంకటేశ్వరరావు
- వినోద్
- రఘునాధ రెడ్డి
- అహుతి ప్రసాద్
- సూర్య
- తెలంగాణ శకుంతల
- తెనాలి శకుంతల
పాటలు
[మార్చు]ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, నిస్సార్, ఉమామహేశ్వరరావు, విశ్వ పాటలు రాశాడు. వందేమాతరం శ్రీనివాస్, నాగూర్ బాబు, రవివర్మ, విశ్వ, కౌసల్య పాటలు పాడారు.
- లోకం పోకడ
- వెన్నెల చిన్నెల
- మొదలటి రేయి
- నన్ను ఏలుకోరా మామ
మూలాలు
[మార్చు]- ↑ "Sankharavam (2004)". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-05-21.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Movie (2004) | Reviews, Cast & Release Date in - BookMyShow". in.bookmyshow.com. Retrieved 2021-05-21.
- ↑ "Telugu cinema Review - Sankharavam - Srinadh, Rajiv Kanakala, Anant Nag, Sarath Kumar - Mohan Gandhi". Idlebrain.com. 2004-04-02. Retrieved 2016-07-22.
- ↑ WoodsDeck. "Sankharavam Telugu Movie Reviews, Photos, Videos (2004)". WoodsDeck (in ఇంగ్లీష్). Retrieved 2021-05-21.
- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2004 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన సినిమాలు
- పోసాని కృష్ణ మురళి సినిమాలు
- శరత్ బాబు నటించిన సినిమాలు
- రాజీవ్ కనకాల నటించిన సినిమాలు
- కృష్ణ భగవాన్ నటించిన సినిమాలు
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- జయప్రకాశ్ రెడ్డి నటించిన సినిమాలు
- ఆహుతి ప్రసాద్ నటించిన సినిమాలు