Jump to content

రఘునాథ రెడ్డి

వికీపీడియా నుండి
(రఘునాధ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
రఘునాథ రెడ్డి
తెలుగు సహాయనటుడు రఘునాథ రెడ్డి
జననం
రఘునాథ రెడ్డి

విజయవాడ
మరణం2026 జనవరి 31
కుషాయిగూడ, హైదరాబాద్
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1991 - ప్రస్తుతం
భాగస్వామిఅన్నపూర్ణ
పిల్లలుసుధా లక్ష్మి
అరుణ
సుధాకర్ రెడ్డి
తల్లిదండ్రులు
  • కృష్ణారెడ్డి (తండ్రి)
  • సామ్రాజ్యమ్మ (తల్లి)

కలకోట రఘునాథ రెడ్డి (1943/1944 - 2026 జనవరి 31), ఒక ప్రముఖ సినీ నటుడు. ఆయన సుమారు 370కి పైగా సినిమాలలో నటించాడు. ఎక్కువగా సహాయ పాత్రలు పోషించాడు. తెలుగులోనే కాక హిందీ, తమిళం, భోజ్‌పురి సినిమాలలో నటించాడు. టీవీ సీరియళ్ళలో కూడా నటించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన స్వస్థలం విజయవాడ. ఆయన తండ్రి కృష్ణారెడ్డి, తల్లి సామ్రాజ్యమ్మ. ఆయన భార్య అన్నపూర్ణ. వీరికి ముగ్గురు పిల్లలు సుధా లక్ష్మి, అరుణ, సుధాకర్ రెడ్డి ఉన్నారు.[1] 1966 నుంచి 1996 దాకా నాటకాలు వేసాడు. 'ఆకాశ రామన్న', ' ధర్మో రక్షిత రక్షితః' వంటి నాటకాలతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు.

కెరీర్

[మార్చు]

ఆయన 1991లో పరుచూరి సోదరులు దర్శకత్వం వహించిన శోభన్ బాబు సినిమా సర్పయాగం సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత, ఆయన దాదాపు 370కి పైగా హిందీ, తమిళం, భోజ్‌పురి సినిమాలలో నటించాడు. ఆర్.నారాయణమూర్తి, మంచు మోహన్ బాబు సినిమాలలో ఎక్కువగా నటించాడు. అయితే అనారోగ్యానికి గురైన తర్వాత, ఆయన క్రమంగా సినిమాల్లో నటించడం తగ్గించాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా
2018 సుబ్రహ్మణ్యపురం
2011 శ్రీరామ రాజ్యం
2011 వస్తాడు నా రాజు
2012 శ్రీ వాసవి వైభవం
2010 గాయం 2
2009 మిస్టర్ గిరీశం
2009 నేరము - శిక్ష
2009 శంఖం
2009 జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా
2007 మా సిరిమల్లి
2007 నేటి మహాత్మ
2006 అయ్యప్ప దీక్ష
2006 బాస్
2006 సర్దార్ పాపన్న
2006 సైనికుడు
2005 బాలు
2005 గౌతం ఎస్.ఎస్.సీ
2005 భగీరథ
2005 సంక్రాంతి
2004 నేనుసైతం
2004 శివ్ శంకర్
2004 శంఖారావం
2004 మల్లీశ్వరి
2003 ఒట్టేసి చెపుతున్నా
2003 విలన్
2001 భలేవాడివి బాసు
2001 దాదాగిరి
2001 9 నెలలు
2001 ప్రేమసందడి
2000 ఆజాద్
2000 ఛలో అసెంబ్లీ
2000 దేవీ పుత్రుడు
2000 పాపే నా ప్రాణం
2000 సమ్మక్క సారక్క
1999 మారిన శృంగార పురుషుడు
1997 ప్రేమించుకుందాం రా
1997 ఒసేయ్ రాములమ్మ
1995 ఒరేయ్ రిక్షా
1997 కలెక్టర్ గారు
1999 స్వయంవరం
1998 యువరత్న రాణా
1998 పెళ్ళి పందిరి
1998 ఆహా
1998 శ్రీమతీ వెళ్ళొస్తా
1999 శీను
1999 సుల్తాన్

మరణం

[మార్చు]

రఘునాథ్ రెడ్డి 2026 జనవరి 31న రాత్రి హైదరాబాదు కుషాయిగూడలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు.[2][3][4][5] ఆయన వయస్సు 82. ఆయనకు భార్య అన్నపూర్ణ, ముగ్గురు సంతానం ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "రఘునాథ రెడ్డి ప్రొఫైలు". nettv4u.com. Retrieved 19 August 2016.
  2. "విషాదం.. టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత". Sakshi. 1 February 2026. Archived from the original on 1 February 2026. Retrieved 1 February 2026.
  3. "టాలీవుడ్ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూత.. కొడుకు చనిపోయిన నెల రోజులకే.!". V6 Velugu. 1 February 2026. Archived from the original on 1 February 2026. Retrieved 1 February 2026.
  4. "తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి…!". Zee News Telugu. 1 February 2026. Archived from the original on 1 February 2026. Retrieved 1 February 2026.
  5. "టాలీవుడ్‌లో విషాదం.. నటుడు రఘునాథరెడ్డి మృతి". Eenadu. 1 February 2026. Archived from the original on 1 February 2026. Retrieved 1 February 2026.

బయటి లింకులు

[మార్చు]