9 నెలలు
9 నెలలు | |
---|---|
దర్శకత్వం | క్రాంతి కుమార్ |
రచన | గణేష్ పాత్రో (మాటలు) |
నిర్మాత | క్రాంతికుమార్ |
తారాగణం | విక్రమ్ సౌందర్య |
ఛాయాగ్రహణం | రాం ప్రసాద్ |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | వి.ఎస్. ఉదయ |
నిర్మాణ సంస్థ | శ్రీ క్రాంతి చిత్ర |
విడుదల తేదీ | 11 జనవరి 2000 |
సినిమా నిడివి | 135 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
9 నెలలు 2000, జనవరి 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ క్రాంతి చిత్ర పతాకంపై క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ , సౌందర్య జంటగా నటించగా, వి.ఎస్. ఉదయ సంగీతం అందిచాడు. ఈ చిత్రం 2000లో సినీ విమర్శకుల నుండి ప్రసంశలు అందుకుంది. విక్రమ్ నటించిన తమిళ చిత్రం సేతు విజయవంతమైన తరువాత ఈ చిత్రం రీషూట్ చేసి తమిళంలో కండెన్ సీతయ్యగా విడుదల చేయబడింది.[1] ఈ చిత్రం టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. దర్శకుడు ఈ చిత్రాన్ని కేవలం 15 రోజుల్లోనే చిత్రీకరించాడు.[2]
కథ
[మార్చు]అమాయక అనాథ సావిత్రి (సౌందర్య), తెలివైన కంప్యూటర్ ప్రోగ్రామర్ సురేంద్ర (విక్రమ్) చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. సావిత్రిని ఒక తాగుబోతు వివాహం చేసుకుంటుండగా, సురేంద్ర ఆపి, ఆమెను వివాహం చేసుకుంటాడు. ఏదేమైనా, దక్షిణ భారతదేశంలోని దేవాలయాలపై వర్చువల్ రియాలిటీ ప్రోగ్రాంను ఒక ప్రత్యర్థి సంస్థకు విక్రయించాడని సురేంద్రపై నేరం ఆరోపించబడుతుంది. అదే సమయంలోఅతనికి ట్రక్కును ఢీకొని తలకు తీవ్రమైన గాయమై, పెద్ద ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆపరేషన్ కు కావలసిన డబ్బుకోసం సావిత్రి ఎతం ప్రయత్నించినా ఆర్థిక సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఒక ధనవంతుడి కోసం కృత్రిమ గర్భధారణ ద్వారా గర్భవతి కావాలని, అందుకు తగిన ఆర్థిక సహాయం చేస్తారని లేడి డాక్టర్ చెప్పగా, సావిత్రి అంగీకరిస్తుంది. కృత్రిమ గర్భధారణ, సర్రోగేట్ మాతృత్వానికి సంబంధించిన సామాజిక కళంకమనే ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.
నట వర్గం
[మార్చు]- విక్రమ్ (సురేంద్ర)
- సౌందర్య (సావిత్రి)
- నూతన్ ప్రసాద్ (జడ్జి)
- తనికెళ్ళ భరణి (లాయర్)
- నర్రా వెంకటేశ్వర రావు
- ఎం. ఎస్. నారాయణ
- ఎల్. బి. శ్రీరామ్
- రఘునాథ రెడ్డి
- సుధ (సురేంద్ర తల్లి)
- పద్మ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- డా. నాగేష్
- గుండు సుదర్శన్
- ఉత్తేజ్
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత, దర్శకత్వం: క్రాంతి కుమార్
- మాటలు: గణేష్ పాత్రో
- సంగీతం: వి.ఎస్. ఉదయ
- ఛాయాగ్రహణం: రాం ప్రసాద్
- కూర్పు: శ్రీకర్ ప్రసాద్
- నిర్మాణ సంస్థ: శ్రీ క్రాంతి చిత్ర
నిర్మాణం
[మార్చు]ఈ చిత్రానికి సంగీతం అందించడానికి ఏ.ఆర్. రెహమాన్ సంతకం చేశాడు.[3] కానీ, బడ్జెట్ కారణాల వల్ల వైదొలిగాడు. ఈ చిత్రంలో సౌందర్య తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పింది.
విడుదల
[మార్చు]ఈ చిత్రంలో సౌందర్య, విక్రమ్ నటనకు ప్రసంశలు వచ్చాయి.[4] వివేక్, చాప్లిన్ బాలు, కుల్లమణి, మాయిల్సామి మొదలైన నటులతో కామెడీ ట్రాక్ చిత్రీకరించి కాండెన్ సీతయ్యగా తమిళంలో విడుదల చేయబడింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Balsubramaniam, Balaji (2000). "Kandane Seethayai". Thiraipadam.com. Archived from the original on 4 అక్టోబరు 2011. Retrieved 15 జూలై 2020.
- ↑ "Still the regular guy". 4 March 2005 – via www.thehindu.com.
- ↑ "The Complete Biography of A.R.Rahman - The A.R.Rahman Page". gopalhome.tripod.com.
- ↑ "9 Nelalu review: 9 Nelalu (Telugu) Movie Review - fullhyd.com".
- ↑ "Kanden Seethaiyai Tamil Full Movie(2001) | Vikram | Soundarya" – via www.youtube.com.
బయటి లంకెలు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 2000 తెలుగు సినిమాలు
- సౌందర్య నటించిన సినిమాలు
- నూతన్ ప్రసాద్ నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన సినిమాలు
- ఉత్తేజ్ నటించిన సినిమాలు
- సుధ నటించిన సినిమాలు