విక్రమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విక్రమ్
Vikram.jpg
జననం1966
పరమకుడి, తమిళనాడు
నివాసంమహాలింగపురం, కోడం బాక్కం, చెన్నై
వృత్తినటుడు
తల్లిదండ్రులు
 • వినోద్ రాజ్ (తండ్రి)

విక్రమ్ (ఆంగ్లం: Vikram) దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ నటుడు. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు సినిమా శివపుత్రుడు తమిళ మూలమైన పితామగన్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

తమిళనాడు లోని రామనాథపురం జిల్లా పరమకుడి ఆయన స్వస్థలం.[1] ఇదే ఊరు నుంచి ముగ్గురు జాతీయ ఉత్తమ నటులుండటం విశేషం. వారు చారుహాసన్, కమల్‌హాసన్, సుహాసిని. విక్రం తండ్రి వినోద్ రాజ్ పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు. నృత్యరంగంలోనూ ఆయనకు గుర్తింపు ఉంది. 2017 డిసెంబరు 31 న మరణించాడు. ఆయన చదువుకున్నది యార్కాడ్ లో. చెన్నై లోని లయోలా డిగ్రీ కళాశాల నుంచి బీఏ ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకున్నాడు. ఎంబీఏ కూడా అక్కడే చదివాడు.

విక్రమ్ కు ఆ అవార్డు రావడం వెనుక ఇరవయ్యేళ్ళ నిర్విరామమైన కృషి ఉంది. చదువుకోసం చెన్నైలో ఉన్నప్పుడు హాలీవుడ్ సినిమాలు పిచ్చిగా చూసేవాడు. చిన్నప్పటి నుంచి చదువు మీద కన్నా ఇతర వ్యాపకాల మీద ఎక్కువగా సమయం గడిపేవాడు. కరాటే, ఈత పోటీల్లో ప్రథముడిగా నిలిచేవాడు. గిటార్, పియానో వాయించడం నేర్చుకున్నాడు. తరచూ నాటకాల్లో నటించేవాడు. వాటిలో చాలా భాగం ఆంగ్ల నాటకాలే. విక్రమ్ తండ్రి వినోద్ నటుడు కావాలనుకున్నారు కానీ చివరకు ఇంజనీరుగా స్థిరపడ్డారు.

ఇష్టాలు[మార్చు]

విక్రమ్ కు బైక్ మీద స్వారీ అంటే చాలా ఇష్టం. ఆయనకు బాగా ఇష్టమైన బైక్ రాజ్‌దూత్.

సినిమాలు[మార్చు]

తెలుగులో విక్రమ్ మొదటి సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం. ఇందులో రాజేంద్రప్రసాద్ స్నేహితుడి పాత్రలో నటించాడు విక్రమ్. హీరోగా చేసిన చిరునవ్వుల వరమిస్తావా అనే సినిమా కొన్ని కారణాల వలన ఇప్పటికీ విడుదల కాలేదు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన బంగారు కుటుంబం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించడం ఒక గొప్ప అనుభూతి నిచ్చిందని చెబుతారాయన.

 1. అక్క పెత్తనం చెల్లెలి కాపురం (1993)
 2. చిరునవ్వుల వరమిస్తావా (1993)[2]
 3. బంగారు కుటుంబం (1994)
 4. ఆడాళ్ళా మజాకా (1995)
 5. అక్కా బాగున్నావా (1996)
 6. కుర్రాళ్ళ రాజ్యం (1997)
 7. 9 నెలలు (2001
 8. శివపుత్రుడు (2003)
 9. అపరిచితుడు (2005)
 10. మజా
 11. మల్లన్న
 12. రావణ్ (2010)
 13. నాన్న (2011)
 14. మిస్టర్ కేకే (2019)

మూలాలు[మార్చు]

 1. జూన్ 7, 2009 ఈనాడు ఆదివారం అనుబంధం సంచిక ఆధారంగా
 2. ఈటీవీ భారత్, సినిమా (17 October 2019). "తన రికార్డు తానే తిరగరాసే పనిలో విక్రమ్". www.etvbharat.com. Archived from the original on 12 May 2020. Retrieved 12 May 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=విక్రమ్&oldid=2932765" నుండి వెలికితీశారు