మహాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాన్
Mahaan 2022 poster.jpg
దర్శకత్వంకార్తీక్ సుబ్బరాజ్
రచనకార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతఎస్. ఎస్. లలిత్ కుమార్
నటవర్గం
ఛాయాగ్రహణంశ్రేయాస్ కృష్ణ
కూర్పువివేక్ హర్షన్
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థ
సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో
పంపిణీదారులుఅమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీలు
2022 ఫిబ్రవరి 10 (2022-02-10)
నిడివి
162 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

మహాన్‌ 2022లో విడుదలైన తెలుగు సినిమా. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో బ్యానర్‌పై ఎస్. ఎస్. లలిత్ కుమార్ ఎస్. ఎస్. లలిత్ కుమార్ ఈ సినిమాకు కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించాడు. విక్రమ్‌, ధ్రువ్‌ విక్రమ్‌, సిమ్రాన్, బాబీ సింహా, వాణీ భోజన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 ఫిబ్రవరి 3న[1], అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 2022 ఫిబ్రవరి 9న విడుదలైంది.[2]

కథ[మార్చు]

40 ఏళ్ల పాటు మద్య నిషేధానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కుటుంబంలో గాంధీ మహాన్ (విక్రమ్) జన్మించాడు. చిన్నతనంలో పేకాటకు అలవాటు పడ్డ గాంధీ మహాన్ తండ్రి మందలింపుతో దాన్ని వదిలేసి ఉన్నత చదువు చదివి ఆ తర్వాత కామర్స్ లెక్చలర్ గా సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఈ క్రమంలో ఆయనకు జీవితం మీద విరక్తి పుట్టి భార్య ఝాన్సీ (సిమ్రాన్) - దాదా (ధ్రువ్ విక్రమ్) ఇంట్లో లేని సమయంలో తనకు నచ్చినట్లుగా జీవించే ప్రయత్నం చేసి ఇంటికి తిరిగొచ్చిన ఝాన్సీ (సిమ్రాన్)కు దొరికిపోయి దాని వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరిగి భార్యా బిడ్డకు దూరమై ఒంటరివాడవుతాడు. ఆ తరువాత తన మిత్రుడు సత్యవాన్ (బాబీ సింహా)తో కలిసి మద్యం వ్యాపారం మొదలెట్టి లిక్కర్ కింగ్ గా ఎదుగుతాడు. దాని తరువాత మహాన్ కి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో
  • నిర్మాత: ఎస్. ఎస్. లలిత్ కుమార్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తిక్‌ సుబ్బరాజ్‌
  • సంగీతం: సంతోష్ నారాయణన్
  • సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ
  • స్టంట్స్: దినేష్ సుబ్బరాయన్
  • ఎడిటర్: వివేక్ హర్షన్

మూలాలు[మార్చు]

  1. 10TV (3 February 2022). "మహాన్ ట్రైలర్.. లెక్చరర్ లిక్కర్ కింగ్‌గా ఎందుకు మారాడు? | Mahaan Official Telugu Trailer." (in telugu). Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. Sakshi (8 February 2022). "ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే." Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
  3. Eenadu (11 February 2022). "రివ్యూ: మహాన్‌". Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
  4. A. B. P. Telugu (10 February 2022). "'మహాన్' రివ్యూ: తండ్రీ కొడుకుల మధ్య యుద్ధంలో విజయం ఎవరిది?". Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=మహాన్&oldid=3867528" నుండి వెలికితీశారు