సిమ్రాన్
స్వరూపం
సిమ్రాన్ | |
---|---|
జననం | రిషిబాల నావల్ 1979 ఏప్రిల్ 4 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
ఇతర పేర్లు | సిమ్రాన్ బగ్గా |
క్రియాశీల సంవత్సరాలు | 1995–ప్రస్తుతం |
ఎత్తు | 5 అ. 7 అం. (170 cమీ.) |
జీవిత భాగస్వామి | దీపక్ బగ్గా (2003–ప్రస్తుతం) |
సిమ్రాన్ తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కథానాయిక. ఉత్తరాదికి చెందిన ఈమెను తెలుగులో మొదటగా దర్శకుడు శరత్ తన చిత్రం అబ్బాయిగారి పెళ్లి ద్వారా పరిచయం చేసాడు. ఈమె పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం సినిమాలలో నటించింది.తెలుగులో 1999 నుంచి 2004 వరకు అగ్రకథానాయకగా కొనసాగింది.
జీవిత విశేషాలు
[మార్చు]- 1976 ఏప్రిల్ 4న సిమ్రాన్ జన్మించింది. ఈమె తండ్రి అశోక్ నావల్, తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. ఆమెకు సోదరీమణులు మోనల్ (మరణం 2002 ఏప్రిల్ 14), జ్యోతి, సోదరుడు సుమిత్ ఉన్నారు.
- ఈమె ముంబైలో డిగ్రీ చదివింది. ముందుగా మోడలింగ్ రంగంలో పనిచేసి, తరువాత సినిమాలలోకి వచ్చింది.
- ఈమె మొదటి చిత్రం "సనమ్ హార్‌జాయె" (హిందీ).
- దూరదర్శన్‌లో వచ్చే "సూపర్ హిట్ ముకాబలా" కార్యక్రమంలో ఈమె పాల్గొంది.
- తరువాత "తేరే మేరె సప్నె" హిందీ చిత్రం ద్వారా ఈమె ప్రేక్షకులకు సుపరిచిత అయ్యింది.
- దక్షిణాదిలో ఈమె మొదటి సినిమా మలయాళంలో "ఇంద్రప్రస్థం".
- తరువాత ఈమె తమిళ, తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించింది. తమిళ చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్‌స్టార్" అని పేరు తెచ్చుకొంది.
సిమ్రాన్ నటించిన తెలుగు చిత్రాలు
[మార్చు]- ధ్రువ నక్షత్రం (2023)
- రాకెట్రీ
- సీమరాజా
- మా నాన్నకు పెళ్ళి
- సమర సింహా రెడ్డి
- అబ్బాయిగారి పెళ్లి
- ఆటోడ్రైవర్
- అన్నయ్య
- డాడీ
- కలిసుందాం రా
- మా ఆయన చంటి పిల్లాడు
- మృగరాజు
- నరసింహ నాయుడు
- గొప్పింటి అల్లుడు
- వాలి (1999)
- జోడి
- నువ్వా నేనా (ముఖాముఖి)
- బ్రహ్మచారి
- పంచతంత్రం
- పరవశం
- అమృత
- గూఢచారి నం.1
- సింహబలుడు
- ఇంద్రప్రస్తం
- వీరన్న
- సింహపుత్రుడు
- టైమ్
- విఐపి
- ప్రియా ఓ ప్రియా
- బావ నచ్చాడు
- నువ్వు వస్తావని
- ఒక్క మగాడు
- ప్రేమతో, రా
- సీమ సింహం
- పెళ్లి కళ వచ్చేసిందే బాలా
- సీతయ్య
- యువరాజు
- ఆపద మొక్కులవాడు
- జాన్ అప్పారావ్ 40+
- రాకుమారుడు