మా ఆయన చంటి పిల్లాడు
మా ఆయన చంటి పిల్లాడు (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజా వన్నెంరెడ్డి |
---|---|
నిర్మాణం | బెక్కెం వేణుగోపాల్ |
కథ | రాజ్ కుమార్ (మూలకథ) |
తారాగణం | శివాజీ, మీరా జాస్మిన్ |
సంగీతం | ఎం.ఎం. శ్రీలేఖ |
సంభాషణలు | పి. రాజేంద్ర కుమార్ |
ఛాయాగ్రహణం | వాసు |
కూర్పు | వి. నాగిరెడ్డి |
నిర్మాణ సంస్థ | లక్కీ మీడియా |
విడుదల తేదీ | 28 జూలై 2008 |
నిడివి | 143 నిముషాలు |
భాష | తెలుగు |
పెట్టుబడి | 31 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మా ఆయన చంటి పిల్లాడు 2008, జూలై 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మాణ సారథ్యంలో రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, మీరా జాస్మిన్ జంటగా నటించగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది. 2001లో తమిళంలో వచ్చిన ఎన్ పురుషన్ కుజంధై మాధిరి అనే సినిమాకు రిమేక్ ఇది.[1][2]
కథా నేపథ్యం
[మార్చు]బుల్లబ్బాయి (శివాజీ) తన మరదలు రాజేశ్వరి (మీరా జాస్మిన్) ను ఇష్టపడతాడు. రాజేశ్వరి తనపై ఆసక్తి లేదని ప్రవర్తించినప్పటికీ, ఆమె అతన్ని నిజంగా ప్రేమిస్తుంది. బుల్లబ్బాయికి తన సవతి సోదరుడు వీరబాబు (సుబ్బరాజు) తో ఆస్తి వివాదం ఉంటుంది. చింతామణి (సంగీత) అనే అమ్మాయిని ఒక వేశ్యాగృహం యజమాని (అనురాధ) వీరబాబుకు అమ్మకుండా కాపాడే ప్రయత్నంలో, బుల్లబ్బాయి తన డబ్బు చెల్లించి చింతామణిని తనతో తీసుకెళ్ళి తన పెంట్‌హౌస్‌లో ఉంచుతాడు. తరువాతి రోజు ఆమెను అక్కడినుండి వెళ్ళిపొమ్మని చెబుతాడు. కాని అనుకోకుండా వీరబాబు మనుషులు బుల్లబ్బాయిపై దాడి చేయడంతో చింతామణితో రాత్రి గడుపుతాడు. నిజాయితీగల బుల్లబ్బాయి తన అత్తగారింటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, వివాహాన్ని ఆపమని కోరతాడు. జరిగిన విషయాన్ని రాజేశ్వరికి చెబుతాడు. రాజేశ్వరి ఆత్మహత్యాయత్నం చేయడంతో బుల్లబ్బాయి రక్షిస్తాడు. అయితే రాజేశ్వరి తన వైవాహిక జీవితాన్ని బుల్లబ్బాయితో పంచుకోవడానికి నిరాకరిస్తుంది. కొన్ని రోజుల తరువాత, ఆమె తండ్రి ఆమెను ఒప్పించి, బుల్లబ్బాయి నిజాయితీని గౌరవించమని విజ్ఞప్తి చేస్తాడు. దాంతో రాజేశ్వరి బుల్లబ్బాయిని అర్థం చేసుకుంటుంది. రాజేశ్వరి గర్భవతి అవుతుంది. చింతామణి కూడా. బుల్లబ్బాయి ఇద్దరిని తన భార్యలుగా ఎలా చూసుకున్నాడు, చింతామణి రాజేశ్వరి జీవితంలోకి వస్తుందా? చింతామణి కూడా గర్భవతి అని, బుల్లబ్బాయి ఆమెను కలుస్తూనే ఉన్నాడని రాజేశ్వరి ఏం చేస్తుంది? బుల్లబ్బాయి, వీరబాబు మధ్య ఆస్తి వివాదం ఏమి జరుగుతుందేది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- శివాజీ (బుల్లబ్బాయి)
- మీరా జాస్మిన్ (రాజేశ్వరి)
- సంగీత (చింతామణి)
- సుబ్బరాజు (సూరిబాబు)
- వేణుమాధవ్
- చంద్రమోహన్
- చిత్రం శ్రీను
- అన్నపూర్ణ
- సత్తన్న
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: రాజా వన్నెంరెడ్డి
- నిర్మాణం: బెక్కెం వేణుగోపాల్
- మూలకథ: రాజ్ కుమార్
- సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ
- సంభాషణలు: పి. రాజేంద్ర కుమార్
- ఛాయాగ్రహణం: వాసు
- కూర్పు: వి. నాగిరెడ్డి
- నిర్మాణ సంస్థ: లక్కీ మీడియా
- పాటలు: భాస్కరభట్ల రవికుమార్, రామజోగయ్య శాస్త్రి, కీ.శే. నారాయణ వర్మ
- డ్యాన్స్: స్వర్ణ, విజయ్ అంథోని
- పోరాటాలు: రామ్-లక్ష్మణ్
పాటలు
[మార్చు]- మొదటిసారి ముద్దుపెడితే - శ్రీకృష్ణ, గంగ - 4:30
- ఏమండోయ్ శ్రీవారు - విజయ్ యేసుదాస్, ఎం. ఎం. శ్రీలేఖ - 4:01
- ఏమి సేతుర లింగా - మాలతి, లక్ష్మణ్ - 4:09
- అడుగు అడుగు - గీతా మాధురి, జీన్స్ శ్రీనివాస్ - 3:54
- బావలు సయ్యా సై - రాధిక - 4:48
మూలాలు
[మార్చు]- ↑ https://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Meera-in-a-family-entertainer/articleshow/2575793.cms
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-12-30. Retrieved 2020-07-29.