అన్నపూర్ణ (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నపూర్ణ
అన్నపూర్ణ, తెలుగు సినిమా నటి.jpg
జననంవిజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
నివాసంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ఇతర పేర్లుఉమామహేశ్వరి, అన్నపూర్ణమ్మ
వృత్తిరంగస్థల, సినిమా నటి
క్రియాశీలక సంవత్సరాలు1970–ప్రస్తుతం

అన్నపూర్ణ, ఏడువందల సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు ఉమామహేశ్వరి.[1]

నాటకరంగం[మార్చు]

చిన్నతనంలోనే రంగస్థల ప్రవేశం చేసిన ఈమె తెనాలి నాటక సమాజాలలో అనేక పాత్రలు పోషించింది.[2] వీనిలో భయం, ఉలిపికట్టె, పల్లెపడుచు, పేదరైతు, కన్నబిడ్డ, కాంతా-కనకం, పూలరంగడు మొదలైనవి.

సినీ జీవితం[మార్చు]

1975లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు సరసన కథానాయకిగా తెలుగు సినీరంగంలో పరిచయమైంది. ఆ సినిమా నిర్మాణ సమయంలోనే దర్శకుడు దాసరి నారాయణరావు ఈమె పేరును అన్నపూర్ణగా మార్చాడు. ఈమె పుట్టి,పెరిగింది కృష్ణాజిల్లాలోని విజయవాడ. తండ్రి ప్రసాదరావు ఆర్టీసీలో పనిచేసాడు.తల్లి సీతారావమ్మ.ముగ్గురు ఆడపిల్లల్లో ఈమె పెద్ద. ఒక తమ్ముడు ఉన్నాడు.ఈమెకు 1974లో పెళ్ళి జరిగింది.25 సంవత్సరాల పాటు మద్రాసులో ఉండి తరువాత 1996లో హైదరాబాదు వచ్చి స్థిరపడింది.

పురస్కారాలు[మార్చు]

'మనిషికో చరిత్ర', 'డబ్బు భలే జబ్బు', 'మా ఇంటి ఆడపడుచు' సినిమాలకుగాను నంది అవార్డులు అందుకుంది.

అన్నపూర్ణ నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నవతెలంగాణ, సోపతి, స్టోరి (9 August 2015). "కోరుకున్న పాత్రలే చేశాను". బి.మల్లేశ్వరి. Archived from the original on 22 June 2018. Retrieved 22 June 2018.
  2. శ్రీమతి అన్నపూర్ణ, నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీలు: 310.

బయటి లింకులు[మార్చు]