పెళ్ళి చేసుకుందాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళి చేసుకుందాం
Pellichesukundam Movie Poster.jpg
పెళ్ళి చేసుకుందాం సినిమా పోస్టర్
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
కథా రచయితపోసాని కృష్ణమురళి
(మాటలు)
కథభూపతి రాజా
నిర్మాతసి. వెంకట రాజు
జి. శివరాజు
తారాగణంవెంకటేష్,
సౌందర్య,
లైలా
ఛాయాగ్రహణంకె. రవీంద్ర బాబు
కూర్పుగౌతంరాజు
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
గీత చిత్ర ఇంటర్నేషనల్
విడుదల తేదీ
1997 అక్టోబరు 9 (1997-10-09)
సినిమా నిడివి
141 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

పెళ్ళి చేసుకుందాం 1997, అక్టోబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. గీత చిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై సి. వెంకట రాజు, జి. శివరాజు నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్, సౌందర్య, లైలా నటించగా కోటి సంగీతం అదించాడు. శీలం అనేది శరీరానికి సంబంధించినది కాదు, మనసుకు సంబంధించిదన్న కథాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.[1][2]

కథా నేపథ్యం[మార్చు]

అత్యాచారానికి గురైన శాంతి (సౌందర్య) కు తోడుగా నిలిచిన ఒక లక్షాధికారి ఆనంద్ (వెంకటేష్) కథ ఈ పెళ్ళి చేసుకుందాం సినిమా. కాళీచరణ్ (మోహన్ రాజ్) చేసిన హత్యను చూసిన శాంతి, పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది. దానికి ప్రతీకారంగా కాళీచరణ్ తమ్ముడు (సత్య ప్రకాష్) శాంతిపై అత్యాచారం చేస్తాడు. దాంతో తల్లిదండ్రులు శాంతిని ఇంటినుండి వెళ్ళగొడతారు. విషయం తెలిసిన ఆనంద్, శాంతిని ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తాడు.

రోజులు గడుస్తున్నకొద్ది ఆనంద్, శాంతి ప్రేమలో పడతాడు. కానీ శాంతి అతణ్ణి దూరం పెడుతుంది. అదేసమయంలో ఆనంద్ మరదలు లైలా (లైలా) అమెరికా నుండి వచ్చి, ప్రేమిస్తున్నానంటూ ఆనంద్ వెంట పడుతుంది. ఆనంద్, శాంతిని ప్రేమిస్తున్నాడన్న విషయం తెలుసుకుని లైలా అమెరికా వెళ్ళిపోతుంది. అన్ని అడ్డంకులు తొలగి ఆనంద్, శాంతి ఒక్కటవ్వడం మిగతా కథ.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

Untitled

ఈ చిత్రానికి కోటి సంగీతం అందించాడు. అన్ని పాటలు హిట్ అయ్యాయి. సుప్రీమ్ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[3]

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "ఓ లైలా లైలా (రచన: భువనచంద్ర)"  మనో, స్వర్ణలత 4:37
2. "కోకిల కోకిల (రచన: సాయి శ్రీ హర్ష)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 5:03
3. "నువ్వేమి చేసావు నేరం (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"  కె. జె. ఏసుదాసు 4:48
4. "ఎన్నో ఎన్నో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర 4:20
5. "మనసున మనసై (రచన: చంద్రబోస్)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర 5:15
6. "గుమ గుమలాడే (రచన: చంద్రబోస్)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర 4:16
మొత్తం నిడివి:
28:25

రిమేక్ వివరాలు[మార్చు]

సంవత్సరం సినిమాపేరు భాష నటవర్గం ఇతర వివరాలు
1998 ఎన్ ఉయిర్ నీ తానే తమిళ ప్రభు, దేవయాని, మహేశ్వరి
1999 సుధూ ఎక్ బార్ బోలో బెంగాలీ ప్రోసెన్ జిత్ ఛటర్జీ, రితుపర్ణ సెంగుప్తా, మౌళి గంగూలీ
2001 హమారా దిల్ ఆప్కే పాస్ హై హిందీ అనిల్ కపూర్, ఐశ్వర్య రాయ్, సోనాలి బింద్రే
2001 మవుడే ఆగోన బా కన్నడ శివ రాజ్‌కుమార్, లయ

ఇతర వివరాలు[మార్చు]

డబ్బింగ్

మూలాలు[మార్చు]

  1. "Success and centers list - Venkatesh". idlebrain.com. Retrieved 14 June 2020.
  2. తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
  3. "Pelli Chesukundham - TeluguFilms Telugu Cinema, Telugu Films, Film Stars, Film Actresses, Telugu Songs Lyrics, Telugu Film Producers, Telugu Film Directors". Telugufilms.org. 2007-11-05. Archived from the original on 14 June 2020. Retrieved 14 June 2020.

ఇతర లంకెలు[మార్చు]