అనిల్ కపూర్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అనిల్ కపూర్ | |
---|---|
జననం | [1] చెంబూరు, ముంబై, మహారాష్ట్ర | 1956 డిసెంబరు 24
వృత్తి | నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1984 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సునీత కపూర్ (1984 – ప్రస్తుతం) |
పిల్లలు | సోనమ్ కపూర్ రియా కపూర్ హర్షవర్ధన్ కపూర్ |
తల్లిదండ్రులు | సురీందర్ కపూర్ (తండ్రి) నిర్మల్ (తల్లి) |
బంధువులు | బోనీ కపూర్ (సోదరుడు) సంజయ్ కపూర్ (సోదరుడు) అర్జున్ కపూర్ (మేనల్లుడు) శ్రీదేవి (వదిన) |
అనిల్ కపూర్ (జ: 1956 డిసెంబరు 24[1]) ఒక భారతీయ నటుడు, నిర్మాత. 100 కై పైగా బాలీవుడ్ సినిమాల్లోనూ, కొన్ని అంతర్జాతీయ చిత్రాల్లోనూ, టి వి ధారావాహికల్లోనూ నటించాడు. వంశవృక్షం అనే తెలుగు సినిమాతో ఆయన కథానాయక పాత్రలు వేయడం ప్రారంభించాడు. అంతర్జాతీయ చిత్రాల్లో ఆయన ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన స్లమ్ డాగ్ మిలియనీర్లో మొదటి సారిగా నటించాడు. రెండు జాతీయ సినిమా పురస్కారాలు, ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతో పాటు పలు పురస్కారాలు అందుకున్నాడు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]అనిల్ కపూర్ 1956 డిసెంబరు 24 న చెంబూరు, ముంబైలో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి సినీ నిర్మాత సురీందర్ కపూర్. నలుగురు పిల్లల్లో ఈయన రెండోవాడు. ఇతని అన్న బోనీ కపూర్ సినీ నిర్మాత. తమ్ముడు సంజయ్ కపూర్ నటుడు. పాఠశాల విద్య చెంబూరు లోని అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ సక్కర్ ఉన్నత పాఠశాల లోనూ, ఉన్నత విద్య సెయింట్ జేవియర్స్ కళాశాలలోనూ చదివాడు.[2]
కుటుంబం
[మార్చు]1984 లో ఆయన సునీతా కపూర్ ను వివాహమాడాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు (హర్షవర్ధన్). పెద్ద కుమార్తె సోనమ్ కపూర్ కథానాయిక. చిన్న కూతురు రియా కపూర్ న్యూయార్క్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని నిర్మాతగా మారింది. ఆయన అన్న బోనీ కపూర్ సినీ నిర్మాత. బోనీ కపూర్ నటి శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు.
కెరీర్
[మార్చు]అనిల్ కపూర్ 1970లోనే తు పాయల్ మే గీత్ అనే హిందీ సినిమాలో చిన్నప్పటి శశి కపూర్ లా నటించాడు.[3] అయితే ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.
1979లో ఉమేష్ మేరా దర్శకత్వంలో వచ్చిన హమారే తుమారే అనే సినిమాలో చిన్న పాత్రతో తెరమీద కనిపించాడు అనిల్. 1980 లో బాపు దర్శకత్వంలో వచ్చిన వంశవృక్షం అనే తెలుగు సినిమా ద్వారా కథానాయకుడిగా మారాడు. అదే సంవత్సరంలోనే ఏక్ బార్ కహో, హం పాంచ్ అనే రెండు హిందీ చిత్రాల్లో నటించాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 IANS (22 December 2012). "My dad is a liar: Sonam Kapoor". Hindustan Times. Archived from the original on 2013-09-27. Retrieved 2012-03-22.
- ↑ He lived in Tilak Nagar colony in Chembur. Anil Kapoor – Biography
- ↑ "Anil Kapoor in Tu Payal Mein Geet". itimes.com. 9 December 2009. Archived from the original on 1 అక్టోబరు 2015. Retrieved 6 September 2015.
ఇతర లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనిల్ కపూర్ పేజీ
- విస్తరించవలసిన వ్యాసాలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- భారతీయ నటులు
- 1956 జననాలు