రియా కపూర్
రియా కపూర్ | |
---|---|
జననం | ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం | 1987 మార్చి 5
విద్యాసంస్థ | న్యూయార్క్ విశ్వవిద్యాలయం |
వృత్తి | సినిమా నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2010 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | కరణ్ బూలానీ (m. 2021) |
తల్లిదండ్రులు | అనిల్ కపూర్ (తండ్రి) |
బంధువులు | సోనమ్ కపూర్ (సోదరి), హర్షవర్ధన్ కపూర్ (సోదరి) |
రియా కపూర్ (జననం 1987 మార్చి 5) (ఆంగ్లం: Rhea Kapoor) ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత.[1][2] ఆమె తన సోదరి సోనమ్ కపూర్‌తో కలసి ఫ్యాషన్ లైన్ రీసన్ (Rheson) యజమాని కూడా.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రియా కపూర్ బాలీవుడ్ కథానాయకుడు అనిల్ కపూర్, సునీతల కుమార్తె, ఆమె నటులు సోనమ్ కపూర్, హర్షవర్ధన్ కపూర్‌ల సోదరి. అలాగే ఆమె చిత్రనిర్మాత సురీందర్ కపూర్ మనవరాలు, చిత్రనిర్మాత బోనీ కపూర్, నిర్మాత మోనా శౌరీ కపూర్, నటి శ్రీదేవి, నటుడు సంజయ్ కపూర్ ల మేనకోడలు. మరికొంతమంది బంధువులలో నటులు అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, మోహిత్ మార్వా, నటుడు రణవీర్ సింగ్ మొదలైనవారు ఉన్నారు.[4][5]
రియా కపూర్ న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి "డ్రామాటిక్ లిటరేచర్"లో గ్రాడ్యుయేషన్‌ను పూర్తిచేసింది.[6] తన చిన్ననాటి స్నేహితుడు కరణ్ బూలానీని 2021లో వివాహం చేసుకుంది.[7]
కెరీర్
[మార్చు]రియా కపూర్ 2010లో రాజశ్రీ ఓజా చిత్రం ఐషాతో చలనచిత్ర నిర్మాతగా తన వృత్తిని ప్రారంభించింది. ఇందులొ తన సోదరి సోనమ్ కపూర్, అభయ్ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆమె తర్వాత శశాంక ఘోష్ దర్శకత్వం వహించిన 2014 చిత్రం ఖూబ్‌సూరత్‌ను నిర్మించింది, ఇది అదే పేరుతో హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రానికి అధికారిక రీమేక్.[8] 2017లో, ఆమె తన సోదరి సోనమ్ కపూర్‌తో కలిసి రీసన్ దుస్తులను ప్రారంభించింది.[9]
2018 జూన్ 1న విడుదలైన వీరే ది వెడ్డింగ్‌కు రియా కపూర్ సహ నిర్మాతగా వ్యవహరించింది.[10]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]నిర్మాతగా
[మార్చు]Year | Title | Notes |
---|---|---|
2010 | ఐషా | జేన్ ఆస్టెన్ 1815 నవల ఎమ్మా అనుసరణ |
2014 | ఖూబ్‌సూరత్ | 1980 చిత్రం ఖూబ్‌సూరత్ ఆధారంగా |
2018 | వీరే ది వెడ్డింగ్ |
మూలాలు
[మార్చు]- ↑ "Rhea Kapoor scouts for locations for next in Tampa Bay". Zeenews.india.com. 3 February 2014. Archived from the original on 29 మే 2014. Retrieved 10 March 2014.
- ↑ "Anil Kapoor unhappy with daughter Rhea's love story". Mumbai Mirror. 29 May 2013. Retrieved 10 March 2014.
- ↑ "Is 'Rheson' Sonam Kapoor's idea? Sister Rhea Kapoor says yes!". The Indian Express. May 13, 2017.
- ↑ "My girls have grown up watching Disney movies: Anil". Timesofindia.indiatimes.com. Retrieved 10 March 2014.
- ↑ "When B-Town parents give their children a career boost - The Times of India". Timesofindia.indiatimes.com. 4 February 2014. Retrieved 10 March 2014.
- ↑ I could only visualise Sonam as Aisha: Rhea Indian Express
- ↑ "Met On Set, I Tried To Bully Her: Karan Boolani's "True Story" Of Falling In Love With Rhea Kapoor". NDTV.com. Retrieved 2021-08-30.
- ↑ Apurva Singh (1 May 2014). "Apurva Singh". indianexpress. Retrieved 2 May 2014.
- ↑ Upala KBR (12 December 2013). "The original 'Khoobsurat' actress Rekha told Sonam Kapoor that she was the best choice for the remake". Daily News and Analysis. Retrieved 22 July 2014.
- ↑ "'Veere Di Wedding' will release on June 1 - Times of India". The Times of India. Retrieved 13 January 2018.