మోనా శౌరీ కపూర్
మోనా శౌరీ కపూర్ | |
---|---|
జననం | న్యూ ఢిల్లీ, భారతదేశం | 1964 ఫిబ్రవరి 3
మరణం | 2012 మార్చి 25 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 48)
వృత్తి | టెలివిజన్ నిర్మాత సినిమా నిర్మాత వ్యాపారవేత్త |
క్రియాశీల సంవత్సరాలు | 1993–2012 |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | అర్జున్ కపూర్ అన్షులా కపూర్ |
తల్లిదండ్రులు |
|
మోనా శౌరీ కపూర్ (1964 ఫిబ్రవరి 3 - 2012 మార్చి 25) భారతీయ టెలివిజన్, సినిమా నిర్మాత. వ్యాపారవేత్త కూడా అయిన ఆమె బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య. వారి సంతానమే నటుడు అర్జున్ కపూర్.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]మోనా శౌరీ 1964 ఫిబ్రవరి 3న న్యూ ఢిల్లీలో జన్మించింది. ఆమె వివాహం 1983లో బోనీ కపూర్‌తో జరిగింది. అయితే వీరి జంట 1996లో విడిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు, కుమారుడు అర్జున్ కపూర్, కుమార్తె అన్షులా కపూర్ ఉన్నారు.[2][3] కుమారుడు 2012 చిత్రం ఇషాక్‌జాదేతో నటుడిగా అరంగేట్రం చేసాడు. కూతురు ఎకోల్ మొండియాల్ వరల్డ్ స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్‌లోని బర్నార్డ్ కాలేజ్ ఆఫ్ కొలంబియా యూనివర్సిటీలో చదివింది. అక్కడే ఆమె గూగుల్ ఇండియాలో పని చేస్తోంది.[4]
బోనీ కపూర్ నుండి విడాకులు తీసుకున్నా, మోనా శౌరీ కపూర్ తన అత్తమామలతో కలిసి జీవించింది. అంతేకాకుండా ఆమె 2012 మార్చి 25న మరణించే వరకు తన పిల్లలు ఇద్దరూ అక్కడే నివసించేవారు.
కెరీర్
[మార్చు]చలనచిత్ర నిర్మాతగా ఆమె ప్రసిద్ధ చిత్రాలు ఎస్. జి. ఎస్. ఫిల్మ్స్ ఆధ్వర్యంలో షీషా (1986), ఫరిష్టే (1991). ఆమె ప్రముఖ టెలివిజన్ షో యుగ్‌ని కూడా నిర్మించింది.
మరణం
[మార్చు]మోనా శౌరీ కపూర్ 2012 మార్చి 25న క్యాన్సర్, హైపర్‌టెన్షన్‌లతో పోరాడుతూ బహుళ అవయవ వైఫల్యం కారణంగా మరణించింది.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Dad's second marriage tough on us as kids: Arjun Kapoor". The Times of India. 22 Apr 2012. Archived from the original on 26 June 2013. Retrieved 11 November 2012.
- ↑ "Rare pic of Boney Kapoor with ex-wife Mona Kapoor and son Arjun takes over the internet". Zee News (in ఇంగ్లీష్). 19 April 2020. Retrieved 5 September 2020.
- ↑ "Before marrying Sridevi, Boney Kapoor was married to Mona Shourie, a successful businesswoman - OrissaPOST". OrissaPost. 25 March 2020. Retrieved 5 September 2020.
- ↑ "In pics: The Boney-Anil-Sanjay Kapoor Family Tree". CNN. 7 February 2012. Archived from the original on 17 ఫిబ్రవరి 2015. Retrieved 15 June 2014.
- ↑ "Mona Kapoor dies at 47". Mumbai Mirror. 26 March 2012. Retrieved 28 March 2012.
- ↑ "Boney Kapoor's former wife Mona passes away". Zeenews.india.com. 31 March 2011. Retrieved 25 March 2013.