గూగుల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
.గూగుల్
తరహాPublic
స్థాపనUnited States మౌంటెన్ వ్యూ,కాలిఫోర్నియా (1998)అమెరికా
ప్రధానకేంద్రముUnited States మౌంటెన్ వ్యూ, కాలిఫోర్నియా, అమెరికా
కీలక వ్యక్తులుసుందర్ పిచై, సి.ఈ.ఓ/డైరెక్టర్
సర్జీ బ్రిన్ ,అధ్యక్షుడు - టెక్నాలజీ
లారీ పేజ్, అధ్యక్షుడు - ఉత్పత్తులు
అలన్ యూస్టేస్, సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ ఆఫ్ నాలెడ్జ్
పరిశ్రమఇంటర్నెట్
కంప్యూటర్ సాఫ్టువేరు
ఉత్పత్తులుమొత్తం ఉత్పత్తులు లింకు
రెవిన్యూ$37.90 బిలియన్USD (2011)
ఉద్యోగులు19,604 (June 30, 2008)[1]
వెబ్ సైటుwww.google.com

గూగుల్‌ ఇంక్‌, ఒక అమెరికన్ పబ్లిక్ కార్పోరేషన్. ప్రసిద్ధ అంతర్జాల శోధన యంత్రం (ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్-Google,
వెబ్-ఆదారిత ఈ -మెయిల్ (G-mail,
ఆన్ లైన్ మ్యాపింగ్ (maps.google,
ఆఫీసు ప్రొడక్టివిటీ (Google Apps,
సోషల్ నెట్ వర్కింగ్ (Orkut) ( గూగుల్ ప్లస్ )
వీడియో షేరింగ్ (youtube) మొదలగు బహుముఖ సేవలద్వారా ప్రపంచ వ్యాప్తంగా వెబ్ ట్రాఫిక్ పరంగా రెండవ స్థానములో ఉన్న సంస్థ (వెబ్సైటు) [2] .

Google 10th Anniversary సందర్భంగా

గూగుల్ గురించి[మార్చు]

గూగుల్ లోగో

సెప్టెంబర్‌ 1998సంవత్సరంలో ఒక ప్రైవేటు ఆధీనములో ఉన్న కార్పోరేషనుగా స్థాపించబడింది. మౌంటెన్ వ్యూ, కాలిఫోర్నియాలో ఉన్న ఈ కంపెనీలో సుమారుగా 52069 మంది పనిచేస్తారు. ఇదివరకు నోవెల్‌ కంపెనీ సీఈవో (CEO) గా పనిచేసిన sundar pichai ప్రస్తుత గూగుల్‌ సీఈవో.

గూగుల్‌ అనే పదం గూగోల్‌ అనే పదం నుంచి వచ్చింది. గూగోల్‌ అనేది ఒకటి పక్కన వంద సున్నాలు గల సంఖ్య. కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని గూగుల్ప్లెక్స్‌ (1 తర్వాత 10వేల సున్నాలు కల సంఖ్య) అని అంటారు.

గూగుల్‌ యొక్క సేవలు ఎన్నో సర్వర్‌ క్షేత్రాల మీద పనిచేస్తాయి. ఒక్కో సర్వర్‌ క్షేత్రం ఎన్నో వేల స్ట్రిప్ చేసిన లినక్సు వర్షన్ల మీద పనిచేస్తాయి. కంపెనీ ఆ వివరాలు వెల్లడించదు కానీ సుమారుగా ఒక లక్ష లినక్స్ యంత్రాలను ఉపయోగిస్తుందని అంచనా. నీల్సెన్ కాబినెట్ ప్రకారం ఇతర శోధనాయంత్ర ప్రత్యర్థులు, యాహూ (23%), ఎమ్.ఎస్.ఎన్‌ (13%) ను దాటి 54% మార్కెట్‌ వాటా కలిగి ఉంది గూగుల్‌.
గూగుల్ రోజుకి ఒక వంద కోట్ల అభ్యర్ధనలను స్వీకరిస్తుంది!

ఉత్పత్తులు మరియు సేవలు[మార్చు]

గూగుల్ యొక్క ప్రధాన వ్యాపారం ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ మీదే ఆధారపడి ఉంది. దీనిలో ముఖ్య పదాల ఆధారంగా సంబంధిత అంశం గుర్చిన సమాచారం (వెబ్సైటులు) తో పాటు చిత్రాలను, వార్తా విశేషాలతో పాటూ పరిశీలన చేయబడిన శాస్త్రీయ వ్యాసాలకు సందించిన సమాచారం కొరకు కూడా వెతకవచ్చు.

కార్పోరేట్ సంస్కృతి[మార్చు]

"ఇరవై శాతం" సమయం[మార్చు]

ప్రతీ గూగుల్ ఇంజనీరు తమ పని గంటలలో 20 శాతం సమయాన్ని తనకు నచ్చిన ప్రాజెక్ట్ పైన పని చేసే వీలు కల్పించబడింది.ఈ సమయాన్ని వారంలో ఒక రోజు కానీ మొత్తం కేటాయించిన సమయాన్ని సమీకరించి ఒక నెలగా కానీ వాడుకోవచ్చు. ఇలాంటి స్వయంసిద్ధ కృషి వలన జనించినవే ఆధునిక గూగుల్ పరికరాలు అయిన జీమెయిల్, గూగుల్ న్యూస్, ఆర్కుట్ లాంటి సేవలు.

ఐ.పి.ఓ మరియు గూగుల్ వ్యవహారిక సంస్కృతి[మార్చు]

చాలా మంది గూగుల్ ఐ.పి.ఓతో కంపెనీ కల్చర్ లో మార్పు వస్తుందని ఊహించారు, [3]. ఉద్యోగుల ప్రయోజనాలు షేర్ హోల్డర్ల ఒత్తిడి వలనో, లేక కాగితం మీద కోటీశ్వరులవడం మూలానో మారవచ్చని ఊహించారు.. కానీ అలాంటివీ ఐ.పీ.ఓ వల్ల జరగవని గూగుల్ సృష్టికర్తలయిన సెర్గీ బ్రిన్ మరియు లారీ పేజ్లు ఒక నివేదికలో పేర్కొన్నారు [4] తరువాత పేజ్ "మేము మా సంస్కృతి, సరదా తత్వం కాపాడటానికి చాలా ఆలోచిస్తామని" అన్నారు.

గూగుల్ పెరుగుతున్నకొద్దీ ఆ సంస్థ "కార్పొరేట్" లాగా అవుతుందని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. 2005 వ సంవత్సరములో ప్రముఖ అమెరికా ఇంగ్లీష్ దినపత్రిక ది న్యూయార్క్ టైమ్స్, ఇంకా ఇతరులు గూగుల్ వ్యతిరేక వ్యాపారీకరణ (యాంటీ కార్పొరేట్), చెడు చెయ్యకూడదనే తత్వం కోల్పోయిందని చెబుతున్నారు.[5][6]

గూగుల్ భాగస్వాములు[మార్చు]

గూగుల్ 2005 [సెప్టెంబర్ 28] న నాసా ( అమెరికా దేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థ ) తో దీర్ఘకాలిక పరిశోధనకుగాను ఒక ఒప్పందాన్ని చేసుకొంది. దీని నిమిత్తమై గూగుల్, నాసా యొక్క ఏమ్స్ రీసెర్చ్ సెంటర్లో 10 లక్షల చదరపు అడుగుల పరిశోధనా కేంద్రాన్ని నిర్మిస్తున్నది. నాసా మరియు గూగుల్ సంయుక్తంగా వివిధ అంశాలలో పరిశోధన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "GOOGLE ANNOUNCES SECOND QUARTER 2008 RESULTS". [July 17], [2008]. Retrieved 2008-08-01. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
  2. http://www.alexa.com/data/details/traffic_details/google.com Google.com has a traffic rank of: 2శీర్షిక క్రింద అలెక్సా వెబ్సైటు నుండి-[ఆగష్టు 01],[2008]న సేకరించబడినది.
  3. [Associated Press]. "http://www.wired.com/news/business/0,1367,63241,00.html?tw=wn_story_related Quirky Google Culture Endangered?" [Wired Magazine]. [April 28], [2004]
  4. Baertlein, Lisa. "http://www.ciol.com/content/news/2004/104043001.asp Google IPO at $2.7 billion." CIOL IT Unlimited. [April 30], [2004].
  5. Rivlin, Gary. "http://www.nytimes.com/2005/08/24/technology/24valley.html Relax, Bill Gates; It's Google's Turn as the Villain." [New York Times]. [August 24], [2005].
  6. Gibson, Owen; Wray, Richard. "http://www.smh.com.au/news/technology/search-giant-may-outgrow-its-fans/2005/08/25/1124562975596.html3001.asp Search giant may outgrow its fans." [The Sydney Morning Herald]. [August 25], [2005].

మరింత తెలుసుకోవటానికి వనరులు[మార్చు]

  • David Vise and Mark Malseed ([2005-11-15]). The Google Story. Delacorte Press. ISBN 0-553-80457-X. Check date values in: |date= (help)
  • John Battelle ([2005-09-08]). The Search: How Google and Its Rivals Rewrote the Rules of Business and Transformed Our Culture. Portfolio Hardcover. ISBN 1-59184-088-0. Check date values in: |date= (help)

బయటి అనుసంధానాలు[మార్చు]

ఇంటర్నెట్ లో గూగూల్ వెబ్‌సైట్లు[మార్చు]

ఇతర అనుసంధానాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=గూగుల్&oldid=2352858" నుండి వెలికితీశారు