మైక్రోసాఫ్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైక్రోసాఫ్ట్‌ కార్పోరేషను
తరహాPublic (NASDAQ: MSFT)
స్థాపనఅల్బకర్క్యూ, న్యూ మెక్సికో రాష్ట్రం,అమెరికా సంయుక్త రాష్ట్రాలు (1975)
ప్రధానకేంద్రమురెడ్మాండ్,వాషింగ్టనురాష్ట్రం,
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
కీలక వ్యక్తులు
పరిశ్రమకంప్యూటరు సాఫ్టువేర్,
వీడియో గేములు
ఉత్పత్తులుమైక్రోసాఫ్ట్ ఆఫీస్
మైక్రోసాఫ్ట్ విండోస్
ఎక్స్ బాక్స్
యమ్ యస్ యన్
(See more products.)
రెవిన్యూ$36.8 billion USD (2004)
ఉద్యోగులు57,000 (2004)
నినాదముYour potential. Our passion.
వెబ్ సైటుwww.microsoft.com
Bill Gates
బిల్ గేట్స్
Satya Nadella, The Executive Chairman and CEO of Microsoft
సత్య నాదెళ్ళ, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, CEO

మైక్రోసాఫ్ట్‌ కార్పోరేషను, NASDAQMSFT ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. ప్రపంచ వ్యాప్థంగా ఉన్న అన్ని శాఖలను కలుపుకొని, 2004 మే నాటికి ఈ సంస్థలో సుమారుగా 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని వాషింగ్టన్‌ రాష్ట్రంలోని రెడ్మాండ్‌ నగరంలో ప్రధాన కార్యాలయం గల ఈ సంస్థ 1975 వ సంవత్సరంలో బిల్ గేట్స్ మరియూ పౌల్‌ అలెన్‌ అను ఇద్దరు మిత్రులు స్థాపించారు. ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటరు పరికరాలకు వివిధ రకాలయిన సాఫ్టువేర్ అభివృద్ధి పరచడం, తయారు చేయడం, లైసెన్స్‌లు ఇవ్వడం మరియూ సహకారం అందించడం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియూ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అత్యంత ప్రముఖమైన, ప్రజాదరణ పొందిన సాఫ్టువేర్ ఉత్పత్తులు. ఈ రెండు సాఫ్టువేర్లు సుమారుగా డెస్క్-‌టాప్ కంప్యూటరులో అటో ఇటో పూర్తి వాటాని కలిగి ఉన్నాయి.

ప్రస్తుత వ్యాపార కార్యకలాపములు[మార్చు]

మైక్రోసాఫ్ట్‌ రెడ్మాండ్‌ ఆఫీసు, ఇందు సుమారుగా 80 లక్షల చదరపు అడుగుల వైశాల్యం (750, 000 చదరపు మీటర్లు), 28,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ గుర్తు ఆ క్యాంపసునకు మొదటి గుర్తు.

వీరి తరువాతి విండోసు ఆపరేటింగు సిస్టము అయిన విండోస్ విస్టా 2006 లో విడుదల చేశారు. ఇందులోని కొన్ని విషయములు: డివైజులకు మరింత గొప్ప సహకారము (ఉదాహరణకు మీడియా ప్లేయర్లు), ఏయిరో అని పిలవబడు, మరింత గొప్ప యూజర్‌ ఇంటర్‌ ఫేసూ, మెట్రో అని పిలవబడు పీ డీ యఫ్‌ లాంటి ఫార్మేట్, డెస్క్ టాప్ లోనికి క్రొత్త "శోధన" వ్యవస్థ, మరియూ ఇంకా చాలా చాలా కొత్త ఫీచర్లు చేర్చబడినాయి.

మైక్రోసాఫ్ట్‌ తన ఎక్స్ బాక్స్ నకు మరొక కొత్త వర్షను విడుదలకు సిద్దం చేస్తుంది, దీనిని ఎక్స్ బాక్స్ 360 అని పిలుస్తున్నారు. ఈ ఎక్స్ బాక్స్ను వారు విండోస్ విస్టా మరియూ విండోస్ మీడియా సెంటర్తో కలిపి (integrate ? ) ఓ గొప్ప వినోదపరమైన విప్లవం తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.

ఇటీవల సంస్థ అధికారులు చేసిన ఉపన్యాసాలు, వ్యాఖ్యల ద్వారా ఓ విషయం అర్థమవుతుంది, అది ఏమిటంటే ఇహ నుండి సంస్థ "తక్కువ ధర, అందుకు కొనండి" అనే సిద్దాంతాన్ని వదిలి "మంచి నాణ్యత , భవిష్యత్తులో ఖర్చులను తగ్గిస్తాము" అని చెప్పి అమ్మకాలు చెయ్యబోతున్నారు అని.

మైక్రో సాఫ్ట్ హైదరాబాదు క్యాంపస్ లోని బోర్డు

చరిత్ర[మార్చు]

మైక్రో - సాఫ్ట్‌ అనగా సూక్ష్మమైన కంప్యూటరు అను పదములనుంది వచ్చింది.

ఇప్పటి చరిత్ర[మార్చు]

మైక్రోసాఫ్ట్ సహనిర్మాత పాల్ అలెన్ బిల్ గేట్స్ను కలవడానికి అతని గది వద్దకు ఒక పత్రికను తీసుకుని వచ్చాడు [Altair 8080]. అది ప్రపంచములో మొట్టమొదటి వ్యాపార పరమైన మోడల్స్ మైక్రో-కంప్యూటర్.

కంప్యూటర్ల కోసం సాఫ్టువేర్[మార్చు]

బిల్‌గేట్స్ కాలిఫోర్నియాలో జరిగిన ఆల్‌థింగ్స్ డిజిటల్ కాన్ఫరెన్స్‌లో మైక్రోసాఫ్ట్ 2009లో విడుదల చేయనున్న విండోస్-7లో టచ్‌స్క్రీన్ సదుపాయం ఏర్పాటు చేసినట్టు ప్రకటన చేశారు. విండోస్ విస్టా వెర్షన్ తరువాత విడుదల చేయబోయే విండోస్-7లో ఉండే మల్టీటచ్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఇప్పటిదాకా మౌస్ చేసే పనులన్నింటినీ మన చేతివేళ్లతోనే చేసేలా రూపొందించినట్టు మైక్రోసాఫ్ట్ చెబుతోంది.
ఇప్పటిదాకా కొన్ని హై ఎండ్ మొబైల్స్‌కు మాత్రమే పరిమితమైన ఈ టచ్‌స్క్రీన్ సదుపాయం ఇప్పుడు కంప్యూటర్లకు వాడుకునేలా రూపొందించే ప్రయత్నం ఒక విప్లవాత్మక మార్పు అనిచెప్పవచ్చు. విస్టా తరువాత తమ సంస్థ నుండి విడుదలయ్యే సరికొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్-7 మల్టీటచ్ ఇంటర్‌ఫేస్ కలిగి ఉంటుందని, ఇకపై వినియోగదారులు మౌస్‌తో కాకుండా, వేలితోనే కంప్యూటర్‌ను ఆడించవచ్చని బిల్‌గేట్స్ ప్రకటించారు.
విండోస్-7 మల్టీటచ్ ఇంటర్‌ఫేస్‌తో రూపొందించడానికి ప్రధాన ప్రేరణ యాపిల్ సంస్థ విడుదల చేసిన ఐఫోన్ అని చెప్పవచ్చు. టచ్‌స్క్రీన్ సాఫ్ట్‌వేర్‌తో రూపొందిన ఐఫోన్ విడుదలైన 11 మాసాలలోనే దాదాపు 60 లక్షల హ్యాండ్‌సెట్లు అమ్ముడుపోవడం బిల్‌గేట్స్‌ను ఆలోచనలో పడేసిందని మార్కెట్ వర్గాల విశ్లేషణ.
విండోస్-7లోని టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్ ద్వారా కంప్యూటర్ వినియోగదారులు వివిధ అప్లికేషన్లు ఓపెన్ చేయాలన్నా, క్లోజ్ చేయాలన్నా, ఫోటోలు, వీడియోలు చూడటం దగ్గర్నించీ ప్రతిదీ టచ్ కంట్రోల్స్‌తోనే చేయవచ్చు. టచ్‌స్క్రీన్ ఆపరేటింగ్ సిస్టం అప్లికేషన్ల రూపకల్పనలో నిమగ్నమైన మైక్రోసాఫ్ట్ 2008 చివరనగానీ, 2009 మొదట్లోగానీ విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది.[1]

విండోస్ మొబైల్ ఫోన్ల కోసం సాఫ్టువేర్[మార్చు]

మొబైల్ ఫోన్ల కోసం ప్రత్యేక రూపొందించిన విండోస్ మొబైల్ సాఫ్టువేర్ కు మరిన్ని ఫీచర్స్‌ను జోడించి కొత్త వెర్షన్‌ను విఫణి లోనికి విడుదల చేసింది.[2] విండోస్ మొబైల్ ఫ్లాట్‌పాం ఆధారంగా పనిచేసే మొబైల్ ఫోన్స్, స్మార్ట్‌ఫోన్స్‌లలో కొత్త ఫీచర్స్‌తో తయారైన మ్యూజిక్ వెర్షన్‌లను ఈ సాఫ్ట్‌వేర్ అందిస్తుందని మైక్రోసాఫ్ట్ మొబైల్ కమ్యూనికేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ లీజ్ వెల్లడించారు.

మైక్రోసాఫ్ట్ హైదరాబాదు కార్యాలయం

మైక్రోసాఫ్ట్ దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, మోటోరోలా ఇంక్, తైవాన్‌కు చెందిన హైటెక్ కంప్యూటర్స్ (హెచ్‌టీసీ), అశూష్‌టెక్ కంప్యూటర్‌ వంటి సంస్థల భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ ఈ సాఫ్టువేర్ ను రూపొందించిందని ఆండీ లీజ్ తెలిపారు.ఈ సాప్ట్‌వేర్ ఆపిల్ ఇంక్‌ కంపెనీకి చెందిన ఐఫోన్, బ్లాక్ బెర్రీ డివైజ్, ఫిన్‌లాండ్స్ నోకియా వంటి హ్యాండ్ సెట్లలో ఆక్సెస్ అవుతుందని, ఈ విండోస్ మొబైల్ సాఫ్టువేర్ తో సెల్‌ఫోన్ ద్వారా నచ్చిన పాటలను వినవచ్చునని మైక్రోసాఫ్ట్ వివరిస్తుంది.

సాధించిన విజయాలు[మార్చు]

సంస్థ విస్తరణ,విలీనాలు[మార్చు]

యాహూ కొనుగోలుకోసం మైక్రోసాఫ్ట్ 47.5 బిలియన్ డాలర్లు చెలిస్తామని ప్రతిపాదించింది.[3] అంటే యాహూ షేర్ ఒక్కింటికి 33 డాలర్లు ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చిందనన్నమాట. అయితే షేర్‌కు 37 డాలర్ల చొప్పున 57 బిలియన్ డాలర్లను ఇవ్వాలని యాహో కోరింది. గత ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ 44.6 బిలియన్ డాలర్లు ఇస్తామని -షేర్‌కి 31 డాలర్లు- మొదట ప్రతిపాదించినా, చర్చల క్రమంలో ఆ మెత్తాన్ని పెంచింది.
కానీ ఈ విలీన ప్రతిపాదనకి యాహూ అంగీకరించక పోవటంతో మైక్రోసాఫ్ట్ ప్రయత్నం విఫలమయింది. కొనుగోలు చేయాలని గత మూడు నెలలుగా చేస్తూ వస్తున్న ప్రయత్నాలకు సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్వస్తి చెప్పింది.

పురస్కారాలు[మార్చు]

విశేషాలు[మార్చు]

పుస్తకాలు, ప్రచురణలు[మార్చు]

వీడియోలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  • మైక్రోసాఫ్టు అధికారిక వెబ్సైట్ :లింక్
  • మైక్రోసాఫ్టు ఇంగ్లీష్ వికీపీడియా :లింక్
  • మైక్రోసాఫ్టు గురించి సమగ్ర సమాచారంతో ఇంగ్లీష్ వికీపీడియా : పోర్టల్ లింక్

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "మౌస్‌కు వీడ్కోలు పలుకనున్న "విండోస్ టచ్"". telugu.in.msn.com. తెలుగు.ఇన్.ఎం.ఎస్.ఎన్.కాం. 6 June 2008. Retrieved 2 జూలై 2008.[permanent dead link]
  2. "విండోస్ మొబైల్ ఫోన్ల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్". telugu.in.msn.com. తెలుగు.ఇన్.ఎం.ఎస్.ఎన్.కాం. 7 June 2008. Retrieved 2 జూలై 2008.[permanent dead link]
  3. "యాహూ కొనుగోలు బిడ్‌కు మైక్రోసాఫ్ట్ స్వస్తి". telugu.in.msn.com. telugu.in.msn.com. 2008-07-02.[permanent dead link]