ముఖ్య కార్యనిర్వాహక అధికారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముఖ్య కార్యనిర్వాహక అధికారి అనగా లాభాపేక్ష సంస్థ కోసం నిర్వహణ బాధ్యతలు చేపట్టిన నిర్వాహకుడు లేదా అత్యంత సీనియర్ కార్పొరేట్ అధికారి (ఎగ్జిక్యూటివ్) స్థానంలో ఉన్నవాడు. ముఖ్య కార్యనిర్వాహక అధికారి ని ఆంగ్లంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Chief Executive Officer లేదా CEO) అని అంటారు.

కార్పొరేషన్ లేదా కంపెనీ యొక్క సీఈఓ సాధారణంగా బోర్డు డైరెక్టర్లకు నివేదికలు సమర్పిస్తాడు, సంస్థ యొక్క విలువ గరిష్టీకరణ బాధ్యతలు మోస్తాడు. తరచుగా ఈ స్థానానికి ముఖ్య కార్యనిర్వాహక అధికారి (అమెరికన్ ఇంగ్లీష్ లో CEO) నిర్వహణ దర్శకుడు (బ్రిటిష్ ఇంగ్లీష్ లో మేనేజింగ్ డైరెక్టర్ - MD) ఇంకా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (CE) వంటి టైటిల్స్ ఉన్నాయి.