Jump to content

గూగుల్ క్యాంపస్ (హైదరాబాదు)

వికీపీడియా నుండి
గూగుల్ క్యాంపస్ (హైదరాబాదు)
రకంఅనుబంధ సంస్థ (పరిమిత బాధ్యతలుగల కంపెనీ)
స్థాపన2022 ఏప్రిల్ 28న శంకుస్థాపన
స్థాపకుడుగూగుల్-తెలంగాణ ప్రభుత్వం
ప్రధాన కార్యాలయం,
సేవ చేసే ప్రాంతము
ప్రపంచవ్యాప్తంగా

గూగుల్‌ క్యాంపస్‌ అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ అయిన గూగుల్ ఏర్పాటు చేయనున్న క్యాంపస్.[1] గచ్చిబౌలిలోని నానక్‌రాంగూడలో 7.3 ఎకరాల్లో నిర్మించనున్న ఈ క్యాంపస్, అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటుచేస్తున్న అతిపెద్ద క్యాంపస్‌ గా నిలువనుంది.[2][3]

చరిత్ర

[మార్చు]

యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని 2015లో తెలంగాణ రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కేటీఆర్ సందర్శించాడు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా యువతకు, మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ సాధికారత వంటి అభివృద్ధిని సాధించడానికి సొంత క్యాంపస్‌ ఏర్పాటుకోసం గూగుల్‌ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం జరుపుకుంది.[4] అందులో భాగంగా గూగుల్ సంస్థ తమ రెండవ అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాదులో ఏర్పాటుచేయడానికి ముందుకు వచ్చింది. 2015లోనే 1,000 కోట్ల పెట్టుబడితో మొదట ఈ ప్రాజెక్టు ప్రకటించబడింది. రెండేండ్లలో అందుబాటులోకి రానున్న ఈ క్యాంపస్ లో 7 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.[5]

ఒప్పందాలు

[మార్చు]
  • గూగుల్‌ కెరీర్‌ సర్టిఫికెట్‌ ద్వారా ఐటీ సపోర్ట్‌
  • ఐటీ ఆటోమేషన్‌, యూఎక్స్‌ డిజైన్‌, డాటా అనలిటిక్స్‌, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ తదితర రంగాల్లో యువతకు శిక్షణ
  • వీ-హబ్‌తో కలిసి మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమల వ్యవస్థాపకులకు ఆర్థిక నైపుణ్య శిక్షణ
  • ప్రభుత్వ పాఠశాలలు డిజిటల్‌ విద్యలో సాధికారతకు సహకారం
  • ఈ-లెర్నింగ్‌పై విద్యార్థులు, విద్యావేత్తలకు శిక్షణ

నిర్మాణం

[మార్చు]

2022, ఏప్రిల్ 28న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కె. తారక రామారావు ఈ క్యాంపస్ కు శంకుస్థాపన చేసి, 7.3 ఎకరాల్లో 30 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న సువిశాల భవన నమూనాను ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఎంపీ జి. రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాష్ట్ర ఐటి పరిశ్రమలశాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, గూగుల్‌ ఇండియా కంట్రీ హెడ్‌, ఉపాధ్యక్షుడు సంజయ్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.[2][6]

మూలాలు

[మార్చు]
  1. "Google's largest campus after US gets off the ground in Hyderabad | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2022-04-29. Archived from the original on 2022-05-01. Retrieved 2022-05-01.
  2. 2.0 2.1 telugu, NT News (2022-04-29). "7.3 ఎకరాల్లో గూగుల్‌ క్యాంపస్‌". Namasthe Telangana. Archived from the original on 2022-05-01. Retrieved 2022-05-01.
  3. "Google: గూగుల్‌ జిగేల్‌". EENADU. 2022-04-29. Archived from the original on 2022-05-01. Retrieved 2022-05-01.
  4. "Telangana: రాష్ట్రంలోని ఏ నగరంలో గూగుల్‌ క్యాంపస్‌ ఏర్పాటవుతోంది?". Sakshi Education. 2022-04-29. Archived from the original on 2022-05-01. Retrieved 2022-05-01.
  5. "Google set to build its large campus campus outside of US in Hyderabad". The New Indian Express. 2022-04-29. Archived from the original on 2022-05-01. Retrieved 2022-05-01.
  6. Today, Telangana (2022-04-28). "Google gets bigger in Hyderabad". Telangana Today. Retrieved 2022-05-01.