కల్వకుంట్ల తారక రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్వకుంట్ల తారక రామారావు
కల్వకుంట్ల తారక రామారావు

కల్వకుంట్ల తారక రామారావు


నియోజకవర్గము సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1976, జూలై 24
చింతమడక, మెదక్, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి శైలిమ
సంతానము హిమన్ష్‌ (కొడుకు), మహాలక్ష్మీ (కూతురు)
నివాసము హైదరాబాదు, తెలంగాణ
మతం హిందూమతము

కల్వకుంట్ల తారక రామరావు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు.[1] సిరిసిల్ల నియోజకవర్గం నుండి 2009లో ఎన్నికైన శాశనసభ సభ్యులు. సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్ మరియు ఎన్నారై అఫైర్స్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడు. ఈయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు ఉర్దూ భాషలలో ప్రావీణ్యం ఉంది. 2008లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

తారక రామారావు 1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖరరావు, శోభ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో జన్మించారు. రెండేళ్లపాటు కరీంనగర్ లో చదువుకున్న రామారావు, హైదరాబాద్ లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. గుంటూరులోని విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి హైదరాబాద్‌ వచ్చి మెడిసిన్‌ ఎంట్రెన్స్‌ రాసిన రామారావుకు కర్ణాటకలోని ఓ మెడికల్‌ కాలేజీలో సీటొచ్చింది. కానీ అది ఇష్టంలేక నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ డిగ్రీలో చేరారు. డిగ్రీ తరవాత పూణే యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి, అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ నుంచి మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఈ-కామర్స్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని ‘ఇంట్రా’ అనే సంస్థలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, ఆదివారం సంచిక. "నాన్న పేరు నిలబెడతా!". Retrieved 28 February 2018.

వంశవృక్ష ఆధారం[మార్చు]