కే.కే. మహేందర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
KK MAHENDER REDDY

వ్యక్తిగత వివరాలు

జననం 1961 జులై 10
నామాపూర్, ముస్తాబద్ మండలం, రాజన్న జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కే నారాయణ రెడ్డి , అహల్య
జీవిత భాగస్వామి పద్మ
వృత్తి తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు

KK MAHENDER REDDY తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.[2][3] 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెకె మహేందర్ రెడ్డి గారు 59,557 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు.[4]

బాల్యం మరియు విద్యాభ్యాసం

[మార్చు]

కెకె మహేందర్ రెడ్డి పూర్తి పేరు కొండం కరుణ మహేందర్ రెడ్డి. ఆయన స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామం. 1961 జూలై 10 నాడు కొండం నారాయణరెడ్డి అహల్య దంపతులకు మహేందర్ రెడ్డి గారు జన్మించారు. నారాయణరెడ్డి కి మొత్తం ఆరుగురు సంతానం, మహేందర్ రెడ్డి అందరికంటే చిన్నవారు. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. మహేందర్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం ఆయన స్వగ్రామం నామాపూర్ లో జరిగింది. అక్కడ ఏడవ తరగతి వరకు మాత్రమే ఉండేది, దీంతో ఆయన ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరారు, స్కూల్ కు వెళ్లేందుకు ప్రతిరోజు నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చేది దీంతో 9వ తరగతిలో టిసి తీసుకొని వేరే స్కూల్లో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకా దేవరుప్పల గ్రామంలో 9 ,10 తరగతి చదువుకున్నారు. పదవ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం సిద్దిపేట జూనియర్ కాలేజీలో చేరారు. మహేందర్ రెడ్డి అనంతరం 1980 - 83 మధ్య సికింద్రాబాద్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో డిగ్రీని చదువుకున్నారు. PDSU విద్యార్థి సంఘంలో క్రియాశీలకంగా ఆయన పనిచేశారు.1983లో డిగ్రీ పూర్తయిన తర్వాత ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో MSc ఆంత్రోపాలాజీ లో చేరారు. అదే సమయంలో సివిల్స్ పరీక్ష కూడా రాశారు. ప్రిలిమ్స్ లో ఎంపికై మెయిన్స్ వరకు వెళ్లారు. తర్వాత ఎంఎస్సీ చివరి సంవత్సరంలో డిస్కంటిన్యూ చేసి "లా" చదవడం కోసం 1986లో ఉస్మానియా యూనివర్సిటీలో చేరారు.1989లో ఆయన న్యాయ శాస్త్ర పట్టా అందుకున్నారు. అనంతరం అదే సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు, అప్పటినుంచి న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతున్నారు.[5]

తల్లి నింపిన ఉద్యమ స్ఫూర్తి

[మార్చు]

చిన్ననాటి నుండి ఆయన తల్లి ఆయనను ఒక బాధ్యత గల పౌరుడిగా పెంచింది. తెలంగాణ కోసం తన బిడ్డ కొట్లాడుతాడని ఆమె అప్పుడు ఊహించి ఉండకపోవచ్చు , కానీ ఆయనలో నాయకత్వ లక్షణాలు మాత్రం అప్పటినుంచి అలవాడినాయి. "కన్న తల్లిదండ్రులను , తోపుట్టులను , పుట్టిన ఊరును,  పెరిగిన ప్రాంతాన్ని ప్రేమించలేని వాడు దేశాన్ని ప్రేమించలేడు" అంటూ ఉగ్గుపాలతోనే  ఆయనకు ఉపదేశం చేసింది. తన తల్లి నింపిన స్ఫూర్తి కారణంగానే తాను తెలంగాణ కోసం తన వంతు సేవలను అందించగలిగారని కేకే మహేందర్ రెడ్డి గారు గుర్తు చేసుకుంటారు. తన పోరాటాలకు తన తల్లిదండ్రులే స్ఫూర్తి అని అంటారాయన.[6]

ఆత్మగౌరవానికి మారుపేరు

[మార్చు]

తెలంగాణ తొలి దశ ఉద్యమాన్ని చిన్నతనంలోనే రుచి చూసిన అతికొద్దీ మంది ఉద్యమకారుల్లో కేకే మహేందర్రెడ్డి కూడా ఒకరు. కాబట్టి కాలేజీ రోజుల్లో తెలంగాణ ప్రజా సమితి అనే రాజకీయ పార్టీలో చురుగ్గా తిరిగేవారు. అప్పట్లో తెలంగాణ ప్రజా సమితి పార్టీ కోసం నేరెళ్ళ నియోజకవర్గంలో జై తెలంగాణ అంటూ నినదిస్తూ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేశారు కేకే మహేందర్ రెడ్డి. ఆ ప్రస్థానమే ఆయనను మలిదశ తెలంగాణ ఉద్యమంలో మమేకం అయ్యేలా చేసింది. [7]తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు , తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు విసిరిన వాళ్లు , కర్రలతో వెంటబడి తరిమిన వాళ్లు...  తెలంగాణ వాదులుగా చెలామణి అవుతున్న దౌర్భాగ్యపు పరిస్థితులు ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.  అధికార మదంతో రోజుకో రంగు మారుస్తున్న ఈ "పెట్టు తెలంగాణ వాదుల"  సంగతి పక్కన పెడితే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నరనరాన నింపుకున్న ఎంతోమంది "పుట్టు తెలంగాణ వాదులు" నేటికీ తమ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టకుండా హుందాగా బతుకుతున్నారు. ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న అలాంటి వారిలో మొదటి వ్యక్తి కేకే మహేందర్రెడ్డి.  1969 లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో "జై తెలంగాణ" అంటూ పసివయసులోనే నినదించిన ఆయన నాటి నుంచి అదే పోరాట వాదాన్ని గుండెల్లో దాచుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన అతికొద్దిమందిలో ఒకరుగా నిలిచారు.


కెసిఆర్ నమ్మకద్రోహం

[మార్చు]

2001 ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలపరిచేందుకు కరీంనగర్ లో జరిగిన సింహ గర్జన సభలో కెసిఆర్ ద్వారా ప్రజల గుండెలకు హత్తుకునేలా కొన్ని మాటలు మాట్లాడించారు కేకే మహేందర్ రెడ్డి. ఉద్యమం మీద నమ్మకం కుదిరేలా కుటుంబ పాలనకు తాను చోటివ్వనంటూ కేసిఆర్ ఆ సభలో మాటిచ్చాడు . నేను నా భార్య తప్ప తెలంగాణ రాజకీయాల్లో నా కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు అని, నా కొడుకు బిడ్డ ఇద్దరు అమెరికాలోనే ఉంతారని , తెలంగాణకు కాపాలా కుక్కలాగా ఉంటానన్నాడు KCR. కానీ మాటమీద నిలబడని కేసీఆర్ .. కేకే మహేందర్ రెడ్డి ఎంత వారిస్తున్నా లెక్కచేయకుండా తన కొడుకును పార్టీలోకి తీసుకొచ్చారు. 2009 ఆగస్టులో కేటీఆర్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఇచ్చాడు. తర్వాత ఎన్నికల్లో కేటీఆర్ కు ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో కేకే మహేందర్ రెడ్డి అందుకు అభ్యంతరం చెప్పారు.  సాధారణంగానే ప్రశ్నించే గొంతులను అణచివేసే కేసీఆర్ నెమ్మదిగా మహేందర్ రెడ్డిని పక్కన పెట్టడం మొదలుపెట్టాడు.


కేకే మహేందర్ రెడ్డి ని కాదని 2009 అసెంబ్లీ ఎన్నికల్లో  పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేఖంగా సిరిసిల్ల నియోజకవర్గం నుండి కేటీఆర్ ను బరిలో ఉంచాడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. దాంతో సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు మరియు ఉద్యమకారులు కెసిఆర్ మీద అసంతృప్తితో కేకే మహేందర్ రెడ్డి గారిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఆ ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలంతా మహేందర్ రెడ్డి కి అండగా నిలిచినప్పటికీ ... ధన ప్రవాహం ముందు , ప్రలోభాల ముందు నిలబడలేక అత్యల్ప  మెజారిటీతో కేవలం 171 ఓట్లతో ఓడిపోయారు కేకే మహేందర్ రెడ్డి. కానీ ఈ ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజల అభిమానాన్ని సంపాదించారు కేకే మహేందర్ రెడ్డి.


రాజకీయ జీవితం

[మార్చు]

కే.కే. మహేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో, పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో సిరిసిల్ల నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ పై 171 ఓట్ల స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత ఆగష్టు 4న పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2010లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ చేతిలో ఓడిపోయాడు.

కే.కే. మహేందర్ రెడ్డి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం 2011లో కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన ఆ తరువాత 2018, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్ల నుండి పోటీ చేసి ఓడిపోయాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేకే మహేందర్ రెడ్డి గారు సుమారు 29 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన  అరవై వేల మంది ప్రజల అభిమానాన్ని సంపాదించారు. అలా ఎన్నికల్లో ఓడిపోతూ ప్రజల అభిమానాన్ని ప్రేమను పెంచుకుంటున్నారు  కేకే మహేందర్ రెడ్డి. సిరిసిల్ల నియోజకవర్గం మెజారిటీ ప్రజలు కేకే మహేందర్ రెడ్డి గారిదే నైతిక విజయం అని చెబుతుంటారు[8]

 

మూలాలు

[మార్చు]
  1. Eenadu (10 November 2023). "పట్టు వదలని విక్రమార్కులు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  2. Eenadu (17 November 2023). "కేటీఆర్‌-హరీశ్‌ మెజారిటీ పోటీ". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  3. Eenadu (25 November 2023). "ఓట్లు కొల్లగొట్టారు". Archived from the original on 25 November 2023. Retrieved 25 November 2023.
  4. https://results.eci.gov.in/AcResultGenDecNew2023/statewiseS296.htm
  5. కొవ్వూరు, రాజు (august 2023). నిలువెత్తు నిజాయితీపరుడు కేకే మహేందర్ రెడ్డి. hyderabad. p. 26. {{cite book}}: Check date values in: |year= (help)
  6. కొవ్వూరు, రాజు (august 2023). నిలువెత్తు నిజాయితీపరుడు కేకే మహేందర్ రెడ్డి. hyderabad: special edition. p. 26. {{cite book}}: Check date values in: |year= (help)
  7. BHANU ANNALDAS (2024-03-12), మహేంద్రుడు | సిరిసిల్ల ప్రజల పెద్ద దిక్కు కె కె మహేందర్ రెడ్డి | KK Mahendar Reddy, retrieved 2024-07-15
  8. https://www.youtube.com/watch?v=a57ZUIta1dc&t=47s https://www.youtube.com/watch?v=nuSaJjKEb9E&t=889s https://www.youtube.com/watch?v=TAbjCfEVtOg&t=339s https://epaper.navatelangana.com/Home/FullPage?eid=8&edate=10/07/2024&pgid=119272

https://www.myneta.info/Telangana2023/candidate.php?candidate_id=307[1]

  1. https://www.myneta.info/Telangana2023/candidate.php?candidate_id=307. {{cite news}}: Missing or empty |title= (help)