జి.రంజిత్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.రంజిత్ రెడ్డి
జి.రంజిత్ రెడ్డి


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2019 – ప్రస్తుతం
ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి
నియోజకవర్గం చేవెళ్ళ

వ్యక్తిగత వివరాలు

జననం (1964-09-18) 1964 సెప్టెంబరు 18 (వయసు 60)[1]
వరంగల్
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
తల్లిదండ్రులు గడ్డం రాజా రెడ్డి , చంద్రకళ
జీవిత భాగస్వామి సీతా రెడ్డి
సంతానం పూజ ఆకాంక్ష,రాజా ఆర్యారెడ్డి
నివాసం జూబ్లీ హిల్స్ , న్యూ ఢిల్లీ
పూర్వ విద్యార్థి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, హైదరాబాద్
వృత్తి వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు

గడ్డం రంజిత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

గడ్డం రంజిత్‌రెడ్డి 1964 సెప్టెంబరు 18లో వరంగల్‌లో గడ్డం రాజా రెడ్డి, చంద్రకళ దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నుంచి వెటర్నరీ సైన్స్‌ విభాగంలో పీజీ పట్టా పొందాడు.

వృత్తి జీవితం

[మార్చు]

డా. రంజిత్‌ రెడ్డి రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల లోని అంతాపూర్‌ గ్రామంలోని పౌల్ట్రీఫామ్‌కు సాంకేతిక సలహాదారుగా కెరీర్ ప్రారంభించాడు. ఆయన పౌల్ట్రీ వ్యాపారంలోకి వచ్చి ఎస్‌ఆర్‌ హ్యాచరీస్‌ సంస్థను స్థాపించాడు.[2] రంజిత్ రెడ్డి సిద్ధిపేట జిల్లా, ములుగు మండలంలోని, లక్ష్మక్కపల్లి గ్రామంలో ఉన్న ఆర్.వి.ఎం మెడికల్ కాలేజ్ కు డైరెక్టర్ గా ఉన్నాడు.[3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

డా. రంజిత్‌ రెడ్డి 2004లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి, మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆయన 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై 14,391 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[5][6] ఆయన ప్రస్తుతం పార్లమెంట్ లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. http://loksabhaph.nic.in/Members/MemberBioprofile.aspx?mpsno=5075
  2. You & I (3 November 2016). "The Road to Success - Dr G. Ranjith Reddy and Dr A. Tirupathi Reddy, Managing Directors, S.R. Group" (in ఇంగ్లీష్). Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
  3. Sakshi (5 April 2019). "చేవెళ్ల ఆశాకిరణం డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి". Sakshi. Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
  4. Sakshi (23 June 2019). "రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు". Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
  5. The New Indian Express. "Debutant defeats 'rich' MP in Chevella". Archived from the original on 27 May 2019. Retrieved 13 July 2021.
  6. Sakshi (2019). "Chevella Constituency Winner List in Telangana Elections 2019". Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
  7. Namasthe Telangana (17 March 2021). "ఐటీఐఆర్‌ అనవసరం". Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.