గూగోల్ ప్లెక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూగుల్ ప్లెక్స్ రిటెన్ అవుట్; పుస్తక ముఖచిత్రం

గూగోల్ ప్లెక్స్ అనునది ఒక సంఖ్య దీనిని 10googol, లేదా. . అని వ్రాస్తారు. 1 తర్వాత గూగోల్ సున్నాలు చేర్చిన సంఖ్య. ఈ సంఖ్యను పూర్తిగా రాయాలంటే భూమికి, చంద్రునికి మధ్య దూరం చాలదు. దీనిని బట్టి ఊహించవచ్చు ఈ సంఖ్య ఎంత పెద్దదో!

చరిత్ర[మార్చు]

1920 లో, ఎడ్వర్డ్ కాస్నర్ యొక్క తొమ్మిదేళ్ల మేనల్లుడు, మిల్టన్ సిరోటా, గూగోల్ అనే పదాన్ని 10100 అని పిలిచాడు, తరువాత గూగోల్ ప్లెక్స్ అనే పదాన్ని "ఒకటి, తరువాత మీరు అలసిపోయే వరకు సున్నాలు రాయడం" అని ప్రతిపాదించాడు[1]. కాస్నర్ మరింత అధికారిక నిర్వచనాన్ని అవలంబించాలని నిర్ణయించుకున్నాడు, ఎందుకంటే "వేర్వేరు వ్యక్తులు వేర్వేరు సమయాల్లో అలసిపోతారు. ఇటాలియన్ బాక్సర్ కార్నెరా ఐన్‌స్టీన్ కంటే మంచి గణిత శాస్త్రజ్ఞుడు ఎందుకంటే ఎందుకంటే అతనికి ఎక్కువ ఓర్పు ఉంది , ఎక్కువ కాలం వ్రాయగలడు."[2] అందువలన ఇది 1010100గా ప్రామాణికరించారు.

పరిమాణం[మార్చు]

ఒక సాధారణ పుస్తకాన్ని 106 సున్నాలతో ముద్రించవచ్చు (ప్రతీ పేజీకి 50 వరుసలు, ఒక్కో వరుసకు 50 సున్నాలు కలిగినవి 400 పేజీలు). అందువలన అటువంటి 1094 పుస్తకాలు గూగోల్‌ప్లెక్స్ సున్నాలతో ముద్రిస్తే, ప్రతీ పుస్తకం ద్రవ్యరాశి 100 గ్రాములు అయితే, అన్ని పుస్తకాల మొత్తం ద్రవ్యరాశి 1094 కిలోగ్రాములు అవుతుంది. భూమి ద్రవ్యరాశి 5.972 x 1024 కిలోగ్రాములయితే, పాలపుంత గాలక్సీ ద్రవ్యరాశి సుమారు 2.5 x 1042 కిలోగ్రాములు. మనం గమనించిన విశ్వం మొత్తం ద్రవ్యరాశి 1.5 x 1053 కిలోగ్రాములుగా అంచనా వేయబడింది. అంతకన్నా మనం రాసిన పుస్తకాల ద్రవ్యరాశి అనేక రెట్లు అవుతుంది.

మూలాలు[మార్చు]

  1. Bialik, Carl (14 June 2004). "There Could Be No Google Without Edward Kasner". The Wall Street Journal Online. Archived from the original on 30 November 2016. (retrieved March 17, 2015)
  2. Edward Kasner & James R. Newman (1940) Mathematics and the Imagination, page 23, NY: Simon & Schuster

బయటి లంకెలు[మార్చు]