మహేశ్వరి (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహేశ్వరి

జన్మ నామంమహేశ్వరి
జననం (1977-08-26) 1977 ఆగస్టు 26 (వయసు 46)
భార్య/భర్త జయకృష్ణన్[1]
ప్రముఖ పాత్రలు గులాబి (సినిమా)
నీకోసం
పెళ్లి

మహేశ్వరి తెలుగు సినిమా నటి. ఈమె ప్రముఖ సినిమా నటి శ్రీదేవికి అక్క అయిన సూర్యకళ కుమార్తె. నీకోసం చిత్రానికి గానూ ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకుంది.

వృత్తి

[మార్చు]

మహేశ్వరి తన 16వ యేట 1994లో భారతీరాజా దర్శకత్వంలో వెలువడిన తమిళ సినిమా కరుత్తమ్మలో తొలిసారిగా నటించింది. తెలుగులో ఈమె మొదటి సినిమా గులాబి. ఈ సినిమాతో ఈమె పాపులర్ అయ్యింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. ఈమె జగపతి బాబు, జె.డి.చక్రవర్తి, రవితేజ, అజిత్ కుమార్, విక్రం, ప్రభు, అర్జున్ సర్జా, ప్రభుదేవా, శివరాజ్‌కుమార్ వంటి హీరోల సరసన నటించింది. 2003 నుండి 2014 మధ్యకాలంలో ఈమె కొన్ని తమిళ, తెలుగు టెలివిజన్ సీరియళ్ళలో కూడా నటించింది. నటన వృత్తి మానివేసిన తరువాత ఈమె హైదరాబాద్ లో ఫ్యాషన్ డిజైనర్‌గా మారి "మహే అయ్యప్పన్" అనే పేరుతో ఒక స్టోర్‌ను తెరచింది. దీనిని ఆమె పిన్ని శ్రీదేవి ప్రారంభించింది[2].[3]

నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు]
విడుదల సంవత్సరం సినిమా పాత్ర ఇతర నటులు ఇతర వివరాలు
1995 అమ్మాయి కాపురం ఆలీ, ఆనంద్,కోట శ్రీనివాసరావు
గులాబి పూజ జె. డి. చక్రవర్తి, జీవా, బ్రహ్మాజీ
ఖైదీ ఇన్‌స్పెక్టర్ సుమన్,రంభ
1996 దెయ్యం మహి జె. డి. చక్రవర్తి
మృగం జె. డి. చక్రవర్తి
1997 జాబిలమ్మ పెళ్ళి జ్యోతి జగపతి బాబు
పెళ్ళి వడ్డే నవీన్, పృథ్వీ రాజ్,సుజాత
ప్రియరాగాలు స్నేహ జగపతి బాబు, సౌందర్య
వీరుడు
1998 నవ్వులాట చందన రాజేంద్ర ప్రసాద్
1999 మా బాలాజీ పూజ వడ్డే నవీన్
నీ కోసం శశిరేఖ రవితేజ ఉత్తమ నటిగా నంది పురస్కారం
ఓ పనై పోతుంది బాబు సురేష్,సంఘవి
ప్రేమించేది ఎందుకమ్మా స్వప్న
రామసక్కనోడు మీనాక్షి సుమన్
వెలుగు నీడలు మీనా
2000 బలరాం శ్రీహరి, రాశి
మా అన్నయ్య నందిని రాజశేఖర్, దీప్తి భట్నాగర్
నాగులమ్మ నాగులమ్మ
తిరుమల తిరుపతి వెంకటేశ పద్మిని శ్రీకాంత్,రోజా, రవితేజ

టెలివిజన్ సీరియల్

[మార్చు]
సంవత్సరం సీరియల్ పేరు పాత్ర ఛానల్
2012–2013 మై నేమ్‌ ఈజ్ మంగతాయారు మంగతాయారు జీ తెలుగు

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Maheswari married to Jayakrishna". Filmibeat. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 4 August 2015.
  2. "'My aunt has been my backbone' - Maheswari, Sridevi's niece". Deccan Chronicle. 1 December 2014. Archived from the original on 2 మార్చి 2018. Retrieved 22 జూన్ 2020.
  3. "Maheshwari is a talented designer: Sridevi - Times of India". The Times of India. Archived from the original on 2018-02-17. Retrieved 2020-06-22.
  4. "1999 నంది అవార్డ్స్". Archived from the original on 2012-12-29. Retrieved 2020-06-22.

బయటి లింకులు

[మార్చు]