శ్రీకాంత్ (నటుడు)

వికీపీడియా నుండి
(మేకా శ్రీకాంత్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


శ్రీకాంత్
జననం మేకా శ్రీకాంత్
(1968-03-23) మార్చి 23, 1968 (వయస్సు: 49  సంవత్సరాలు)
గంగావతి, కొప్పల్ జిల్లా, కర్ణాటక
వృత్తి సినిమా నటుడు
భార్య / భర్త(లు) ఉహా

శ్రీకాంత్ గా ప్రసిద్ధిచెందిన మేకా శ్రీకాంత్ (ఆంగ్లం: Meka Srikanth) (జననం: మార్చి 23, 1968) ప్రముఖ తెలుగు సినిమా నటుల్లో ఒకడు.

బాల్యం[మార్చు]

శ్రీకాంత్ కర్ణాటక రాష్ట్రం, కొప్పల్ జిల్లాలోని గంగావతిలో జన్మించాడు. ధర్వార్ లోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో బీకాం పట్టా పొందాడు. ఒక ఫిల్మ్ ఇన్‌స్టిస్ట్యూట్ నుంచి డిప్లోమా కూడా పొందాడు. హీరోయిన్ ఊహను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి రోషన్ అనే కొడుకు, మేధ అనే కూతురు ఉన్నారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలతో, విలన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు. తాజ్‌మహల్ హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు. సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది.

సినీ ప్రస్థానం[మార్చు]

ఖడ్గం, ఆపరేషన్ ధుర్యోధన సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. స్వతహాగా చిరంజీవి అభిమానియైన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండేవాడు. ఆయన కోరిక శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్ తో తీరింది. దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్‌దాదా జిందాబాద్ లో కూడా ఆయనతో కలిసి నటించాడు.బాలకృష్ణతో కలిసి శ్రీరామరాజ్యం సినిమాలో... ఇంకా అగ్ర కథానాయకులయిన వెంకటేష్తో కలిసి సంక్రాంతి, నాగార్జునతో కలిసి నిన్నే ప్రేమిస్తా, డా.మంచు మోహన్ బాబుతో తప్పుచేసి పప్పుకూడు, డా.గద్దె రాజేంద్ర ప్రసాద్తో సరదాగా సరదాగా మొదలయిన వాటిలో నటించాడు.అలాగే తనతో సమానమైన నటులయిన జగపతిబాబుతో మనసులో మాట, జె.డి.చక్రవర్తితో ఎగిరే పావురమా,రవితేజతో ఖడ్గం,లలో వారితో కలిసి నటించాడు.

చిత్రాలు[మార్చు]

 1. షాడో (2013 సినిమా) (2013)
 2. శ్రీరామరాజ్యం (2011)
 3. మహాత్మ (2009) ఇది ఇతని 100 వ చిత్రం
 4. స్వరాభిషేకం (2004)
 5. నగరం
 6. యమగోల మళ్ళీ మొదలైంది
 7. శంకర్ దాదా జిందాబాద్ (2007)
 8. ఆపరేషన్ ధుర్యోధన
 9. వన్ బై టూ (2003)
 10. చాలా బాగుంది (2000)
 11. అమ్మో ఒకటోతారీఖు (2000)
 12. మాయాజాలం
 13. నిన్నే ప్రేమిస్తా (2000)
 14. రాధా గోపాళం
 15. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి (2000)
 16. సంక్రాంతి (వెంకటేష్ కు తమ్ముడిగా)
 17. ఖడ్గం
 18. అనగనగా ఒక అమ్మాయి (1999)
 19. పంచదార చిలక (1999)
 20. శంకర్ దాదా ఎం.బీ.బీ.ఎస్
 21. పెళ్ళాం ఊరెళితే
 22. గిల్లికజ్జాలు (1998)
 23. శుభలేఖలు (1998)
 24. ఓ చినదానా!
 25. కన్యాదానం (1998)
 26. ఒట్టేసి చెబుతున్నా!
 27. ఊయల (1998)
 28. మా నాన్నకు పెళ్ళి (1997)
 29. మాణిక్యం (1999)
 30. తాళి (1997)
 31. పెళ్ళిసందడి (1996)
 32. హలో ఐ లవ్ యూ (1997)
 33. పిల్ల నచ్చింది (1999)
 34. ఆమె
 35. సింహ గర్జన (1995)
 36. పండగ
 37. ఆహ్వానం (1997)
 38. ప్రేయసి రావే!
 39. వినోదం (1996)
 40. ఎగిరే పావురమా (1997)
 41. దొంగ రాస్కెల్ (1996)
 42. తాజ్ మహల్ (1995)
 43. మధురా నగరిలో (1991)
 44. మనసులో మాట (1991)

బయటి లింకులు[మార్చు]