స్కంద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్కంద
దర్శకత్వంబోయపాటి శ్రీను
రచనబోయపాటి శ్రీను
మాటలు
 • ఎం. రత్నం
నిర్మాతశ్రీనివాస చిట్టూరి
తారాగణం
ఛాయాగ్రహణంసంతోష్ డేటాకే
కూర్పుతమ్మిరాజు
సంగీతంతమన్
నిర్మాణ
సంస్థలు
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
జీ స్టూడియోస్
విడుదల తేదీ
28 సెప్టెంబర్ 2023
దేశంభారతదేశం
భాషతెలుగు

స్కంద 2023లో విడుదలైన తెలుగు సినిమా. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. రామ్‌, శ్రీలీల, ప్రిన్స్ సిసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సినిమా ట్రైల‌ర్‌ను ఆగష్టు 26న నటుడు నందమూరి బాలకృష్ణ విడుదల చేయగా[1], సెప్టెంబర్‌ 28న తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.

షూటింగ్

[మార్చు]

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా నిర్మాణ అధికార ప్రకటన 18 ఫిబ్రవరి 2022న చేసి[2], రెగ్యులర్ షూటింగ్ 6 అక్టోబర్ 2022న ప్రారంభమైంది.[3] ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ని జులై 3న ఉదయం 11:25 గంటలకు అధికారికంగా ప్రకటించారు.[4]

నటీనటులు

[మార్చు]

ప్రముఖ పారిశ్రామికవేత్త క్రౌన్‌ గ్రూప్‌ కంపెనీస్‌ అధినేత రామకృష్ణంరాజు (శ్రీకాంత్‌) దారుణమైన నేరాలు చేశాడనే అభియోగంతో కోర్టు ఉరిశిక్షవిదిస్తుంది. తెలంగాణ సీఏం కుమార్తె (శ‌ర‌త్ లోహిత‌స్య‌)తో పాటు ఏపీ సీఏం (అజ‌య్ పుర్క‌ర్‌) కుమార్తెల‌ను రుద్ర‌కంటి భాస్క‌ర్ (రామ్ పోతినేని) కిడ్నాప్ చేస్తాడు. ఇద్దరు ముఖ్యమంత్రుల కూతుళ్లనీ కిడ్నాప్‌ చేసి రుద్రరాజపురం తీసుకెళ్లిన భాస్క‌ర్ రాజూ(రామ్ పోతినేని) ఎవరు? ఈ కిడ్నాప్‌లకీ భాస్కర్ కుటుంబానికి ఎలాంటి సంబంధం ఉంది. ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[7]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌
 • నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను
 • సంగీతం: తమన్
 • సినిమాటోగ్రఫీ: సంతోష్ డేటాకే
 • ఎడిటర్: తమ్మిరాజు
 • ఫైట్స్ : స్టాన్ శివ
 • కోరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ మాస్టర్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నీ చుట్టు నీ చుట్టు[8]"రఘురాంసిద్ శ్రీరామ్, సంజన కాలమంజే4:10
2."గండరబాయ్[9]"అనంత్ శ్రీరామ్‌నకాశ్‌ అజీజ్‌, సౌజన్య భాగవతుల3:49
3."డుమ్మారే డుమ్మారే[10]"కల్యాణచక్రవర్తి త్రిపురనేనిఅర్మాన్ మాలిక్, అయాన్ ప్రణతి4:23
4."కల్ట్ మామ[11]"అనంత్ శ్రీరామ్‌హేమచంద్ర, రమ్య బెహరా, మహా4:08
మొత్తం నిడివి:16:30

మూలాలు

[మార్చు]
 1. A. B. P. Desam (26 August 2023). "బాలకృష్ణ విడుదల చేసిన 'స్కంద' ట్రైలర్ - గూస్ బంప్స్ తెప్పించేలా రామ్, బోయపాటిల మాస్". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
 2. Namasthe Telangana (19 February 2022). "రామ్‌- బోయపాటి పాన్‌ ఇండియా చిత్రం". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
 3. Namasthe Telangana (6 October 2022). "బోయ‌పాటి సినిమా షూటింగ్ షురూ..రామ్ కొత్త అప్‌డేట్‌". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
 4. 10TV Telugu (1 July 2023). "టైటిల్ గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్ చేసిన రామ్.. ఊర మాస్ ఉంటుందట!" (in Telugu). Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 5. Hindustantimes Telugu (6 January 2023). "రామ్‌, బోయపాటి సినిమా షూటింగ్‌లో చేరిన శ్రీలీల". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
 6. V6 Velugu (3 March 2023). "హీరో రామ్ తో బాలీవుడ్ బ్యూటీ రొమాన్స్". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 7. Eenadu (28 September 2023). "రివ్యూ స్కంద.. రామ్‌-బోయపాటి కాంబినేషన్‌ మెప్పించిందా?". Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.
 8. A. B. P. Desam (3 August 2023). "'స్కంద' ఫస్ట్ సింగిల్ సాంగ్ - డ్యాన్స్‌తో అదరగొట్టిన రామ్, శ్రీలీల!". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
 9. Andhra Jyothy (19 August 2023). "ఊర మాస్‌ పాట వచ్చింది". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
 10. Namasthe Telangana (30 August 2023). "రామ్‌ స్కంద నుంచి కలర్‌ఫుల్ డుమ్మారే డుమ్మా ఫ్యామిలీ సాంగ్‌". Archived from the original on 30 August 2023. Retrieved 30 August 2023.
 11. A. B. P. Desam (18 September 2023). "'స్కంద' ఊర మాస్ సాంగ్ వచ్చేసింది - ఊర్వశితో రామ్ ఊర మాస్ స్టెప్స్ అదుర్స్!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=స్కంద&oldid=4035944" నుండి వెలికితీశారు