బోయపాటి శ్రీను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోయపాటి_శ్రీను
Boyapati Srinu.jpg
జననంబోయపాటి శ్రీనివాస్
పెదకాకాని, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
నివాసంహైదరాబాదు, తెలంగాణ, భారత దేశం
వృత్తిదర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు2002–నేటి వరకు
బంధువులుపోసాని కృష్ణ మురళి

బోయపాటి శ్రీను తెలుగు సినిమా దర్శకుడు. బోయపాటి శ్రీనివాస్ రెండు నంది పురస్కారాలు, రెందు "టిఎస్ఆర్ జాతీయ అవార్డులు" అందుకున్నాడు.[1][2] 2005 లో రవితేజ, మీరా జాస్మిన్,, ప్రకాష్ రాజ్ నటించిన భద్ర సినిమాతో శ్రీను దర్శకుడిగా పరిచయమయ్యాడు .తులసి తన రెండవ చిత్రం .2010 లో, శ్రీను యొక్క మూడవ సినిమా నందమూరి బాలకృష్ణ, నయనతార, స్నేహ ఉల్లాల్ నటించిన సింహా విడుదల.2012 లో, అతను తన నాల్గవ చిత్రం ఎన్.టి.ఆర్., త్రిష, కార్తికా నాయర్ నటించిన దమ్మువిడుదలైనది.[3][4]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

బోయపాటి శ్రీను 1971 ఏప్రిల్ 25న గుంటూరు జిల్లాలోని పెదకాకాని గ్రామంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు లింగయ్య, సీతారావమ్మ. తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం కాగా వారిలో శ్రీను మూడవ సంతానం. తండ్రి లింగయ్య వ్యవసాయం చేస్తూండగా, అన్నయ్య బ్రహ్మానందరావు ఫోటోస్టూడియో నిర్వహిస్తూండేవాడు.[5]

అతని ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల విద్య అంతా పెదకాకానిలోనే జరిగింది. ఇంటర్మీడియట్, డిగ్రీ గుంటూరు జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాలలో చదువుకున్నాడు. డిగ్రీ దశలో అన్నయ్య ఫోటోగ్రఫీ స్టూడియో నిర్వహణలో సహాయం చేయడం, ఈనాడు పత్రికా విలేకరిగా పనిచేయడం వంటివి చేసేవాడు. డిగ్రీ పూర్తయ్యాకా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. (చరిత్ర) చదువుకున్నాడు. చదువు, స్టూడియో పనులు, వార్తా రచనల్లో తలమునకలుగా ఉండడంతో ఈ దశలో శ్రీనుకు సినిమాలపై ఆసక్తి ఉండేది కాదు. పత్రికలు క్షుణ్ణంగా చదువుకోవడం, ఫోటోగ్రఫీ మీద ఆసక్తి మాత్రమే అతని వ్యాపకాలు. ఈ విధంగా అతని ఎం.ఎ. పూర్తయ్యింది.[5]

సినిమా రంగం[మార్చు]

సినిమాల్లోకి ప్రవేశం[మార్చు]

1994లో ఎం.ఎ. పూర్తికాగానే శ్రీను పోలీస్ ఎస్సై కావడానికి పరీక్షలు, ఫిజికల్ టెస్టులు పూర్తిచేశాడు. ఉద్యోగానికి ఎంపిక కూడా అయ్యాడు. అయితే ఏవో కారణాల వల్ల అందులో చేరలేదు. ఫోటోగ్రఫీ వ్యాపారం, పత్రికా రచన కొనసాగిస్తూ ఉన్న దశలో శ్రీను బంధువు, సినిమా రచయిత పోసాని కృష్ణ మురళి ఇంటికి వచ్చినప్పుడు, సినిమా రంగంలో దర్శకత్వ శాఖలో సిఫార్సు చేస్తానని, పనిచేయదలుచుకుంటే హైదరాబాద్ రమ్మని సూచించాడు. 1997లో కుటుంబ సభ్యుల ఆమోదం మేరకు శ్రీను హైదరాబాద్ వెళ్ళగా కృష్ణ మురళీ సిఫార్సు మేరకు ముత్యాల సుబ్బయ్య వద్ద దర్శకత్వ శాఖలో చేరాడు.[5]

అప్పటికి పవిత్ర బంధం సినిమా పూర్తవుతోంది. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన పెళ్ళి చేసుకుందాం, అన్నయ్య, గోకులంలో సీత వంటి సినిమాలకు వరుసగా దర్శకత్వ శాఖలో సహాయకునిగా శ్రీను పనిచేశాడు. ఈ దశలో అతను అనేక సినిమాలు చూసి, సినీ రంగంపై అవగాహన పెంచుకుంటూ, పలు కథలు రాసుకున్నాడు.

దర్శకునిగా తొలి సినిమాలు- భద్ర, తులసి[మార్చు]

2003 ప్రాంతంలో తాను తయారుచేసుకున్న కథని అల్లు అర్జున్‌ని హీరోగా తీయాలని భావించి అల్లు అరవింద్‌కి వినిపించాడు. కథ బావున్నా, అది మాస్ యాక్షన్ కథ కావడంతో కొత్తగా హీరోగా ఎదుగుతున్న అల్లు అర్జున్ చేస్తే తర్వాత్తర్వాత లవ్ స్టోరీలు చేసేందుకు వీలుండదని భావించిన అరవింద్ ఆమోదించలేదు. ఐతే, కథ బావుంది కాబట్టి పేరొందిన హీరోని పెట్టి చేస్తే హిట్టవుతుందని భావించి శ్రీనుని దిల్ రాజుకు పరిచయం చేశాడు. తనకు కథ బాగా నచ్చడంతో దిల్ రాజు వెంటనే ఓకే చేశాడు. హీరోగా రవితేజను దిల్ రాజు సూచించడంతో అప్పటి అతని ట్రెండ్‌ని అనుసరిస్తూ శ్రీను సినిమాలో హాస్యాన్ని పెంచి రాసుకున్నాడు. 2004 నవంబరు 17న సినిమా ప్రారంభమైంది. ఆ సినిమా "భద్ర" పేరిట బోయపాటి శ్రీను తొలి సినిమాగా 2005 మే 12న విడుదలై మంచి విజయాన్ని సాధించింది.[5]

రెండవ సినిమాగా 2007లో దగ్గుబాటి వెంకటేష్‌, నయన తారలతో తీసి, విడుదల చేసిన తులసి కూడా విజయవంతమైంది.

సింహ నుంచి లెజెండ్ వరకు[మార్చు]

దర్శకత్వం వహించిన చిత్రాలు[మార్చు]

విడుదల తేది చలన చిత్రం తారగణం
12 మే 2005 భద్ర రవితేజ, మీరా జాస్మిన్
12 అక్టోబరు 2007 తులసి వెంకటేష్, నయనతార
30 ఏప్రేల్ 2010 సింహా నందమూరి బాలకృష్ణ, నమిత,నయనతార,స్నేహ ఉల్లాల్
27 ఏప్రేల్ 2012 దమ్ము జూ. ఎన్.టి.ఆర్., త్రిష, కార్తికా నాయర్
28 మార్చు 2014 లెజెండ్ నందమూరి బాలకృష్ణ,జగపతిబాబు, సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టే
22 ఏప్రేల్ 2016 సరైనోడు అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్
11 అగస్టు 2017 జయ జానకి నాయక [[బెల్లంకొండ శ్రీనివాస్]], రకుల్ ప్రీత్ సింగ్
10 జనవరి 2019 వినయ విధేయ రామ

రాం చరణ్ తేజ, కియరా అద్వానీ

పురస్కారాలు[మార్చు]

నంది పురస్కారాలు
టిఎస్ఆర్ జాతీయ అవార్డులు
 • సింహా కోసం ఉత్తమ దర్శకుడిగా టి.ఎస్.ఆర్ - TV9 అవార్డు (2010) ఏప్రిల్ 10, 2011 న హైదరాబాదులో సమర్పించబడింది.[8]
 • టిఎస్ఆర్ - టివి 9 అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్ (2014) చిత్రం లెజెండ్ [9]

మూలాలు[మార్చు]

 1. "Balakrishna -Boyapati Srinu Movie Titled LEGEND". timesofap.com. Retrieved 22 September 2013. Cite web requires |website= (help)
 2. "Andhra Pradesh government announces Nandi awards for 2014-2016 - Times of India". Cite web requires |website= (help)
 3. "'Legend' Review Roundup: Complete Commercial Package; Real Treat for Balakrishna's Fans". International Business Times India. 28 March 2014. Retrieved 29 March 2014. Cite web requires |website= (help)
 4. "Balakrishna's Legend opens to positive reviews". The Times of India. 28 March 2014. Retrieved 29 March 2014. Cite web requires |website= (help)
 5. 5.0 5.1 5.2 5.3 బోయపాటి, శ్రీను (2008 మార్చి 1). "మొదటి సినిమా - బోయపాటి శ్రీను". కౌముది. Retrieved 22 ఫిబ్రవరి 2020. Check date values in: |date= (help)
 6. "Andhra Pradesh government announces Nandi awards for 2014-2016 - Times of India". Cite web requires |website= (help)
 7. "Andhra Pradesh government announces Nandi awards for 2014-2016 - Times of India". Cite web requires |website= (help)
 8. TSR – TV9 awards 2011 – Telugu cinema
 9. "TSR TV9 Film Awards Winners (List) Presentation Function on July 16". Allindiablog.org. మూలం నుండి 2016-05-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-12-24. Cite web requires |website= (help)

మూస:Boyapati Srinu