నమిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నమిత

జన్మ నామంనమిత ముఖేశ్ వాంక్వాలా [1]
జననం (1980-05-10) 1980 మే 10 (వయసు 44)
Indiaసూరత్, గుజరాత్, భారతదేశం
ఇతర పేర్లు భైరవి
క్రియాశీలక సంవత్సరాలు 2002-ఇప్పటివరకు
భార్య/భర్త
వీరేంద్ర చౌదరి
(m. 2017)

నమితగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన నటీమణి అసలు పేరు నమిత వాంక్వాలా. ఈమె మే 10, 1980లో గుజరాత్ రాష్ట్రం సూరత్ లోజన్మించింది.

1998లో మిస్ సూరత్ గా, 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించింది.

జెమిని చిత్రంతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినది. ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందింది. ఆ తరువాత తమిళ, కన్నడ, హిందీ సినీరంగంలోకి ప్రవేశించింది.

ఈ బొద్దుగుమ్మ 2010లో వచ్చిన సింహా చిత్రంలోనూ విశేషంగా అలరించింది. నమిత 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. వీరికి కవలలు జన్మిచ్చారు. ఈ విషయాన్ని 2022 ఆగస్టు 19న ఇద్దరు మగ శిశులకు జన్మనిచ్చినట్టు ఆమె ప్రకటించింది.[2]

నమిత నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • ఐ.సౌజన్య జూలై 2007 స్వాతి సపరివారపత్రికలో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.
  1. http://www.youtube.com/watch?v=WKE_pajGHsM
  2. "Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత". web.archive.org. 2022-08-20. Archived from the original on 2022-08-20. Retrieved 2022-08-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నమిత&oldid=4027098" నుండి వెలికితీశారు