జెమిని

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జెమిని
Gemeni telugu.jpg
దర్శకత్వం సరణ్
నిర్మాత ఎమ్ సరవన్
రచన పోసాని కృష్ణ మురళి (సంభాషణలు)
స్క్రీన్ ప్లే సరణ్
కథ సరణ్
ఆధారం జెమిని (తమిళం)
నటులు దగ్గుబాటి వెంకటేష్
నమిత
సంగీతం ఆర్. పి. పట్నాయక్
ఛాయాగ్రహణం ఎ. వెంకటేష్
కూర్పు సురేష్
నిర్మాణ సంస్థ
పంపిణీదారు సురేష్ ప్రొడక్షన్స్
విడుదల
11 అక్టోబరు 2002 (2002-10-11)
నిడివి
132 నిముషాలు
దేశం భారతదేశం
భాష తెలుగు

జెమిని (ఆంగ్లము: :Gemini) సరణ్ దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్, నమిత హీరోహీరోయిన్స్ గా 2002లో వచ్చిన చిత్రం.[1] ఈ చిత్రాన్ని ఏ.వి.యం. ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఎమ్ సరవన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందిచారు. కళాభవన్ మణి, రఘు బాబు, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, వేణు మాధవ్, సుధాకర్, కోట శ్రీనివాస రావు, ఆహుతి ప్రసాద్, సుజాత, మురళి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు.

కథ[మార్చు]

విజయవాడలోని జెమిని (వెంకటేష్), లడ్డా (కళాభవన్ మణి) అనే ఇద్దరి రౌడీల కథే ఈ సినిమా. లడ్డా తరపు మనిషి జెమిని మనిషిని చంపుతాడు. దాంతో జెమిని గ్యాంగ్ ఆ వ్యక్తిని కనిపెట్టి చంపేస్తారు. ఈ సంఘటనతో వారిద్దరి మధ్య విరోధం ప్రారంభమౌంతుంది.

అదేసమయంలో జెమిని మార్వాడి అమ్మాయిఐన మనిషా (నమిత) ప్రేమలో పడతాడు. మనిషా రాత్రి కళాశాలలో చదువుతుంటుంది. జెమిని కూడా అదే కళాశాలలో చేరుతాడు. అక్కడ ఇద్దరు ఒక్కరినొకరు ప్రేమించుకుంటారు. విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విశ్వనాథ్ (మురళి) వస్తాడు. జెమిని మరియు లడ్దులను పట్టుకోని పోలీస్ స్టేషన్ లో పెడతాడు. అప్పుడు వాళ్ళు మాములు మనిషులుగా బ్రతుకుతామని విశ్వనాథ్ ని ఒప్పించి, అతని నుంచి అవకాశం పొందుతారు. జెమిని, లడ్దులు మారారా లేక అలాగే ఉన్నారా...జెమిని, మనిషాల ప్రేమను పెద్దలు అంగీకరించారా లేదా అన్నది మిగతా కథ.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

జెమిని
ఆర్. పి. పట్నాయక్ స్వరపరచిన సినిమా
విడుదల 2002
సంగీత ప్రక్రియ పాటలు
నిడివి 30:46
రికార్డింగ్ లేబుల్ ఆదిత్యా మ్యూజిక్
నిర్మాత ఆర్. పి. పట్నాయక్
ఆర్. పి. పట్నాయక్ యొక్క ఆల్బమ్‌ల కాలక్రమణిక
హోలీ
(2002)
జెమిని
(2002)
నీ స్నేహం
(2002)

సంగీతం ఆర్. పి. పట్నాయక్. అన్ని హిట్ పాటలు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.

సంఖ్య. పాట సాహిత్యం గానం నిడివి
1. "చెలి చెడుగుడు జెమిని"   వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పి. బాలు, అనురాధ శ్రీరామ్ 4:04
2. "పూలలో తేనే ప్రేమ"   వేటూరి సుందరరామ్మూర్తి రాజేష్ 4:16
3. "దిల్ దివాన మైన్ హసీనా"   వేటూరి సుందరరామ్మూర్తి ఉషా 4:15
4. "బ్రహ్మ ఓ బ్రహ్మ"   కులశేఖర్ ఎస్.పి. బాలు 4:13
5. "చుక్కల్లో కెక్కినాడు"   వేటూరి సుందరరామ్మూర్తి వందేమాతరం శ్రీనివాస్ 2:58
6. "చెలి చెడుగుడు జెమిని"   వేటూరి సుందరరామ్మూర్తి ఎస్.పి. బాలు, అనురాధ శ్రీరామ్ 4:04
7. "బంధమే ముల్లు"   వేటూరి సుందరరామ్మూర్తి ఆర్. పి. పట్నాయక్ 2:35
8. "నడక చూస్తే వయ్యారం"   వేటూరి సుందరరామ్మూర్తి శంకర్ మహదేవన్, ఉషా 4:12
మొత్తం నిడివి:
30:46

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్, తెలుగు సినిమాలు. "జెమిని". telugu.filmibeat.com. Retrieved 10 September 2016. 

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జెమిని&oldid=2080830" నుండి వెలికితీశారు