కోట శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
(కోట శ్రీనివాస రావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కోట శ్రీనివాసరావు
Kota srinivasarao.jpg
కోట శ్రీనివాసరావు
జననంకోట శ్రీనివాసరావు
1942, జులై 10
కృష్ణా జిల్లా కంకిపాడు
వృత్తిఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు
ప్రసిద్ధితెలుగు సినిమా నటుడు

కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1945, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు.ఇతని పేరు కోట ప్రసాద్.ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[1][2]

కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

సినీరంగ ప్రవేశం[మార్చు]

కోట శ్రీనివాసరావుకు బాగా పేరు తెచ్చిపెట్టిన పిసినారి పాత్ర

బాల్యం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలముపై 20 యేళ్ళ అనుభవం గడించాడు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాద పూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1986 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు.

అహ నా పెళ్ళంట సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది.

ప్రజాదరణ పొందిన కోట డైలాగులు[మార్చు]

 • ఈ డెవడ్రా బాబూ...
 • నాకేంటి ..మరి నాకేంటి.
 • మరదేనమ్మా నా స్పెషల్.
 • అయ్య నరకాసుర.
 • అంటే నాన్నా అది

పురస్కారాలు[మార్చు]

 • పద్మశ్రీ పురస్కారం - 2015 : 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న ఈయన్ని పద్మ అవార్డులలో భాగంగా పద్మశ్రీతో భారత ప్రభుతం సత్కరించింది.[3]

నంది పురస్కారాలు[మార్చు]

 1. నంది ఉత్తమ విలన్- గణేష్ (1998)
 2. నంది ఉత్తమ విలన్ - చిన్న (2000)
 3. నంది ఉత్తమ సహాయ నటుడు- పృథ్వీ నారాయణ (2002)
 4. నంది ఉత్తమ సహాయ నటుడు - ఆ నలుగురు (2004)
 5. నంది ఉత్తమ సహాయ నటుడు - పెళ్లైన కొత్తలో (2006)

చిత్ర సమాహారం[మార్చు]

తెలుగు సినిమాలు[మార్చు]

2010లు[మార్చు]

 1. క్షేత్రం (2011)
 2. రంగం (2011)
 3. బృందావనం (2010)
 4. శంభో శివ శంభో (2010)
 5. రక్త చరిత్ర (2010)
 6. ఖలేజా (2010) .... హీరో తాత
 7. గాయం 2 (2010) .... గురు నారాయణ
 8. డార్లింగ్ (2010)
 9. లీడర్ (2010) .... పెద్దాయన
 10. అడ్డా (2013)[4]
 11. ప్రతినిధి (2014) .... ముఖ్యమంత్రి సాంబశివరావు
 12. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
 13. జవాన్ (2017)

2000లు[మార్చు]

 1. ఆంజనేయులు (2009)
 2. కిక్ (2009)
 3. సరే నీ ఇష్టం (2009)
 4. ఎవరైనా ఎప్పుడైనా (2009)
 5. రాజావారి చేపల చెరువు (2009)
 6. గజిబిజి (2008)
 7. హీరో (2008)
 8. పౌరుడు (2008)
 9. హరే రామ్ (2008)
 10. బుజ్జిగాడు (2008)
 11. కంత్రి (2008)
 12. సుందరకాండ (2008)
 13. రెడీ (2008)
 14. నీ సుఖమే నే కోరుకున్నా (2008) .... Sarvabhouma Rao
 15. విశాఖ ఎక్స్ ప్రెస్ (2008)
 16. ఒక్క మగాడు (2008)
 17. కృష్ణ (2008)
 18. భజంత్రీలు (2007)
 19. అతిథి (2007)
 20. పెళ్ళయింది కానీ (2007)
 21. లక్ష్యం (2007)
 22. మున్నా (2007) .... Srinivas Rao
 23. ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007) .... Ganesh's father
 24. క్లాస్ మేట్స్ (2007) .... Professor Chandram
 25. యోగి (2007) .... Kotaiah
 26. ఖతర్నాక్ (2006)
 27. రాఖీ (2006)
 28. బొమ్మరిల్లు (2006) .... Kanaka Rao
 29. పౌర్ణమి (2006)
 30. పెళ్ళైన కొత్తలో (2006)
 31. సైనికుడు (2006) .... Chief Minister
 32. అందాల రాముడు (2006)
 33. నందనవనం (2006) .... Banerjee
 34. షాక్ (2006) .... Dharma Reddy
 35. సర్కార్ (2005).. Silver Mani
 36. మహానంది (2005)
 37. శ్రీ (2005)
 38. అల్లరి పిడుగు (2005)
 39. అల్లరి బుల్లోడు (2005)
 40. ఛత్రపతి (2005) .... అప్పలనాయుడు
 41. అతడు (2005) .... బాజిరెడ్డి
 42. ధైర్యం (2005)
 43. హంగామా (2005)
 44. నా అల్లుడు (2005)
 45. సోగ్గాడు (2005) .... Ravi's father
 46. సూర్యం (2004)
 47. గుడుంబా శంకర్ (2004) .... Devudu
 48. నాని (2004)
 49. మల్లీశ్వరి (2004) .... భవానీ ప్రసాద్
 50. సత్యం (2003) .... Shankar, Ankita's father
 51. ఠాగూర్ (2003)
 52. సింహాద్రి (2003)
 53. పెళ్ళాంతో పనేంటి (2003) .... Kalyani's father
 54. సింహాచలం (2003)
 55. దొంగ రాముడు & పార్టీ (2003)
 56. అమ్ములు (2003)
 57. పెళ్ళాం ఊరెళితే (2003)
 58. గెలుపు
 59. ప్రేమలో పావనీ కళ్యాణ్ (2002)
 60. సందడే సందడి (2002)
 61. పృథ్వీ నారాయణ (2002)
 62. ఇదేం ఊరురా బాబు
 63. ఇడియట్ (2002) .... The Head Constable
 64. తప్పు చేసి పప్పు కూడు (2002)
 65. అల్లరి (2002)
 66. సంతోషం (2002)
 67. ఓ చినదానా (2002)
 68. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
 69. కొండవీటి సింహాసనం (2002)
 70. హనుమాన్ జంక్షన్ (2001)
 71. భద్రాచలం (2001)
 72. వీడెక్కడి మొగుడండి? (2001)
 73. థాంక్ యు సుబ్బారావు (2001)
 74. అధిపతి (2001)
 75. ఆకాశవీధిలో (2001)
 76. మనసిస్తా రా (2001)
 77. [[ఫేమిలీ సర్కస్ (2001)
 78. పండంటి సంసారం (2001)
 79. ప్రేమతో రా (2001)
 80. ప్రేమించు (2001)
 81. ఎదురులేని మనిషి (2001)
 82. మా ఆయన సుందరయ్య (2001)
 83. మా ఆవిడ మీద ఒట్టు (2001)
 84. సకుటుంబ సపరివార సమేతంగా (2000)
 85. చెలియా చెలియా చిరుకోపమా (2000)
 86. ప్రేమ సందడి (2000)
 87. అయోధ్య రామయ్య (2000)
 88. వంశీ (2000)
 89. బద్రి (2000) .... బద్రి తండ్రి

1990లు[మార్చు]

 1. సమరసింహా రెడ్డి (1999)
 2. గన్ షాట్
 3. బొంబాయి ప్రియుడు
 4. వినోదం
 5. పిట్టలదొర
 6. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
 7. అక్కుం బక్కుం
 8. వంశానికొక్కడు
 9. శుభలగ్నం
 10. డాడీ (2001)
 11. స్టూడెంట్ నంబర్. 1 (2001) .... సంపత్ వర్మ
 12. చిన్నా (2001)
 13. ఒరే తమ్ముడు (2001)
 14. అన్నయ్య (2000) .... బాబాయ్
 15. పోస్ట్ మాన్ (1999)
 16. శ్రీ రాములయ్య (1999)
 17. స్నేహం కోసం (1999)
 18. రాయుడు (1998)
 19. గణేష్ (1998)
 20. బావగారూ బాగున్నారా? (1998)
 21. మావిడాకులు (1998)
 22. అనగనగా ఒక రోజు (1997)
 23. అన్నమయ్య (1997)
 24. చిన్నబ్బాయి (1997)
 25. గోగులంలో సీత (1997) .... ముద్దుకృష్ణయ్య
 26. మా నాన్నకి పెళ్ళి (1997) .... సుబ్బరాజు
 27. మామా బాగున్నావా? (1997)
 28. వీడెవడండీ బాబు (1997)
 29. ఓహో నా పెళ్ళంట (1996) .... వల్లభరావు
 30. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి (1996) .... సులేమాన్
 31. లిటిల్ సోల్జర్స్ (1996) .... మేజర్ హరిశ్చంద్ర ప్రసాద్
 32. రాంబంటు (1996) ....గిరీషం
 33. బిగ్ బాస్ (1995)
 34. ఘరాణా బుల్లోడు (1995)
 35. అల్లుడా మజాకా (1995) .... కోట పెంటయ్య
 36. ఘటోత్కచుడు (1995) .... మాంత్రికుడు
 37. మనీ మనీ (1995)
 38. శుభ సంకల్పం (1995)
 39. సూపర్ పోలీస్ (1994)
 40. పోలీసు అల్లుడు (1994)
 41. లక్కీ ఛాన్స్
 42. పచ్చ తోరణం (1994)
 43. రైతు భారతం (1994)
 44. ముగ్గురు మొనగాళ్ళు (1994)
 45. టాప్ హీరో (1994)
 46. ఆమె (1994) .... శ్రీనివాసరావు
 47. ఆలీబాబా అరడజను దొంగలు (1994)
 48. హల్లో బ్రదర్ (1994) .... తాడి మట్టయ్య
 49. నంబర్ వన్ (1994)
 50. పెల్ళికొడుకు (1994)
 51. యమలీల (1994)
 52. గోవిందా గోవిందా (1993)
 53. ముఠా మేస్త్రీ (1993)
 54. అక్క పెత్తనం చెల్లెలి కాపురం (1993)
 55. గాయం (1993) .... గురు నారాయణ్
 56. ఇష్ గప్ చుప్ (1993)
 57. జంబ లకిడి పంబ (1993)
 58. మాయలోడు (1993) .... అప్పలకొండ
 59. మెకానిక్ అల్లుడు (1993) .... కోటప్ప
 60. మనీ (1993)
 61. ప్రాణదాత (1993)
 62. రాజేంద్రుడు గజేంద్రుడు (1993)
 63. చిట్టెమ్మ మొగుడు (1992) .... మిలటరీ బాబాయి
 64. 420 (1992) .... తాడి మట్టయ్య
 65. అశ్వమేధం (1992)
 66. అయ్యో బ్రహ్మయ్య
 67. చిత్రం భళారే విచిత్రం (1992) .... గరుడాచలం
 68. పచ్చని సంసారం (1992)
 69. సుందరకాండ (1992)
 70. రౌడీ అల్లుడు (1991)
 71. ప్రేమ ఎంత మధురం (1991) .... నారాయణరావు
 72. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ (1991)
 73. ఆడపిల్ల (1991)
 74. ఏడు కొండలస్వామి (1991)
 75. కొబ్బరి బొండాం (1991)
 76. మామగారు (1991) .... పోతురాజు
 77. సీతారామయ్య గారి మనవరాలు (1991)
 78. ఇద్దరూ ఇద్దరే (1990)
 79. కొక్కొరొకొ (1990)
 80. రాజా విక్రమార్క (1990)
 81. మా ఇంటి మహరాజు (1990)
 82. బొబ్బిలి రాజా (1990)
 83. చెవిలో పువ్వు (1990)
 84. జయమ్ము నిశ్చయమ్మురా (1990) .... పటేల్
 85. జయసింహ (1990 సినిమా)
 86. శతృవు (1990) .... వెంకటరత్నం
 87. ప్రేమా జిందాబాద్

1980లు[మార్చు]

 1. శివ (1989) .... Machiraju
 2. శ్రీమాన్ బ్రహ్మచారి
 3. ఆలుమగలు
 4. ఆవిడా మా ఆవిడే
 5. అక్క మొగుడు
 6. బంధువులొస్తున్నారు జాగ్రత్త (1989)
 7. బావా బావా పన్నీరు (1989)
 8. బావ బావమరిది
 9. చిన్నల్లుడు
 10. దొంగాట
 11. హై హై నాయకా (1989) .... Pedda Rayudu
 12. శ్రీరామచంద్రుడు (1989)
 13. స్వరకల్పన (1989)
 14. చెవిలో పువ్వు (1989)
 15. మాతో పెట్టుకోకు
 16. మనసున్న మారాజు
 17. పవన్ - సుబ్బలక్ష్మి ప్రేమించుకున్నారట
 18. పెద్దన్నయ్య
 19. పెళ్ళిగోల
 20. ప్రేమ విజేత
 21. ప్రేమా జిందాబాద్
 22. ప్రెసిడెంటుగారి పెళ్ళాం
 23. రెండిళ్ళ పూజారి
 24. ఖైదీ నెం. 786 (1988) .... సూర్యచంద్ర రావు
 25. యముడికి మొగుడు (1988) .... కోటయ్య
 26. చూపులు కలసిన శుభవేళ (1988) .... Gurnadham
 27. సాహసం చేయరా డింభకా (1988) .... Harmonium Hanumantha Rao
 28. వారసుడొచ్చాడు (1988)
 29. శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1987) .... Yella Papa Rao
 30. శుభవార్త
 31. సూర్యవంశం
 32. బాబాయి అబ్బాయి
 33. ఆహనా పెళ్ళంట (1987) - లక్ష్మీపతి
 34. ఆస్తులు అంతస్తులు (1988)
 35. ప్రతిఘటన (1986) .... యాదగిరి
 36. రేపటి పౌరులు (1986)
 37. తాండ్ర పాపారాయుడు (1986)
 38. దేవాంతకుడు (1984)
 39. మూడు ముళ్ళు (1983)

1970లు[మార్చు]

 1. ప్రాణం ఖరీదు (1978) - మొదటి సినిమా

మూలాలు[మార్చు]

 1. http://ibnlive.in.com/news/telugu-actor-ks-raos-son-dies-in-accident/124928-8-69.html
 2. "టోటల్ టాలీవుడ్లో కోట శ్రీనివాసరావు ఇంటర్వ్యూ". మూలం నుండి 2007-06-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-10-27. Cite web requires |website= (help)
 3. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కోట శ్రీనివాసరావు పేజీ