Jump to content

కృష్ణం వందే జగద్గురుం

వికీపీడియా నుండి
కృష్ణం వందే జగద్గురుమ్
దర్శకత్వంజాగర్లమూడి రాధాకృష్ణ
నిర్మాతజాగర్లమూడి సాయిబాబు
రాజీవ్ రెడ్డి
తారాగణందగ్గుబాటి రానా
నయనతార
ఛాయాగ్రహణంవి. ఎస్. జ్ఞానశేఖర్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లు7 సీస్ ఇంక్ (overseas)[1]
విడుదల తేదీ
నవంబరు 30, 2012 (2012-11-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

కృష్ణం వందే జగద్గురుమ్ 2012లో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో రానా, నయనతార ప్రధాన పాత్రలు పోషించారు.

తారాగణం

[మార్చు]

అనాథ అయిన బీటెక్ బాబు (రానా) సురభి నాటక సమాజం నీడలో పెరిగి పెద్దవాడు అవుతాడు. ఆ సంస్థను నిర్వహించే సురభి సుబ్రహ్మణ్యం (కోట శ్రీనివాసరావు) ఆశలన్నీ బీటెక్ బాబు మీదనే ఉంటాయి. అయితే మేకప్ కంపు కొట్టే ఈ జీవితాన్ని వదిలేసి, అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలని బీటెక్ బాబు ఆశపడతాడు. ఆ దిశగా ప్రయత్నమూ చేస్తాడు. మనవడి కోరికను మన్నించలేని సురభి సుబ్రహ్మణ్యం దిగులుతో హఠాత్తుగా మరణిస్తాడు. ఆయన చివరి కోరికలలో ఒకటి తన అస్తికలను తన స్వగ్రామంలోని చెరువులో కలపాలని, రెండు బళ్ళారిలో జరిగే నాటకోత్సవాలలో 'కృష్ణం వందే జగద్గురుమ్' నాటకాన్ని తమ సంస్థ ఆడాలని. ఈ రెండు కోరికలూ తీర్చి అమెరికా వెళ్ళి పోవాలనుకుంటాడు బిటెక్ బాబు. ట్రూప్ తో కలిసి బళ్ళారికి ప్రయాణ మౌతాడు. అక్కడే కథ మలుపుతిరుగుతుంది. అక్రమమైనింగ్ చేస్తూ లక్షల కోట్లను ఆర్జిస్తుంటాడు రెడ్డప్ప (మిలింద్ గునాజీ). అతని అకృత్యాలను డాక్యుమెంటరీగా తెరకెక్కిస్తూ సీబీఐకీ సమాచారం అందిస్తుంటుంది జర్నలిస్ట్ దేవిక (నయనతార). అనుకోకుండా తారసపడిన దేవికను చూడగానే ప్రేమలో పడతాడు బీటెక్ బాబు. అక్రమ మైనింగ్ కారణంగా తాత పుట్టిన ఊరు, అక్కడి వాగు కనుమరుగయ్యాయని తెలుస్తుంది. దీనికి సూత్రధారి రెడ్డప్ప అనే విషయమూ అర్థమౌతుంది. నాటకం చూడటానికి వచ్చిన రెడ్డప్ప మనుషులతో బీటెక్ బాబుకు గొడవ జరుగుతుంది. అదే సమయంలో తన పుట్టు పూర్వోత్తరాలను ఓ మహిళ ద్వారా బీటెక్ బాబు తెలుసుకుంటాడు. చెడు అలవాట్లకు బానిస అయిన మేనమామ చక్రవర్తి (మురళీ శర్మ) తన తల్లిదండ్రులను చంపాడని అర్థమౌతుంది. అక్రమ మైనింగుకు పాల్పడే రెడ్డప్పను దేవిక, తన మేనమామను హతమార్చాలనుకున్న బీటెక్ బాబు ఎలా లక్ష్యాన్ని చేధించారన్నదే ముగింపు.[2]

పాటల జాబితా

[మార్చు]

అరరే పసి మనసా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.నరేంద్ర , శ్రావణ భార్గవి

సాయి అందరినను , రచన; ఇ.ఎస్ . మూర్తి, గానం.శ్రేయా ఘోషల్ , రాహూల్ సింప్లీ గంజ్ , దీపు

కృష్ణం వందే జగద్గురుం, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

స్పైసీ స్పైసి గర్ల్ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం . హేమచంద్ర,శ్రావణ భార్గవి, కె ఎస్ చిత్ర

రంగ మార్తాండ , రచన: సాయి మాధవ్ బుర్రా, గానం.రఘుబాబు , హేమచంద్ర , బుర్ర సాయి మాధవ్

చల్ చల్ చల్, రచన: సాయి మాధవ్ బూర్రా , గానం.జొన్న

పరిణామం (ఇన్స్ట్రుమెంటల్) ఎవలోషన్ థీమ్

స్పందన

[మార్చు]
  • "ఏదో ఒక సామాజికాంశంతో క్రిష్ చక్కని సినిమాలు తీస్తాడనే నమ్మకం ప్రేక్షకులకు ఉంది. దానిని వమ్ము చేయకుండా క్రిష్ చేసిన ప్రయత్నమే 'కృష్ణం వందే జగద్గురుమ్'. మనుషులను, మమతలను కాలరాస్తూ, జన్న నిచ్చిన భూమాతను సైతం చెరబట్టాలనుకునే అభినవ నరకాసురుడికి ఓ రంగస్థల కళాకారుడు ఎలాంటి శిక్ష వేశాడన్నదే ఈ చిత్రం. అనుకున్న కథకు కమర్షియల్ అంశాల్ని జోడించడానికి క్రిష్ చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. సినిమాలోని ఐటమ్సంగ్స్ టెంపోను దెబ్బతీశాయి. అలానే విలన్కు సంబంధించిన ట్విస్ట్ ఆసక్తిని రేకెత్తించకపోగా, అయోమయానికి గురి చేసేదిగా ఉంది. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, మణిశర్మ నేపథ్య సంగీతం, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్. దశావతారాల అర్థాన్ని, పరమార్థాన్ని పది నిమిషాల గీతంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి చక్కగా వివరించారు. కథకు ఆయువు పట్టు లాంటి ఆ సన్నివేశాన్ని మరింత ప్రభావవంతంగా చిత్రీకరించాల్సింది."[2] - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్ - ఫిల్మ్‌ జర్నలిస్ట్

పురస్కారాలు

[మార్చు]
  1. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలులో ఉత్తమ వస్త్రాలంకరణ (తిరుమల), ఉత్తమ మేకప్ (చిట్టూరి శ్రీనివాస్) విభాగంలో అవార్డులు వచ్చాయి.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Krishnam Vande Jagadgurum in Overseas by 7 Seas Inc". Idlebrain. Retrieved 4 October 2012.
  2. 2.0 2.1 వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్. "పరమాత్మ తత్త్వం 'కృష్ణం వందే జగద్గురుమ్'!". ఓంప్రకాశ్ రాతలు గీతలు. Retrieved 15 February 2024.
  3. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 30 June 2020.
  4. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  5. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  6. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.