భక్త ప్రహ్లాద తెలుగులో మొదటి సినిమాగా స్థానం సంపాదించుకొంది. 1931నుండి తెలుగు సినిమా ప్రేక్షకుల ఆదరణను చూరగొంటూ పురోగమిస్తున్నది. 1938-39 సంవత్సరాలలో తెలుగు సినిమా కొత్త రూపు దిద్దుకుంది. సినిమా ప్రయోజనం ఒక్క వినోదం సృష్టించడం మాత్రమే కాదు - విప్లవం కూడా సృష్టించగలదని ఆ రెండు సంవత్సరాలు నాంది పాడాయి. కేవలం పురాణ గాధలే సినిమాలుగా వస్తూ ప్రజానీకాన్ని ఆనందపరుస్తున్న తరుణంలో గూడవల్లి రామబ్రహ్మం "మాలపిల్ల" లాంటి చిత్రం తీసి, విప్లవం సృష్టించాడు. 1940 దశాబ్దంలో "వాహినీ స్టూడియోస్" ప్రారంభించబడింది. నేపధ్యగానం ప్రక్రియ స్థిరపడింది. ఈ దశకంలో ఎందరో కళాకారులు, సాంకేతిక నిపుణులు తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు. 1950 దశాబ్దం తెలుగు సినిమాలకు స్వర్ణయుగమని చెప్పవచ్చును. క్రొత్త నటీనటుల ప్రవేశ పరంపర కొనసాగింది. క్రొత్త చిత్ర నిర్మాణ సంస్థలు చాలా వెలిసాయి. హైదరాబాదులో సారధి స్టూడియోస్ ప్రాంభమైంది. జగ్గయ్య, కాంతారావు లాంటి నటులు ఈ కాలంలోనే ప్రవేశించారు. మల్లీశ్వరి, పాతాళభైరవి లాంతి చిత్రాలు ఈ దశాబ్దంలో వచ్చాయి. 1960 దశాబ్దంలో నంది అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. ఈ దశాబ్దంలో మొత్తం 758 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో చాలావరకు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిత్రనిర్మాణానికి అయ్యే అదనపు ఖర్చును భరించడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో రాష్ట్రంలో చిత్రనిర్మాణం పుంజుకుంది.
|
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పని చేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడు గా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశ్శబ్ద చిత్రాన్ని నిర్మించాడు. దక్షిణ భారతదేశం లో నే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన దుర్గ సినీటోన్ని నిడమర్తి సూరయ్య రాజమండ్రి లో స్థాపించారు.
తెలుగు సినిమా, తెలుగు నాటకరంగం, తెలుగు టీవీ ప్రసారాలలో అత్యున్నత ప్రతిభకి వేదిక హైదరాబాదు లోని లలిత కళాతోరణం లో జరిగే నంది అవార్డుల ప్రదానోత్సవం వేడుక. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చే నిర్వహించబడుతుంది. ఈ వేదికకి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక చిహ్నమైన లేపాక్షి నందిని స్ఫూర్తిగా తీసుకొనబడినది.
1940 లో విడుదలైన విశ్వమోహిని భారతీయ చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి చిత్రం. ఆసియా పసిఫిక్ సినిమా మహోత్సవం వంటి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు సినిమా 1951 లో విడుదలైన మల్లీశ్వరి. ఈ చిత్రం చైనా లోనూ 13 ప్రింట్లతో చైనీసు సబ్-టైటిళ్ళతో బీజింగ్ లో 14, మార్చి 1953 లో విడుదలైనది. ఇదే 1951 లో విడుదలైన పాతాళ భైరవి 24 జనవరి 1952 న బొంబాయి లో జరిగిన మొట్టమొదటి ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలన చిత్రం. 1956 లో విడుదలైన తెనాలి రామకృష్ణ ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ని గెలుచుకొన్న ఏకైక చిత్రం.
2005, 2006, 2008 సంవత్సరాలకి గాను తెలుగు సినీ పరిశ్రమ బాలీవుడ్‌ని అధిగమించి దేశం లోనే అత్యధిక చిత్రాలని నిర్మించినది. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచం లోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో గా గిన్నీస్ బుక్ లో నమోదైనది. హైదరాబాదులో గల ప్రసాద్స్ ఐమ్యాక్స్ ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీను. దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు ఆంధ్ర ప్రదేశ్ లోనే కలవు.
సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ గుర్తించిన ఉత్తమ వంద చిత్రాలలో మొదటి పది పాతాళ భైరవి(1951), మల్లీశ్వరి(1951), దేవదాసు(1953), మాయాబజార్(1957), నర్తనశాల(1963), మరో చరిత్ర(1978), మా భూమి(1979), శంకరాభరణం (1979), సాగర సంగమం(1983), శివ(1989) మొదటి పది స్థానాలని దక్కించుకొన్నాయి.
సినిమా తెలుగు వారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ సినిమాలో సంఖ్యాపరంగా అత్యధికంగానూ, వాణిజ్య పరంగా రెండవ స్థానంలోనూ (ఇంచుమించు తమిళ సినీరంగానికి కుడియెడంగా) తెలుగు సినిమా వర్ధిల్లుతోంది.
...ఇంకా...
|
- 80వ దశకంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే, ప్రతి ఆదివారం మధ్యాహ్నం డీడీలో ప్రసారమయ్యే స్పిరిట్ ఆఫ్ యూనిటీ కాన్సర్ట్స్ అనే కార్యక్రమానికి సంగీతం అందించినది ఎ. ఆర్. రెహమాన్ అనీ! అంతకు పూర్వం గార్డెన్ వరేలీ వంటి వాణిజ్య ప్రకటనలకు జింగిల్స్ అందించాడనీ!!
- జెనీలియా, ఇలియానా, కమలినీ ముఖర్జీ, పూజా హెగ్డే (ముకుంద హీరోయిన్), యామీ గౌతం వంటి హీరోయిన్ లు అందరూ తొలుత ఫెయిర్ అండ్ లవ్లీ యొక్క వాణిజ్య ప్రకటనలలో కనిపించారనీ, ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చారనీ!
- దేవదాసు పేరు తో మొత్తం నాలుగు సినిమాలున్నాయనీ! వీటిలో ఒకటి దేవదాసుకు సీక్వెల్ అనీ! తెలుగు సినీరంగంలో మొట్టమొదటి సీక్వెల్ ఇదేననీ! (దేవదాసు (1953 సినిమా), దేవదాసు (1974 సినిమా), దేవదాసు మళ్ళీ పుట్టాడు, దేవదాసు (2006 సినిమా))
- బాల్యం నుండి హాస్యనటుని పాత్రలు పోషిస్తున్న ఆలీ కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తూ, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆ దేశం నుండి భారతదేశం వలస వచ్చినదనీ, ఆలీ కడుపేదరికంలో పుట్టినా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈనాడు ఈ స్థాయికి చేరాడనీ!
- ప్రిన్స్ మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు 80వ దశకంలో హీరోగా నటించారనీ! ఘట్టమనేని కృష్ణ, రమేష్, ప్రిన్స్ లు ముగ్గురు కొడుకులు అనే చిత్రంలో అన్నదములుగా నటించారనీ!
- చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రవితేజ ల నుండి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్.టి.ఆర్, రమ్యకృష్ణ, శృతి హాసన్, కె.విశ్వనాథ్, SPB, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారందరూ వాణిజ్య ప్రకటనలలో తళుక్కు మన్నారనీ!
- అల్లు అర్జున్ గంగోత్రి (సినిమా) లో అరంగేట్రం చేసే ముందు డాడీ (సినిమా) లో ఒక చిన్న నృత్య దృశ్యంలో తెరంగేట్రం చేశాడనీ!
- అహ! నా పెళ్ళంట! (1987) సినిమా, ఒహో నా పెళ్ళంట, చూపులు కలసిన శుభవేళ, వివాహ భోజనంబు, లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాల పేర్లు అన్నీ మాయాబజార్ చిత్రంలోని పాటల ఆధారంగా వచ్చినవి.
- ఇలియానా నటించిన తొలి హిందీ చిత్రం బర్ఫీ అనీ!
- ... ఆస్కార్, గ్రామీ అవార్డులు అందుకొన్న తర్వాత ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యంలో విడుదలైన తొలి తెలుగు చిత్రం కొమరం పులి అనీ!
- ... అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ లో నటి విజయనిర్మల కు రికార్డు ఉందనీ!
- ... మొట్టమొదటి బ్లూ-రే డిస్క్ నాగార్జున నటించిన కింగ్, రెండవది రామ్ చరణ్ తేజ నటించిన మగధీర అనీ!
- ... మాయాబజార్ పేరుతో మొత్తం నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయనీ!
- ...తెలుగు సినీ చరిత్రలోనే మొట్ట మొదటగా కోటి రూపాయలకు పైచిలుకు వసూలు చేసిన చిత్రం లవకుశ అనీ!
- ...కమల్ హాసన్ 14 సార్లు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు గెలుచుకొన్నాడనీ!
- ...అల్లు అర్జున్ సినిమాలు మలయాళం లోకి అనువదించబడతాయనీ, కేరళ లో చాలా మంది అతనిని అభిమానిస్తారనీ!
- ...మాయాబజార్ లోని ప్రతి ఫ్రేమును రంగులమయం చేస్తూ మొత్తం చిత్రాన్ని అలా చేయటానికి గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ కి 165 మందితో మూడు సంవత్సరాలు పట్టిందనీ!
- ...వైజయంతీ మూవీస్ తొట్ట తొలి చిత్రం ఎన్.టి.ఆర్ నటించిన ఎదురులేని మనిషి అనీ!
- ...చిరంజీవి కి కన్నడిగ అభిమానులు కూడా ఉన్నారనీ! (చిరంజీవి వ్యాసం)
- ...రాయలసీమ మాండలికం, అక్కడి జీవనశైలి ని ప్రతిబింబించిన మొదటి చిత్రం ప్రేమించుకుందాం రా అనీ!
- ...ఢెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు సినిమా చరిత్ర లోనే పోకిరి అతి పెద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచిందనీ!
- ...అత్తకి యముడు అమ్మాయికి మొగుడు తమిళ రీ-మేక్ లో రజినీ కాంత్ కి స్నేహితుడు గా చిరు ప్రత్యేక పాత్రని పోషించాడనీ!
- ...7/జీ బృందావన్ కాలనీ, అపరిచితుడు, బిచ్చగాడు వంటి సినిమాలు తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ విజయవంతమయ్యాయనీ!
- ...వెంకటేష్ నటించిన చంటి హిందీ అనువాదం అనాడిలో కూడా తనే నటించారనీ!
- ...1974 లో స్థాపించిన వైజయంతీ మూవీస్ కి నామకరణం చేసింది ఎన్.టి.ఆర్ అనీ!
- ...మణి రత్నం దర్శకత్వం వహించిన గీతాంజలి (1989 సినిమా)ను మొదట తెలుగులోనే రూపొందించి, తమిళంలోకి డబ్ చేశారనీ!
- ...ల్యాటిన్ అమెరికా, ఐరోపా దేశస్థులు దొంగ (సినిమా) లోని గోలిమార్ పాటని ఇష్ట పడతారనీ!(చిరంజీవి వ్యాసం)
|
|
- డిసెంబర్ 7: ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాలేయ సంబంధ వ్యాధితో మృతి
- నవంబర్ 8: ఎ.వి.ఎస్. గా పిలవబడే హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రమణ్యం మృతి
- అక్టోబరు 9: రియల్ స్టార్ శ్రీహరి కాళేయ సంబంధ వ్యాధితో ఆకస్మిక మరణం
- సెప్టెంబరు 16: ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కన్నుమూత
- జులై 23: నటి మంజుల చెన్నై లో మరణం
- జూన్ 7: ప్రఖ్యాత సంగీత దర్శకుడు జె.వి.రాఘవులు కన్నుమూత
- మే 31: పూరీ జగన్నాధ్ రచన, దర్శకత్వంలో అల్లు అర్జున్, అమలా పాల్, కేథరీన్ థెరీసా నటించిన ఇద్దరమ్మాయిలతో చిత్రం విడుదల
- మే 3: అక్కినేని నాగార్జున, నయనతార నటించిన గ్రీకువీరుడు(2013) విడుదల. ఇదే నాటికి భారతీయ సినిమా 100 ఏళ్ళు పూర్తి చేసుకోవటం యాదృచ్ఛికం
- ఏప్రిల్ 26: వెంకటేష్, తాప్సి నటించిన షాడో విడుదల
- ఏప్రిల్ 14: ప్రఖ్యాత గాయకుడు పి.బి.శ్రీనివాస్ చెన్నై లో కన్నుమూత
- ఏప్రిల్ 5: శ్రీను వైట్ల దర్శకత్వం లో, థమన్ సంగీత సారథ్యంలో జూనియర్ ఎన్.టి.ఆర్, కాజల్ నటించిన బాద్ షా విడుదల
- జనవరి 25: వివాదాల సుడిగుండాల నుండి బయటపడి విడుదలైన కమల్ హాసన్ విశ్వరూపం (2013) మిలాద్-ఉన్-నబీ కారణంగా హైదరాబాదు నగరం వరకు ప్రదర్శన చేయలేదు.
- జనవరి 11: చాలా కాలం తర్వాత తెలుగు లో ఇద్దరు అగ్ర హీరోలు కలసి నటించిన బహు నట చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదల. వెంకటేష్, మహేశ్ బాబు, సమంత, అంజలి, ప్రకాశ్ రాజ్ మరియుజయసుధనటించారు
- జనవరి 9: వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ, కాజల్ అగర్వాల్, అమల పాల్ నటించిన నాయక్ (సినిమా) విడుదల
- నవంబరు 30: దగ్గుబాటి రానా, నయనతార ప్రధాన పాత్రలుగా కృష్ణం వందే జగద్గురుం విడుదల
- సెప్టెంబరు 24: 80వ దశకంలో తెలుగు కథానాయికగా వెలిగిన అశ్వని (నటి) కన్నుమూత
- సెప్టెంబరు 28: ప్రభాస్, తమన్నా, దీక్షా సేఠ్ నటించిన రెబెల్ విడుదల
- సెప్టెంబరు 5: నాగార్జున, కమలినీ ముఖర్జీ, శ్రీకాంత్ నటించిన శిరిడి సాయి విడుదల
- ఆగష్టు 30: నందమూరి బాలకృష్ణ, పార్వతి మెల్టన్ నటించిన శ్రీమన్నారాయణ విడుదల
- ఆగష్టు 15: రవితేజ, ఇలియానా నటించిన దేవుడు చేసిన మనుషులు (2012) విడుదల
- ఆగష్టు 9: అల్లు అర్జున్, ఇలియానా, రాజేంద్ర ప్రసాద్, తులసి నటించిన జులాయి విడుదల
- జూలై 27: మంచు మనోజ్ కుమార్, దీక్షా సేత్, నందమూరి బాలకృష్ణ, మంచు లక్ష్మీ ప్రసన్న నటించిన ఊ... కొడతారా ఉలిక్కిపడతారా విడుదల
- జూలై 6: రాజమౌళి దర్శకత్వం లోనాని, సమంత, సుదీప్ నటించిన ఈగ విడుదల
- మే 11: హరీష్ శంకర్ దర్శకత్వం లోపవన్ కళ్యాణ్, శృతి హాసన్ నటించిన గబ్బర్ సింగ్ విడుదల
- ఏప్రిల్ 27: బోయపాటి శ్రీను దర్శకత్వం లోజూనియర్ ఎన్. టి. ఆర్, త్రిష నటించిన దమ్ము విడుదల
- ఏప్రిల్ 5: సంపత్ నంది దర్శకత్వం లో రాం చరణ్ తేజ, తమన్నా నటించిన రచ్చ విడుదల
- ఫిబ్రవరి 24: నితిన్, నిత్యా మీనన్ నటించిన ఇష్క్ చిత్రం విడుదల. ఏ మాత్రం అంచనాలు లేని ఈ చిత్రం అత్యంత విజయవంతమైనది. తర్వాత ఇదే జంట గుండె జారి గల్లంతయ్యిందే లో నటించగా అది కూడా విజయవంతమైనది
- జనవరి 13: పూరి జగన్నాథ్ దర్శకత్వం లో మహేష్ బాబు, కాజల్ నటించిన బిజినెస్ మేన్ విడుదల
- జనవరి 8: అదుర్స్ సినిమా విడుదలయ్యింది.
- జనవరి 14: శంభో శివశంభో, నమో వెంకటేశ సినిమాలు విడుదలయ్యాయి.
- జనవరి 17: హైదరాబాదులోని ఫిలింనగర్లో రఘుపతి వెంకయ్య కాంస్యవిగ్రహం ఆవిష్కరించబడింది.
- జనవరి 23: 56వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 1940లో ఒక గ్రామం ఎంపికయ్యింది.
- జనవరి 24: మాయాబజార్ సినిమాను రంగులలో మార్చబడినది.
- జనవరి 25: లతామంగేష్కర్ అక్కినేని పురస్కారానికి ఎంపికైనది.
- జనవరి 26: ప్రముఖ నటుడు గుమ్మడి రాత్రి 11:30 సమయంలో మరణించారు.
- జనవరి 28: జూనియర్ ఎన్.టి.ఆర్, ఇలియానా ప్రధాన పాత్రలతో అశ్వినీదత్ నిర్మాణంలో మెహర్ రమేష్ దర్శకుడిగా శక్తి చిత్రం ముహూర్తం.
- జనవరి 30: సూపర్ గుడ్ ఫిలింస్ ద్వారా మాయాబజార్ కలర్, సినిమాస్కోప్, డి.టి.ఎస్ లో 55 ప్రింట్ లతో విడుదల
- ఫిబ్రవరి 3: గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సమంత ని పరిచయం చేస్తూ ఏ మాయ చేశావె చిత్రం ఆడియో విడుదల. సంగీతం ఎ.ఆర్.రెహమాన్
- ఫిబ్రవరి 20: ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం చెన్నైలోని కోడంబాకం లోని స్వగృహం లో గుండెపోటుతో మృతి.
- మార్చి 11: ఎన్.టీ.ఆర్ జాతీయ అవార్డుకు నటి జమున, బి.ఎన్.రెడ్డి జాతీయ అవార్డుకు దర్శకుడు కె.బి.తిలక్, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డుకు ఎ.రమేశ్ ప్రసాద్, రఘుపతి వెంకయ్య అవార్డుకు నటి విజయనిర్మల ఎంపిక
- మార్చి 21: నోకియా బిగ్ ఎఫ్ ఎమ్ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం లో వేటూరికి జీవితసాఫల్య పురస్కారం
- మే 22: ప్రముఖ గేయ రచయిత వేటూరి మృతి
- జూన్ 4: చాలా కాలం తర్వాత తెలుగులో పూర్తి నిడివి మల్టీస్టారర్ చిత్రం (అల్లు అర్జున్, మంచు మనోజ్ కుమార్, అనుష్క, మనోజ్ బాజ్ పాయి నటించిన వేదం విడుదల.
- జూన్ 10: వైభవంగా నందమూరి బాలకృష్ణ 50 వ జన్మదిన వేడుకలు
- జూన్ 13: టాలీవుడ్ టీ 20 లో పాల్గొన్న చిరు చీతాస్, బాలయ్య లయన్స్, వెంకీ వారియర్స్, నాగ్ కింగ్స్. విజయాన్ని కైవసం చేసుకొన్న నాగ్ కింగ్స్.
- జులై 11: కొమరం పులి ఆడియో విడుదల
- ఆగష్టు 6: శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్, ఐశ్వర్యా రాయ్ నటించిన, ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యం వహించిన రోబో ఆడియో విడుదల
- ఆగష్టు 22: పుట్టినరోజు కానుకగా చిరంజీవి కి రూ3.5 కోట్ల విలువగల రోల్స్ రాయ్స్ ఫాంటమ్ కారును బహుకరించిన రాం చరణ్ తేజ
- సెప్టెంబరు 15: ఉత్తమ నృత్య దర్శకుడిగా కె.శివశంకర్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అందించినందుకు గాను కనల్ కణ్ణన్ లకు జాతీయ చలన చిత్ర పురస్కారాలు. రెండు పురస్కారాలూ మగధీరకే కావటం విశేషం.
- అక్టోబరు 24: ఆరంజ్ ఆడియో విడుదల
|
|
|
|