Jump to content

వేదిక:ఫోటోగ్రఫి

వికీపీడియా నుండి
ఫోటోగ్రఫీ పరిచయం

ఒక వస్తువుని చీకటి వెలుగుల మిశ్రమంలో కెమెరా గా పిలువబడే యంత్రంతో ఫిల్మ్ మీద ( ఇప్పుడు డిజిటల్ ఉపకరణములలో ) చిత్రీకరించే శాస్త్రాన్ని ఫోటోగ్రఫి అంటారు.ఇది ప్రపంచములో అందరికి ఉపయోగపడే శాశ్రీయమయిన కళ. చాయచిత్రీకరణకి కెమెరా,కటకాలు,ఫిల్మ్,ఎన్లార్జర్,ఫోటో పేపర్,రసాయనాలు,కాంతి లేదా వెలుతురు(సూర్య కాంతి),దీపాలు,విద్యుత్ శక్తి కావలసిన వనరులు.మానవుని జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన చక్రం,విద్యుత్శక్తి,ఫోన్,రైల్,విమానం లాగే ఫోటోగ్రఫీ కూడా అనటం అతిశయోక్తి కాదు.

అసలు ఫోటోగ్రఫి అనే పదం పురాతన గ్రీక్ పదాలయిన φως ఫోస్(light)మరియు γραφη graphê గ్రఫే ("stylus","paintbrush") లేక γραφω graphō గ్రఫో (the verb, "I write/draw"),రెండు పదాల కలయికతో వెలుతురుతో చిత్రీకరణ లేదా చిత్రీకరణ అని అప్పటి చిత్రకారులు పరిశోధకులు వాడటముతో ఫోటోగ్రఫి గా రూపాంతరం చెందింది. మొట్టమొదట ఛాయాచిత్రాన్ని(ఫోటోగ్రాప్)1826లో నేసెఫార్ నీప్సే (Nicéphore Niépce)అనే ఫ్రెంచ్ పరిశోధకుడు పెవటెర్ (pewter) అనే పల్లెరం మీద చిత్రీకరించాడు.పెట్రోలియం ఉప ఉత్పత్తి అయిన బిటుమేన్ మరియు జుడియా అని పిలువబడే రసాయనం ల మిశ్రమాన్ని పెవటెర్ అనే మెరుగు పెట్టిన పళ్లెం మీద పూసి ఈ ఘనకార్యాన్ని సాధించగాలిగాడు. డబ్బా కెమెరా (Box camera) తో రసాయనపూత పూసిన గాజు (glass) చాయచిత్ర సంగ్రకాల(photoplate) నుండి ఫిల్మ్ తో, ఇప్పుడు అత్యంత ఆధునిక డిజిటల్ కామేరాలతో కంటికి కనిపించని అత్యంత సూక్ష్మ కణాలని,కనిపించే అన్నిరకాలయిన వాటిని కంటికి కనిపించని కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోని గ్రహాలని కూడా చక్కగా సహజమయిన రంగులలో చిత్రీకరించే వరకు ఫోటోగ్రఫీ అభివృద్ది చెందింది. (మొత్తం వ్యాసం చూడండి)

బొమ్మ

అమెరికా లోని క్యాలిఫోర్నియా లో గల మోనో లేక్ ఫోటో సౌజన్యం:

పాత బొమ్మలు - [[|ఇంకా చదవండి...]]


ఛాయా చిత్రకళ - వ్యాసం

ఫోటోగ్రఫీ

ఫోటోగ్రఫీ లేదా ఛాయాగ్రహణం (Photography) అనునది కాంతి లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను భద్రపరచటం తో బాటు రసాయనిక చర్యల తో కాంతి సూక్ష్మాలని గుర్తించే ఛాయాగ్రాహక చిత్రం (photographic film) వలన గానీ /ఎలక్ట్రానిక్ ప్రక్రియతో ఇమేజ్ సెన్సర్ (చిత్రాలని గుర్తించే పరికరము) వలన గానీ మన్నికైన చిత్రాలని సృష్టించే/ముద్రించే ఒక కళ/శాస్త్రము/అభ్యాసము. సాధారణంగా ఒక వస్తువు పై ప్రసరించే కాంతిని గాని, లేదా ఒక వస్తువు నుండి వెలువడుతున్న కాంతిని గానీ ఒక కటకం (lens)తో దృష్టి (focus) ని కేంద్రీకరించి, కెమెరా లో ఉండే కాంతిని గుర్తించే ఉపరితలం పై నిర్దిష్ట సమయం వరకూ బహిర్గతం (exposure) చేయటం తో ఆ వస్తువుల నిజ ప్రతిబింబం (real image) సృష్టించటం జరుగుతుంది. దీని ఫలితంగా వైద్యుదిక చిత్ర సంవేదిక (electronic image sensor) లోని ప్రతి ఒక్క చిత్ర కణము (pixel) పై విద్యుచ్ఛక్తి (electrical charge) వైద్యుదిక చర్య (electronical processing) జరిగి తర్వాత ప్రదర్శితమగుటకు, మార్పులు చేసుకొనుటకు సాంఖ్యిక ప్రతిబింబం (digital image) ఫైల్ గా భద్రపరచబడుతుంది.

(ఇంకా…)



ఫోటోగ్రఫి వర్గాలు

మీకు తెలుసా?


మార్చు, పాతభండారము



మీరు చేయదగిన పనులు
  • ఫోటోగ్రఫి వ్యాసాన్ని విస్తరించటం. ఈ వ్యాసంలోని ఎర్ర లింకులని వీలైనన్ని తగ్గించటం
  • మూస:ఛాయాచిత్రకళ లోని ఎర్ర లింకులని వీలైనన్ని తగ్గించటం. ఛాయాచిత్రకళకి సంబంధించిన మరిన్ని వ్యాసాలని ఈ మూసలో చేర్చటం
  • ఛాయాచిత్రకళ రంగంలో కృషిచేసిన చేస్తున్న భారతీయ ప్రముఖులను, సంస్ధలను ప్రపంచానికి పరిచయం చేయడం
  • ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక ప్రధాన ఛాయాచిత్రకళా రూపాల, సాంకేతిక విషయాలు మరియు పరికరాల గురించి ఇంగ్లీషులో వున్న సమాచారాన్ని తెలుగీకరించి తెలుగు భాషలో సమాచార విజ్ఞాన సంపదని పెంపొందించడం.
మార్చు