వేదిక:లినక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరిచయం మార్చు

లినక్స్ (సాధారణంగా లినెక్స్ అని సంభోధిస్తారు, కొంతమంది లైనక్స్ అని కూడా పలుకుతారు) లేదా గ్నూ/లినక్స్ అనునది యునిక్స్ వంటి కంప్యూటర్ నిర్వాహణ వ్యవస్థ. లినక్స్ సోర్సు కోడు ప్రజలకు బాహాటంగా లభించడమే కాక ఉచితంగా కూడ లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు దీనిని ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేయవచ్చు, తిరిగి పంచిపెట్టవచ్చు.

ఈ వారపు వ్యాసం మార్చు
డెబియన్ అనేది ఒక లినక్స్ ఆపరేటింగ్ సిస్టం, ఇది ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ ప్రత్యేకంగా గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్సు కింద ఉన్న సాప్ట్వేర్లు మరియు ఇతర ఫ్రీ సాప్ట్వేర్ల లైసెన్సుల మీద ఉన్న సాప్ట్వేర్ల కూర్పు.లినక్స్ కెర్నలు మరియు గ్ను ఆపరేటింగ్ సిస్టం సాధనాలను వాడటం వలన దీనిని డెబియన్ గ్నూ/లినక్స్ గా వ్యవహరిస్తారు, ఇది గ్నూ/లినక్స్ పంపకాలలో ఒక ప్రజాదరణ పొందిన పంపకం. స్థాపించి వాడుకోవటానికి తయారుగా ఉన్న వేల సాప్ట్వేర్ల ప్యాకేజీలు కలిగిన నిధులను అందుబాటులో ఉండేటట్లు దీనిని పంచుతారు. యునిక్స్ మరియు ఫ్రీ సాప్ట్వేర్ తత్వాలను తప్పనిసరిగా పాటించే పంపకంగా దీనిని వ్యవహరిస్తారు. డెబియన్ను డెస్క్టాపు వలె అదే విధంగా సెర్వర్ ఆపరేటింగ్ సిస్టంగా కూడా వాడుకోవచ్చు.
చరిత్ర మార్చు

1993 వ సంవత్సరములో రిచర్డు స్టాల్‌ మన్‌ గ్నూ ప్రాజెక్టును స్థాపించినాడు. ఇది ఈ రోజు లినక్స్ సిస్టముకు కావలసిన అన్ని విభాగాలను చాలావరకు చేకూరుస్తుంది. గ్నూ స్థాపించినప్పుడు, దాని లక్ష్యం ఓ సంపూర్ణ యునిక్స్ వంటి ఆపరేటింగు సిస్టమును అభివృద్ధిచేయడము, అదీ పూర్తిగా ఉచిత సాఫ్ట్వేరుల సహాయముతో. 1990 వ దశకం తొలి నాళ్ళకల్లా ఈ జీ యన్‌ యూ ఒక ఆపరేటింగు సిస్టమునకు కావలసిన అన్ని విభాగాలను, లైబ్రరీలను అప్లికేషన్లను రూపొందించినది. కానీ ఒక ముఖ్యమైన విభాగమయిన దిగువ వ్యవస్థ అయిన కెర్నలు మాత్రము రూపొందింపబడలేదు. కెర్నలు కోసం ఈ గ్నూ ప్రాజెక్టు మొదట ట్రిక్సు కెర్నలును రూపొందించినది. ఆ తరువాత దాని అభివృద్ధిని నిలిపి గ్నూ హర్డ్ అను మరొక కెర్నలును రూపొందించడం మొదలుపెట్టినారు. థామస్‌ బుష్నెల్‌ ప్రకారం మొదట హర్డ్‌ నిర్మాణ శైలి బీ యస్‌ డీ 4.4 లైట్‌ కెర్నలును అనుసరించాలని, కానీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్కిలీ నుండి సరి అయిన సహాయం లేని కారణంగా; ప్రోగ్రామర్లు మరియు స్టాల్‌ మన్‌ మాక్‌ మైక్రో కెర్నలు నిర్మాణ శైలిని అనుసరించాలని నిర్ణయించినారు. కానీ ఈ నిర్ణయం వల్ల చాలా అనుకోని, ఊహించని ఇబ్బందులు వచ్చి హర్డ్ నిర్మాణం చాలా ఆలస్యం అయినది.

నేటి బొమ్మ మార్చు
టక్స్, అధికారిక లినక్స్ చిహ్నం

టక్స్, అధికారిక లినక్స్ చిహ్నం

మీకు తెలుసా.. మార్చు
  • ...లినక్స్ 1991లో లినస్ టోర్వాల్డ్సుచే ప్రారంభించబడిందని
  • ...కొన్ని వందల లినక్స్ పంపకాలు అందుబాటులో ఉన్నాయని
  • ...లినక్సు 15 రకాల హార్డువేరు నిర్మితాలపై పనిచేయగలదని
  • ...లినక్స్ కెర్నలు జిపియల్ క్రింద లైసెన్సు చేయబడిందని
  • ...లినక్స్ మినిక్స్ వలన స్పూర్తిపొందబడి రూపొందించినదని
వర్గాలు మార్చు
చేయాల్సిన పనులు మార్చు