సయనోటైప్
ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళ |
---|
సయనోటైప్ అనునది ఫోటోలని సయాన్ బ్లూ రంగులో ముద్రించే ఒక ఫోటోగ్రఫిక్ ప్రింటింగ్ ప్రక్రియ. 20వ శతాబ్దంలో ఈ ప్రక్రియ ఇంజినీరింగ్ రంగాల్లో బాగా ప్రాచుర్యం పొందినది. సరళమైన తక్కువ ఖర్చుతో కూడుకొన్న ఈ ప్రక్రియ ఇంజనీరింగ్ రంగంలో భాగమైన బ్లూప్రింట్ లని పెద్దమొత్తంలో కాపీ చేయటానికి ఉపయోగపడేది. ఇందులో రెండు రసాయనాలని ఉపయోగిస్తారు.
- అమ్మోనియం ఫెర్రిక్ సైట్రేట్
- పొటాషియం ఫెర్రిసయనైడ్
చరిత్ర
[మార్చు]ఇంగ్లీషు శాస్త్రవేత్త, అంతరిక్ష శాస్త్రవేత్త అయిన సర్ జాన్ హర్షల్ ఈ ప్రక్రియని కనుగొన్నాడు. ఈ పద్ధతి ని వృద్ధిలోకి తెచ్చింది హర్షల్ అయిననూ, బ్లూ ప్రింట్లలోని నోట్సులను, పటాలను పునరుత్పత్తి చేసేందుకే దీనిని ప్రధానంగా ఉపయోగించారు. ఈ ప్రక్రియని ఫోటోగ్రఫీ క్రిందకు తెచ్చింది మాత్రం అన్నా అట్కింస్. వివిధ రకాల మొక్కలను సముద్రగర్భంలో ఉండే మొక్కలను గురించిన పరిమిత పుస్తకాల శ్రేణిని సృష్టించినది. ఒక ఫోటోగ్రఫిక్ పేపర్ పైన ఈ మొక్కలని ఉంచి వాటిని కాంతికి బహిర్గతం చేయటం వలన ఏర్పడే చిత్రాలని ఫోటోగ్రాం ల ప్రక్రియని సృష్టించి అన్నా ఆట్కింస్ మొట్ట మొదటి మహిళా ఫోటోగ్రఫర్ అయినది.