Jump to content

ఎస్ ఎల్ ఆర్ కెమెరా

వికీపీడియా నుండి
నికాన్ ఎఫ్6

సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ (ఏక కటక పరావర్తన) కెమెరాలు సాధారణంగా ఒక దర్పణం, ఒక పట్టకం గల వ్యవస్థని ఉపయోగిస్తాయి (ఒకే కటకం నుండి పరావర్తనం చెందటం వలన సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ అని పేరు) . సాధారణ వ్యూ ఫైండర్ (ఎస్ ఎల్ ఆర్ కాని) కెమెరాలలో ఫోటో తీసేముందు బంధించదలచుకొన్న చిత్రానికి, ఫోటో తీసిన తర్వాత ఏర్పడే చిత్రానికి (కొద్దిపాటి నుండి చాలా) తేడా ఉంటుంది. వీటికి భిన్నంగా ఎస్ ఎల్ ఆర్ కెమెరాలలో ఫోటో తీసే ముందు ఫోటోగ్రఫర్ చిత్రాన్ని ఏ విధంగా బంధించదలచుకొన్నాడో అదే విధంగా చిత్రం ఏర్పడుతుంది.

చరిత్ర

[మార్చు]

ఎస్ ఎల్ ఆర్ కెమెరాలకి మునుపు అన్ని వ్యూ ఫైండర్ కెమెరాలలో రెండేసి కాంతి మార్గాలు ఉండేవి. మొదటిది కటకము (లెన్స్) నుండి ఫిలింకు కాగా, రెండవది పైన ఉండే రేంజ్ ఫైండర్ కి. వ్యూ ఫైండర్, ఫిలిం లెన్స్ లు ఒకే కాంతి మార్గాన్ని ఉపయోగించుకోలేక పోవటం మూలాన కెమెరా ముందు వైపు ఏదో ఒక బిందువు వద్ద వ్యూయింగ్ లెన్స్ ను ఫిలిం లెన్స్ వద్ద కలపవలసి వస్తుంది. కొద్దిపాటి నుండి ఎక్కువ దూరంలో ఉండే వస్తువులని చిత్రీకరించటానికి ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ (ద్వికటక పరావర్తనం) లో సమస్యాత్మకం కానప్పటికీ అతి సమీపంగా చిత్రీకరించే సమయంలో లంబనం వలన ఫ్రేమింగ్ లో తప్పులు దొర్లుతాయి. అంతేకాక (తక్కువ కాంతిలో ఉన్న లేదా తక్కువ వేగం గల ఫిలింని ఉపయోగించేటప్పుడు) అపెర్చర్ ల వైశాల్యం పెంచటం సులభం కాదు.

చాలా ఎస్ ఎల్ ఆర్ కెమెరాలు పంచముఖ పట్టకం (ఐదు ప్రక్కలు గల ప్రిజం - pentaprism) ఉపయోగించటం మూలాన నిటారైన, కచ్చితమైన ప్రతిబింబాన్ని, వీక్షణని అందిస్తుంది. కటకం ద్వారా అడ్డంగా, నిలువుగా ప్రయాణించిన కాంతి తలక్రిందులుగా మారి దర్పణం ద్వారా పైభాగంలో ఉన్న పంచముఖ పట్టకం లోనికి పరావర్తన చేయబడుతుంది. ఇందులో ఈ కాంతి పలుమార్లు పరావర్తనం చెంది తలక్రిందులైన కాంతిని సరి చేసి వ్యూ ఫైండర్ తో ప్రతిబింబాన్ని అనుసంధానిస్తుంది. షట్టర్ విడుదల చేయగానే కాంతి మార్గం నుండి దర్పణం తప్పుకోవటంతో, కాంతి నేరుగా ఫిలిం/సిసిడి లేదా సిమాస్ ఇమేజ్ సెన్సర్ పైన ప్రకాశిస్తుంది.

ఫోకస్ ని ఆటోఫోకస్ వ్యవస్థతో దానంతట అదే సరిచేసుకొనే విధంగానైనా, లేదా స్వయానా ఫోటోగ్రఫర్ అయినా సరి చేయవచ్చును. కాంతి విస్తరణ చెందేలా వ్యూ ఫైండర్ లో దర్పణ వ్యవస్థకు పై భాగంలో ఒక matte ఫోకసింగ్ స్క్రీన్ అమర్చవచ్చును. వివిధ లెన్సు లని పరస్పర మార్పు లతో ఉపయోగించేటప్పుడు సరిగ్గా చూడటానికి, సమకూర్పుకి, దృష్టి కేంద్రీకరణకి ఇది దోహద పడుతుంది.

1990 ల వరకూ ఎస్ ఎల్ ఆర్ వ్యవస్థ ఫోటోగ్రఫీ లోనే అధునాతన సాంకేతికత. ఇటీవలె వచ్చిన ఎల్ సీ డీ ప్రీవ్యూ కలిగిన డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజీతో ఎస్ ఎల్ ఆర్ లు ప్రాముఖ్యత కోల్పోయినాయి. ప్రస్తుత కాలం సరసమైన ధరలలో లభించే దాదాపు అన్ని కాంపాక్ట్ కెమెరాలలో ఎల్ సీ డీ ప్రీవ్యూ ఉన్నాయి. సీ సీ డీ ఏం బంధిస్తుందో దానిని ఫోటోగ్రఫర్ వీటి పై ముందే చూడవచ్చును. అయిననూ పరస్పర మార్పిడులు, అనుకూలీకరణ సాధ్యపడే వ్యవస్థీకృత కెమెరాలు కావటం వలన ఎస్ ఎల్ ఆర్ ల ప్రజాదరణ వాటిదే. ఎస్ ఎల్ ఆర్ వ్యూ ఫైండర్ లలో ఉన్న తగ్గించబడిన షట్టర్ ల్యాగ్ (షట్టర్ రిలీజ్ బటన్ నొక్కిన తర్వాత చిత్రాన్ని బంధించటానికి తీసుకొనే సమయం), పిక్సెల్ రిజొల్యూషన్, కాంట్రాస్టు రేషియో, రంగుల వైవిధ్యం లతో ఎల్ సీ డీ ప్రీవ్యూలు ఎప్పటికీ పోటీపడలేవు. sanjay

కటక భాగాలు

[మార్చు]
ఎస్ ఎల్ ఆర్ కెమెరాకి ఎడమ వైపు నుండి చూచినప్పుడు అది పని చేసే విధానము: 1: ఫోర్ ఎలిమెంట్ టెస్సార్ డిజైను (four-element Tessar design) గల ఫ్రంట్-మౌంట్ లెన్స్ 2: 45 డిగ్రీలలో అమర్చబడిన దర్పణం 3: ఫోకల్ ప్లేన్ షట్టర్ 4: ఫిలిం లేదా సెన్సర్ 5: ఫోకసింగ్ స్క్రీన్ 6: కండెన్సర్ లెన్స్ 7: ఆప్టికల్ గ్లాస్ తో చేయబడిన పంచ ముఖ పట్టకం (Optical glass pentaprism/pentamirror) 8: ఐ పీస్ (diopter correction ability గలది)

ప్రక్క నుండి చూచినపుడు ఎస్ ఎల్ ఆర్ కెమెరా లోని కటక వ్యవస్థ. కటకం పై ప్రసరించిన కాంతి (1) 45 డిగ్రీల కోణంలో పొందుపరచిన దర్పణం పై నుండి పరావర్తన చెంది (2) మొదట ఒక మ్యాట్టే (matte) ఫోకసింగ్ స్క్రీన్ (5) ద్వారా, తర్వాత ఒక కండెన్సింగ్ లెన్స్ (6) ద్వారా, పైన ఉండే పంచముఖ పట్టకం (7) లోకి పంపబడి, అక్కడ పలుమార్లు అంతర్గత పరావర్తన చెంది ఆ ప్రతిబింబం ఐ పీస్ (8) ద్వారా కనబడుతుంది. చిత్రాన్ని బంధించగానే దర్పణం పై దిశలో కదలి ఫోకల్ ప్లేన్ షట్టర్ (3) తెరచుకొని ఫోకసింగ్ స్క్రీన్ పై ప్రతిబింబం ఎలా కనబడుతోందో అలాగే ఫోటోగ్రఫిక్ ఫిలిం/ఛార్జ్ కపుల్డ్ డివైస్ (4) పై కనబడుతుంది.

ఇతర కెమెరాలలో లేని, కేవలం ఎస్ ఎల్ ఆర్ కెమెరాలలో ఉండే ఈ వైశిష్ట్యం వలనే ఫోటోగ్రఫర్ కి ప్రతిబింబం ఎలా కనబడుతోందో సెన్సర్ పై చిత్రం కూడా అలానే ఏర్పడుతుంది.

పంచముఖ పట్టకాలు , పంచముఖ దర్పణాలు

[మార్చు]

చాలా 35 ఎం ఎం కెమెరాలు పైన అమర్చబడే పంచముఖ పట్టకాలను లేదా పంచముఖ దర్పణాలను ఉపయోగిస్తాయి. ఇవి కాంతిని చక్షువు వరకు ప్రసరించేలా చేస్తాయి. కొన్ని ఎస్ ఎల్ ఆర్ కెమెరాలలో అవసరానికి తగ్గట్లుగా అమర్చుకోగల పంచముఖ పట్టకాలు ఉంటాయి. వీటితోబాటు నడుము పై ఉండే, క్రీడల కోసం ప్రత్యేకమైన వీక్షణులు అమర్చుకోవచ్చును.

షట్టర్ పని చేసే పద్ధతి

[మార్చు]

దాదాపు అన్ని ఎస్ ఎల్ ఆర్ కెమెరాలు ఫిలిం సమతలానికి ముందు ఉండే ఫోకల్-ప్లేన్ షట్టర్ను ఉపయోగిస్తాయి. ఇది కటకం అడ్డు తొలగినప్పుడు కాంతిని ప్రసరించటం జరగకుండా, ఎక్స్పోజర్ అయినప్పుడు షట్టరు విడుదల చేసినప్పుడు మాత్రమే కాంతిని ఫిలిం పైక్ ప్రసరింపజేస్తుంది. ఫోకల్ ప్లేన్ షట్టర్ లు వివిధ శైలులలో ఉంటాయి.

నష్టాలు

[మార్చు]

ఎస్ ఎల్ ఆర్ ల విశ్వసనీయత

[మార్చు]

ధర/తాహతులు

[మార్చు]

ఇతర కెమెరాలతో పోలిస్తే ఎస్ ఎల్ ఆర్ కెమెరాల ధరలు ఒకింత ఎక్కువే. దీనికి తోడుగా ఫ్లాష్ లైట్ లు, కటకాలు వంటి ఇతర ఉపకరణాలకు మరింత ఖర్చవుతుంది. సాధారణ ఫోటోగ్రఫర్ లు అధిక ధరలని దృష్టిలో ఉంచుకొని వీటికి దూరంగా ఉండటమే కాక, ఎస్ ఎల్ ఆర్ వినియోగదారులు సాంఖ్యిక ఏక కటక పరావర్తన కెమెరా ల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఎస్ ఎల్ ఆర్ ల భవితవ్యం

[మార్చు]

ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 35 ఎం ఎం ఫిలిం ఆధారిత ఎస్ ఎల్ ఆర్ మోడల్ లు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. ఫిలిం ఆధారితాల ఫలితాలలో కొన్ని లాభాలున్ననూ డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరాల ప్రభావం ఎస్ ఎల్ ఆర్ కెమెరాలపై లేకపోలేదు. సౌలభ్యం ఉండటం వలన సాధారణ ఫోటోగ్రఫర్ ల నుండి నిపుణ ఫోటోగ్రఫర్ ల వరకు డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరాల వైపే మొగ్గు చూపుతున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]