లోమోగ్రఫీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అసలైన Lomo LC-A కెమెరా

లోమోగ్రఫీ (ఆంగ్లం: Lomography) అనునది అసాంఖ్యిక ఛాయాచిత్రకళకై ఏర్పడ్డ ఉద్యమము మరియు సమూహము. ఇది అసాంఖ్యిక ఛాయాచిత్రకళని ప్రచారం చేసే Lomographische AG అనే సంస్థ యొక్క ట్రేడ్ మార్కు. అంతర్జాతీయ లోమోగ్రఫిక్ సంఘం (Lomographic Society International) అనునది 1992 లో ఆస్ట్రియాలోని వియన్నాకి చెందిన కొందరు విద్యార్థులు ఏర్పరచారు. వీరికి రష్యా లోని సెయింట్ పీటర్స్‌బర్గ్కి చెందిన లోమో పిఎల్ సి అనే సంస్థచే రూపొందించబడిన లోమో ఎల్ సి-ఏ అనే కెమెరా దొరికినది. ఈ విద్యార్థులు తమకి దొరికిన ఈ కెమెరాతో తీసిన ఛాయాచిత్రాలని వియన్నాలో ప్రదర్శించటంతో లోమోగ్రఫీ కళాసంబంధిత ఉద్యమంగా ఏర్పడినది. పరిపూర్ణ స్వయంచాలితమైన (Fully Automatic) ఈ కెమెరాతో ఛాయాచిత్రాలు సాంకేతికంగా సరిగా వచ్చేవి కావు. వ్యూఫైండర్ లో కనబడే దృశ్యం ఛాయాచిత్రంలో వచ్చే దృశ్యం వేర్వేరుగా ఉండేవి. ఛాయాచిత్రం మధ్యభాగాన కాంతి అత్యధికంగా ఉండి, చివరలకి వెళ్ళే కొద్దీ కాంతి తగ్గిపోయి నలుమూలలా చీకటిమయంగా (విగ్నెటింగ్) ఉండేవి. దీనివలన ఛాయాచిత్రాలు సొరంగం గుండా చూస్తున్న భ్రాంతి కలిగించేవి. తీవ్రత పెంచబడిన రంగుల వలన వివిధ రంగుల మధ్య భేదాలు అధికంగా ఏర్పడేవి. వియన్నా విద్యార్థి బృందం ఈ ఆసక్తికరమైన లక్షణాలు గల ఛాయాచిత్రాలని ఏర్పరచే కెమెరా పై విస్తృత పరిశోధనలు చేయటమే కాక దీని మూలాలు తెలుసుకొనుటకై రష్యా బయలుదేరారు. 1995 నుండి సోవియట్ యూనియన్ వెలుపల ఎల్ సి-ఏ కెమెరాలని విక్రయించే ఏకైక సంస్థగా లోమోగ్రఫీ అవతరించటమే కాక ఈ శ్రేణిలోనే అనేక అసాంఖ్యిక కెమెరాలు, ఫిలింలు, ఫోటోగ్రఫీకి సంబంధించిన ఇతర పరికరాలని స్వంతంగా తయారు చేసే సంస్థగా ఏర్పడినది.

1992 లోనే లోమోగ్రఫిక్ సొసైటీ ఏర్పడినది. ఇది ఇంటర్నెట్ పై కూడా లభ్యం. లోమోగ్రఫీ యొక్క సాంకేతిక అంశాలని అందించటమే కాకుండా ఆఫ్రికా దేశాలలోని అనేక స్వచ్ఛంద సంస్థల సేవా కార్యక్రమాలకి తనవంతు కృషి చేసింది.

లోమోగ్రఫీ ఎటువంటి ప్రణాళిక లేని, మెళకువలు పాటించనవసరం లేని, ఆకస్మిక ఛాయాచిత్రకళ అత్యంత ప్రాధాన్యతని ఇస్తుంది. మామూలుగా అగుపించే రంగుల తీవ్రతని పెంచటం, కటక లోపాలు, తప్పుడు బహిర్గతం వంటి పొరబాట్లను లోమోగ్రఫీ యొక్క ప్రత్యేక లక్షణాలుగా కళాత్మక విలువలుగా పరిగణించబడతాయి.

చరిత్ర[మార్చు]

Lomo LC-A కెమెరా నుండి తీయబడ్డ ఒక ఛాయాచిత్రము

లోమోగ్రఫీ అనునది సృజనాత్మకత మరియు ప్రయోగాత్మక ఛాయాచిత్రకళని ప్రోత్సహించే లోమోగ్రఫిక్ ఛాయాచిత్రకారుల సమూహము. లోమోగ్రఫీ అనే పేరు రష్యా దేశంచే నడుపబడుతున్న సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరానికి చెందిన లెనిన్ గ్రాడ్ ఆప్టికల్ మెకానికల్ అసోసియేషన్ పి ఎల్ సి (Leningrad Optical Mechanical Association PLC) అనే కటకాల తయారీదారు ఉత్పత్తి చేసే 35 ఎం ఎం లోమో ఎల్ సి - ఏ కాంపాక్ట్ ఆటోమేట్ కెమెరా చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఈ కెమెరా 1980లలో లభ్యమైన కోసినా సీఎక్స్-1 అనే కెమెరాని ఆధారంగా చేసుకొని రూపొందించబడింది.

లోమోగ్రఫీ అనగా ఈ ఉద్యమాన్ని నడపటానికి అవసరమైన కెమెరాలని, ఇతర పరికరాలని తయారు చేసే, ఆస్ట్రియాలోని వియన్నాకి చెందిన లోమోగ్రఫిషే ఎజి (Lomographische AG) అనే సంస్థ యొక్క కమర్షియల్ ట్రేడ్ మార్క్ కూడా.

1991 లో ఒక విద్యార్థి సమూహానికి లోమో ఎల్ సి-ఏ అనే కెమెరా దొరికినది. ఈ కెమెరా సృష్టించే ఛాయాచిత్రాలలోని విచిత్రమైన రంగులు, ఒక్కోమారు మసకబారినట్టు ఏర్పడే లక్షణాల వలన ముగ్ధులైనారు. 1992లో అంతర్జాతీయ లోమోగ్రఫిక్ సంఘం ఏర్పడినది. న్యూయార్క్ మరియు మాస్కో నగరాలలో నిర్వహించబడ్డ పలు అంతర్జాతీయ కళా ప్రదర్శనశాల తర్వాత సోవియట్ యూనియన్ వెలుపల లోమో ఎల్ సి-ఏ కెమెరాల ఏకైక పంపిణీదారుగా ఉండేలా లోమోగ్రఫి సంఘం 1995 లో లోమో పి ఎల్ సి సంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది. సెయింట్ పీటర్స్బర్గ్ యొక్క అప్పటి డిప్యూటీ మేయర్, భవిష్యత్ ప్రధాని మరియు రాష్ట్రపతి అయిన వ్లాదిమిర్ పుతిన్తో నగరంలోని లోమో కార్మాగారాన్ని మూసివేయకుండా ఉండే విధంగా పన్ను రాయితీ కొరకు కూడా ఒప్పందం కుదుర్చుకొన్నది.

వివిధ రకాల లోమోగ్రఫీ కెమెరాలు మరియు సాంకేతిక అంశాలు[మార్చు]

లోమోగ్రఫీ పలురకాల పిన్ హోల్ (సూదిబెజ్జం) కెమెరాలు, హోల్గా కెమెరాలు, ఫుజీఫిలిం కెమెరాలు, ఫిష్ ఐ కెమెరాలు, ఎస్ ఎల్ ఆర్ కెమెరాలు, టీ ఎల్ ఆర్ కెమెరాలు మరియు వీటికి కావలసిన బ్లాక్ అండ్ వైట్, కలర్, రెడ్ స్కేల్, పర్పుల్ క్రోం ఫిలిం లు, కటకాలు మరియు ఇతర పరికరాలని విక్రయిస్తుంది. భారతదేశంలో ఢిల్లీకి చెందిన ఫోటోవాటికా.కాం ద్వారా ఇవి లభ్యం.

హాంగ్ కాంగ్ లోని ఒక లోమోగ్రఫీ విక్రయశాల

కన్స్ట్రక్టర్ శ్రేణి[మార్చు]

 • కన్స్ట్రక్టర్ (Konstruktor)
 • కన్స్ట్రక్టర్ డి ఐ వై (Konstruktor DIY)

పిన్ హోల్ శ్రేణి[మార్చు]

 • పేపర్ పిన్ హోల్ కెమెరా (Paper Pinhole Camera)
 • పిన్ హోల్ ఆర్ట్ డి ఐ వై (Pinhole Art DIY)

పి-షరన్ పిన్ హోల్ శ్రేణి[మార్చు]

 • పి-షరన్ ఎస్ క్యూ-35 పిన్ హోల్ (P-Sharan SQ-35 Pinhole)
 • పి-షరన్ స్టాండార్డ్ పిన్ హోల్ (P-Sharan STD Pinhole)

హోల్గా శ్రేణి[మార్చు]

 • హోల్గా 120 పిన్ హోల్ కెమెరా (Holga 120 Pinhole Camera)
 • హోల్గా 120 3డి స్టీరియో కెమెరా (Holga 120 3D Stereo Camera)
 • హోల్గా 120 స్టీరియో పిన్ హోల్ కెమెరా (Holg 120 Stereo Pinhole Camera)
 • హోల్గా 120 జీ ఎన్ (Holga 120 GN)
 • హోల్గా సి ఎఫ్ ఎన్ 120 (Holga CFN 120)
 • హోల్గా 135 ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ (Holga 135 Twin Lens Reflex)
 • హోల్గా 135 (Holga 135)

స్యాంప్లర్ శ్రేణి[మార్చు]

 • సూపర్ స్యాంప్లర్ (SuperSampler)
 • యాక్షన్ స్యాంప్లర్ (Action Sampler)

ఫిష్ ఐ శ్రేణి[మార్చు]

 • ఫిష్ ఐ బేబీ 110 బేసిక్ (Fisheye Baby 110 basic)
 • ఫిష్ ఐ వన్ (Fisheye One)
 • ఫిష్ ఐ నెం.2 (Fisheye No. 2)

డయానా శ్రేణి[మార్చు]

హారిజాన్ శ్రేణి[మార్చు]

 • హారిజాన్ కాంప్యాక్ట్ (Horizon Kompakt)
 • హారిజాన్ పర్ఫెక్ట్ (Horizon Perfekt)

లోమో శ్రేణి[మార్చు]

 • లోమో ఎల్ సి-ఏ (Lomo LC-A)
 • లోమో ఎల్ సి-ఏ రీఫర్బిష్డ్ (Lomo LC-A Refurbished)
 • లోమో ఎల్ సి-ఏ+ (Lomo LC-A+)
 • లోమో ఎల్ సి వైడ్ (Lomo LC Wide)
 • లోమో లూబిటెల్ 166+ (Lomo Lubitel 166+)
 • లోమో స్మెనా సింబల్ (Lomo Smena Symbol)

జెనిట్ శ్రేణి[మార్చు]

 • జెనిట్ 122కే ఎస్ ఎల్ ఆర్ (Zenit 122K SLR)
 • జెనిట్ కేఎం ఎస్ ఎల్ ఆర్ (Zenit KM SLR)
 • జెనిట్ 412 ఎల్ ఎస్ (Zenit 412 LS)
 • జెనిట్ సీ రీఫర్బిష్డ్ (Zenit C Refurbished)
 • జెనిట్ 11 రీఫర్బిష్డ్ (Zenit 11 Refurbished)
 • జెనిట్ ఈ రీఫర్బిష్డ్ (Zenit E Refurbished)
 • జెనిట్ ఎం ఎఫ్ 1 (Zenit MF 1)

ఫూజీఫిలిం శ్రేణి[మార్చు]

 • ఫూజీ ఇన్స్టాక్స్ మిని 90 నియో క్లాసిక్ (Fuji Instax Mini 90 Neo)
 • ఫూజీ ఇన్స్టాక్స్ 50 ఎస్ పియానో బ్లాక్ (Fuji Instax 50 S Piano Black)
 • ఫూజీ క్లాస్సే డబ్ల్యు (Fuji Klasse W)

ఇతరాలు[మార్చు]

 • పాప్ 9 (Pop 9)
 • ఆక్టోమ్యాట్ (Oktomat)
 • లా సార్డీనా (La Sardina)
 • కలర్ స్ప్ల్యాష్ (Colorsplash)
 • స్ప్రాకెట్ రాకెట్ (Sprocket Rocket)
 • బెలెయిర్ ఎక్స్ 6-12 జెట్ సెట్టర్ (Belair X 6-12 Jet Setter)
 • లోమో కినో (Lomo Kino)
 • స్పిన్నర్ 360 (Spinner 360)
 • జోర్కీ 4 రీఫర్బిష్డ్ (Zorky 4 Refurbished)

లోమోగ్రఫీ కెమెరాల చిత్రమాలిక[మార్చు]

కమ్యూనిటీ[మార్చు]

లోమోగ్రఫీ కెమెరాలతో తీయబడ్డ ఛాయాచిత్రాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=లోమోగ్రఫీ&oldid=2436576" నుండి వెలికితీశారు