Jump to content

రెడ్ స్కేల్

వికీపీడియా నుండి
ఒకే దృశ్యాన్ని రెడ్ స్కేల్ ఫిలింతో 7 వివిధ బహిర్గతాల వద్ద చిత్రీకరించిన తీరు. మౌస్ వీల్ తో దీనిని పైకి క్రిందకు స్క్రాల్ చేసినచో ఇది ఒక విచిత్రానుభూతికి గురి చేస్తుంది.

రెడ్ స్కేల్ అనునది ఛాయాచిత్రకళలో ఒక మెళకువ. ఫోటోగ్రఫిక్ ఫిలింని తప్పుడు దిశలో కెమెరా లోకి ఇమడ్చటంతో ఫిలిం యొక్క ముందు వైపుకు బదులుగా వెనుక వైపు కాంతికి బహిర్గతంఅవుతుంది. దీనితో ఒక సి-41 ఫిలిం వెనుక వైపు ఉన్న ఎరుపు రంగు పొర ముందుకు రావటం వలన ఛాయాచిత్రం లోని ఎరుపు పాళ్ళు పెరిగినట్లు కనబడుతుంది. ఎరుపు పాళ్ళు పెరగటం వలన దీనికి ఈ పేరు వచ్చింది. ఫిలింలోని అన్ని పొరలూ నీలి కాంతిని గుర్తించగలవు. కావున సాధారణంగా ఈ నీలి రంగు పొర పైన ఉండి దాని వెనుక ఒక ఫిల్టరు ఉంటుంది. కానీ ఈ ప్రక్రియలో నీలి కాంతి మొదట ఎరుపు రంగు పొరని, దాని వెనుక ఉన్న ఆకుపచ్చని పొరని బహిర్గతం చేస్తుంది. దాని తర్వాత ఉన్న ఫిల్టరు వలన నీలిరంగు పొర పైన కాంతి బహిర్గతం అవ్వదు. ఈ-6 ఫిలిం పై కూడా ఇది సాధ్యపడుతుంది.

వాడే ఫిలింను బట్టి ముదురు ఎరుపు (మెరూన్), ఎరుపు, నారింజ లేదా పసుపు పచ్చ రంగుల పాళ్ళు పెరుగుతాయి.

కలర్ ఫిలింలు వచ్చినప్పటి నుండి ఈ ప్రక్రియ ఉంది. కానీ అప్పట్లో ఇది పొరబాటున జరిగేది. అయితే ఫిలింల ఉపయోగం పరిమితమైన ప్రస్తుత కాలంలో ఈ ప్రభావాన్ని కావాలని తేవటం జనాదరణ పొందినది.

రెడ్ స్లేల్ చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]